బాల్యానికి ఇసుకకు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో ఇసుక తప్పనిసరిగా ఉండాలని గిజూభాయ్ చెప్తారు. నిజానికి ఇసుకను ఆస్వాదించడానికి చిన్నా పెద్దా తేడా ఉండదు. ఇసుకలో కూచున్నపుడు మనం కూడా పిచ్చిగీతలు గీస్తుంటాం. ఇక పిల్లలకు స్వర్గంలా ఉంటుంది. పిచ్చుక గూళ్ళు, గవ్వలు ఏరుకోవడం, పుల్లాట ఇలా సమయం గడచిపోతూనే ఉంటుంది వారికి. పిల్లలకు మట్టి అంటడం, వాటిలో సూక్ష్మ క్రిములు ఉంటాయా తదితర విషయాలు పక్కన పెట్టాలి. ఇసుక తినకుండా చూడాలి అంతే.
ఇసుకలో ఆడుకోవడం వల్ల వ్యాయామం, కాన్సంట్రేషన్, గెస్సింగ్ తదితర నైపుణ్యాలు సాధించవచ్చు.
http://freerangekids.wordpress.com/2009/02/08/let-em-eat-dirt/
ఇది చదవండి.
స్నేహ గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. అది కూడా కరెక్టేమో మరి!