పొద్దుట్నుంచి సాయంత్రం దాకా స్కూళ్ళో తల వాచిన పిల్లలకు హోం వర్క్ అవసరమా? తల్లిదండ్రులను సంతృప్తి పరచడానికి హోం వర్క్ ఒక మార్గం. ఇంటికి రాగానే మళ్ళీ పుస్తకాలు ముందేసుకుని సోలుతూ తూగుతూ రాస్తుంటే అబ్బో మా బాబు / పాప ఏం చదువుతున్నారో అని మురిసిపోవడానికి ఉపయోగపడుతుంది. 6వ తరగతి నుంచి సిలబస్ భారం కాబట్టి అప్పటినుంచి ఇంట్లో మరోసారి పిల్లలు పాఠాలు చదువుకోవడం మంచిది. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు హోం వర్క్ బదులుగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించేలా రోజూ అసైన్మెంట్లు ఇవ్వాలి.
ఉదా.. వయసుకు సంబంధించిన అంశం వచ్చినపుడు ఇంట్లో ఉన్నవారి వయసులు తెలుసుకుని రమ్మనాలి.
అలాగే శాకాహారులు, మాంసాహారులు, మెడిసినల్ ప్లాంట్లు, నాయకుల పేర్లు వగైరా..
అయితే ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్ళు ఇలాంటివి ప్రాజెక్టుల రూపంలో నెలకోసారి ఇస్తున్నాయి. వాళ్ళు దీన్ని కూడా అతిగా చేస్తారు. వీటికి సంబంధించిన సమాచార సేకరణ కోసం తల్లిదండ్రులు ( పాపం వారికి కంప్యూటర్ గురించి నెట్టు గురించి తెలీదు ) నెట్ సెంటర్లలోకి వచ్చి నానా తిప్పలు పడుతుంటారు. పిల్లలు చేయాల్సిన ప్రాజెక్టులు ముక్కుతూ మూలుగుతూ వీళ్ళు చేస్తుంటారు.
అలా కాకుండా పిల్లలు సొంతంగా ఆలోచించి సులభంగా చేసే అసైన్మెంట్లు ఇవ్వాలి. స్కూళ్ళో ఇవ్వకపోయినా మనమే సిలబస్ కు అనుగుణంగా ఇలాంటివి చేయించవచ్చు.
చాలా మంచి ఆలోచన
తల్లిదండ్రులు కొన్నిసార్లు బయట ఎవరికైనా డబ్బులిచ్చి ఆ ప్రాజెక్టులు చేయిస్తున్నారు. పిల్లలకి ఎంత వరకూ మేలు జరుగుతుందో ఎవరికీ పట్టడంలేదు. మీ ఆలోచన బాగుంది.
చాలా మంచి ఆలోచన. కానీ ఇంటికి వచ్చిన తరువాత ఈ రోజు చెప్పిన పాఠాలని ఒకసారి చదువుకునే అలవాటు మాత్రం తప్పనిసరిగా చేయాలి.
@ సౌమ్య, శిశిర గార్లకు ధన్యవాదాలు
@ విజయ్ గారు
బడిలో కాన్సెప్ట్ ను బాగా వివరిస్తే ప్రాథమిక స్థాయి వరకు హోం వర్క్ లేదా తిరిగి ఇంట్లో చదవడం కూడా అనవసరం అని నా అభిప్రాయం. నిజానికి పొద్దున బడిలో చదివిన అంశాలనే సాయంత్రం ప్రాజెక్ట్ లాగా ఇవ్వాలి. అదే పునశ్చరణ అవుతుంది.