చిరకాల మిత్రులు, ఉత్తమ సినీవిమర్శకులుగా 2010లో నంది అవార్డు అందుకున్న వట్టికూటి చక్రవర్తి గారు జీవనికి 5000/- విరాళం అందించారు. చక్రి మొదట ఈనాడు ఆదివారంలో సహాయ సంపాదకులుగా ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఈనాడు సినిమాకు పనిచేసారు. అప్పుడే ఆయన అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఈనాడు దినపత్రికలో జనరల్ బ్యూరోలో కొన్ని విభాగాలకు ఇంచార్జ్ గా పనిచేస్తున్నారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 




 

Read More



అనంతపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు బ్యాల్ల కిరణ్ కుమార్ మరియు శ్రీమతి సునీత గార్ల కుమారుడు లక్షిత్ శ్రీరాం మొదటి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వారు జీవనికి 10,000/- విరాళం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.



Read More

జీవనికి ప్రధాన దాతల్లో ఒకరు మరియు జీవని కార్యకలాపాల్లో నిత్యం పాలుపంచుకునే నార్పల సప్తగిరిరెడ్డి గారు (  CEO, సాయి దత్తా మ్యాక్ సొసైటీ) 50 కిలోల ఉప్మారవ్వ 3500/- నగదు విరాళంగా ఇచ్చారు. కొద్దిరోజుల కిందట ఆయన అన్నదాన కార్యక్రమం (బయట) నిర్వహించారు. అందులో కొంత భాగం, డబ్బు మిగలడంతో దాన్ని తిరిగి జీవనికి ఇచ్చారు. శ్రమతో వీటిని మాకు చేర్చిన వారు కనంపల్లి నరేంద్రరెడ్డి గారు ( తులసి మినరల్ వాటర్ యజమాని). వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Read More


మిత్రులారా బాలికల డార్మిటరీకి సంబందించిన విషయాలను http://jeevani2009.blogspot.in/2013/10/75000.html ఈ టపాలో చూడవచ్చు. ఇక మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఇలా ఉంది.
1) డార్మిటరీ : 30 X 30 = 900 చ.అడుగులు = 900 X 1200/- = 10,08,000/-
2) స్టోర్ రూం / ఇతరత్రా వినియోగానికి : 30 X 10 = 300 X 1200/- = 3,36,000/-
3) బాత్రూంలు + టాయిలెట్లు = 10 X 45 = 450 X 500/- = 2,25,000/-
4) వరండా / స్టడీ రూం / లైబ్రరీ = 10X45 =  450X500/- = 2,25,000/-
మొత్తం 17,94,000/-

నిధుల లభ్యతను బట్టి నిర్మాణం కొనసాగుతుంది. 
1. డార్మిటరీ 
2. బాత్రూంలు & టాయిలెట్లు 
3. స్టోర్ రూం 
4. వరండా 








ఇందుకోసం  ఇప్పటికే అందిన విరాళాలు 


6000 - Santosh Krishnamoorthy
6000  - Kishore Kumar 
6000  - Bhargav Tadepalli
6000  - Sreekanth Kamineni
6000  - Ronak Tak
6000  - Rahul Sowmian 
6000  - Ramshankar Subbaiah
6000  - Upendar Rao Peram
6000  - Ravi Kiran Reddy Chada
3000  - Sarat Apparasu 
3500  - Jitendra Yarlagadda 
14500- Shyam Kandala 

30000- Atluri Bhavani Charitable Trust, Gudivada

18000- Archish Soto

12000- Sarasu
----------------------------------------------

 1,35,000/-
----------------------------------------------
ఇస్తామని చెప్పినవారు 
150000 - chinnapa reddy
50000   - Late Ranga reddy family members
8000     - Kranthi
డార్మిటరీ నిర్మాణానికి మీ వంతు సహకారాన్ని వస్తు / ధన రూపేన ఆశిస్తూ 
ధన్యవాదాలతో 
జీవని. 
contact : jeevani.sv@gmail.com

Read More



పిట్స్ బర్గ్ లో ఉంటున్న శ్రీమతి సరసు గారు బాలికల డార్మిటరీకి 12,000/- విరాళం అందించారు. అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారి ద్వారా ఈ విరాళం అందింది. జీవని తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


డార్మిటరీకి అంచనా వ్యయం తదితర వివరాలు రేపు టపాలో వెల్లడిస్తాము. కొలతలు, నిర్మాణ వ్యయం పక్కాగా లెక్కవేయాలని అనుకున్నాము.  అందువల్ల ఆలస్యం అవుతోంది. 


ధన్యవాదాలు. 




Read More



పిట్స్ బర్గ్ లో ఉంటున్న డాక్టర్ రమణమూర్తి మరియు శ్రీమతి ఇందుబాల గార్లు తమ మనవడు ARCHISH SOTO పేరు మీద జీవనికి విరాళం అందించారు. అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారి ద్వారా ఈ విరాళం అందింది. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెల్పుతున్నము. దీన్ని బాలికల డార్మిటరీకి వినియోగించనున్నాము. డార్మిటరీ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తర్వాతి టపాలో తెలియజేస్తాము.       



Read More


గుడివాడకు చెందిన అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్ వారు జీవనిలో బాలికల డార్మిటరీ నిర్మాణానికి 30,000/- విరాళం అందిచారు. మంత్లీ డోనర్గా వారు ప్రతినెలా జీవనికి 4000/- విరాళం అందిస్తున్నారు.   వారి సహాయ సహకారాలకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 



Read More



బెంగళూరులో ఉంటున్న శ్రీమతి.సౌజన్యగారు జీవనికి 6000/- విరాళం అందించారు. వారి భర్త సతీష్ ధనుంజయ్ గారు ( software engineer, TDC Ltd. ) జీవనికి మంత్లీ డోనర్ కూడా.  వీరికి పిలల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  




ABOUT JEEVANI...

quick view : JEEVANI is an orphanage. Giving shelter to 37 parentless children. It is located in Rotary puram village, Bukkaraya samudram mandal, Anantapur district, Andhra pradesh, India
contact : jeevani.sv@gmail.com, phone: +91 9440547123
 
account details:
SBI : JEEVANI VOLUNTARY ORGANISATION, CURRENT ACCOUNT 30957763358 
TREASURY BRANCH, ANANTAPUR, IFSC CODE : SBIN0012831

ICICI : JEEVANI VOLUNTARY ORGANISATION, CURRENT ACCOUNT 043905000999 ANANTAPUR IFSC CODE: ICIC0000439

ANDHRA BANK : JEEVANI VOLUNTARY ORGANISATION, S.B. ACCOUNT 038510100023594, 0385 NEW TOWN ANANTAPUR COURT ROAD. IFSCCODE: ANDB0000385
 
request to NRIs, pl. send your dontions only from your INDIAN ACCOUNT, we don't have permission to receive foreign currency as donations. 

Read More



పిట్స్ బర్గ్ లో ఉంటున్న గిరి నర్రా గారి జన్మదినం నేడు. ఈ సందర్భంగా వారు పిల్లలకు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. అయితే ఇది నిన్న చేసాము. ఈరోజు మరో బర్త్ డే ఉండటం వల్ల మీల్స్ నిన్ననే పెట్టించాము. గిరి గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 


 

Read More




When you want something, all the universe conspires in helping you to achieve it.

-Paulo Coelho


ఇది నిజమేమో అనిపిస్తుంది. జీవని విద్యాలయానికి డెస్కులు స్పాన్సర్ చేస్తామని ఒకాయన చెప్పారు. మొత్తం 70,000/- ప్రాజెక్టు. ఆయన ఐరన్ తీయించి కొన్ని ఇబ్బందుల వల్ల డ్రాప్ అయ్యారు. ఈ ఐరన్ ఎక్కడా పెట్టుకోలేము. పోనీ కంప్లీట్ చేయిద్దాం అంటే 50,000/- డొనేషన్లు సేకరించాలి. తర్జనభర్జనల అనంతరం డెస్కులు చేయించాలని అనుకున్నాము. తర్వాత కొద్దిరోజులకే 30,000/- విరాళాలు వచ్చాయి. ఇక చివరి పేమెంటు కాస్త టైట్ అయింది. 20కె ప్రామిస్ ఒకటి జాప్యం అవసాగింది. డెస్కులు రెడీ అయిపొయాయి, తీసుకోవాలి. డబ్బు ఇబ్బంది అవుతోంది. సరిగ్గా అప్పుడు ఫేస్ బుక్లో పరిచయం అయిన  తాడిపత్రికి చెందిన కాకర్ల రంగనాయకులు గారు, కాల్ చేసారు. (ఆయన కూడా కేవలం వారం కిందట జీవని గురించి ఎఫ్.బి.లో చూసారట). మరుసటిరోజు జీవనికి వచ్చారు. తమ పాప బర్త్ డే సందర్భంగా 20,000/- ఇవ్వాలనుకుంటున్నాము అన్నారు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాము.  ( బాలికలకు ప్రత్యేక డార్మిటరీ కోసం వచ్చిన విరాళాలు ఉన్నప్పటికీ వాటిని డైవర్ట్ చేయరాదన్న ఉద్దేశంతో ఇలా చేసాము ) డెస్కులు నిన్న జీవనికి వచ్చాయి.
ఇక ఈ విరాళానికి కర్త అయిన యోఙ్ఞవి పుట్టినరోజు నేడు   ( 20.10.2013). శ్రీ కాకర్ల రంగనాయకులు శ్రీమతి కవిత గార్ల కుమార్తె.







































ఈ సందర్భంగా వీరు  కాకర్ల రంగనాథ సేవా సమితి తరఫున విరాళం అందించారు.
వీరు తాడిపత్రిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.











పిల్లల తరఫున యోఙ్ఞవికి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే కాకర్ల కుటుంబ సభ్యులందరికీ 
 ఆయురారోగ్యాలు కలగాలని వారు మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నాము.



డెస్కుల ప్రాజెక్టు దాతలు
విజయ భాస్కర్, Anantapur : ఐరన్
కాకర్ల రంగనాథ  సేవా సమితి, Tadipatri : 20,000/-
Srinivasa Ramanujan Institute of technology స్టాఫ్ : 20,000/-
రమేష్, Nellore : 5000/-
దయాజ్, Nellore: 5000, /-
వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.




Read More


చి.సాత్విక్ జన్మదినం నేడు. జీవని పిల్లల తరఫున సాత్విక్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, ఆయురారోగ్యాలతో ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నము. జీవనికి 9000/- విరాళం అందించిన సాత్విక్ కు ధన్యవాదాలు.
బ్లాగు మిత్రులు వారి కుటుంబసభ్యులకు, జీవని ఫ్యామీలీకి దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము.






Read More


 మిత్రులారా అనంతపురంలో ఈ విద్యా సంవత్సరంలో నెలకొల్పి బాగా పేరుపొందిన AFFLATUS GLOBAL SCHOOL పిల్లలు జీవనికి వచ్చారు. AGS, కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా ఉన్నప్పటికీ విలువలతో కూడిన విద్య, విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వం మీద శ్రద్ధ చూపడం ఫిలాసఫీగా ఈ స్కూల్ నడుస్తోంది. దీనికి ప్రిన్సిపల్ సాల్మన్ రాజు. పిల్లలందరూ ఉన్నత వర్గానికి చెందినవారు. వారికి సాల్మన్ జీవని గురించి ముందే చెప్పారు. దీంతో రకరకాల గిఫ్టులు పట్టుకొచ్చారు పిల్లలు. జీవని పిల్లలతో బాగా కలసిపోయారు. తమ బర్త్ డేలకు మళ్ళీ వస్తామన్నారు. 




 వందేమాతరం పాడుతున్న జీవని మరియు AGS పిల్లలు



 ఎప్పటిలాగే మైకాసురుడు శివ కుమార్ ...





 ఒక చక్కటి జోక్ చెప్పిన షిర్లీ డాటరాఫ్ సాల్మన్ రాజు


 చిన్న స్కిట్


 జోక్ చెప్తున్న గణేష్


 SALOMAN RAJU





 ఈ పెద్దాయన సాల్మన్ వాళ్ల ఇంగ్లీష్ సార్. అనంతయ్య గారు. కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్లో  రిటైరయ్యాక ఇప్పుడు శిష్యుడి స్కూల్లో పనిచేస్తున్నారు / చేయిస్తున్నారు. ఆయన సాల్మన్ కు సగం బలం. ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే ఇక్కడ సరిపోదు. కుర్చీలు వేయడం, నీళ్ళు ఇవ్వడం, చిన్నాచితకా పనులు చేయడానికి కూడా వెనుకాడరు. చెప్పినా వినరు. ఇది నా పని కాదా, చేస్తే తప్పేం ఉంది అని దబాయిస్తారు. ఇంత గొప్ప గురువు దొరకడం, వారు మాకు పరిచయం కావడం మా అదృష్టం. ఆయన స్పెషల్ మీల్స్ పెట్టించమని విరాళం ఇస్తున్న దృశ్యం.










 షిర్లీ వరుసగా రెండో సంవత్సరం తన కిడ్డీ బ్యాంకు డబ్బును పిల్లలకు అందజేసింది. 550/- . సంవత్సరం పాటు తన ఆశలో, తృప్తిలో కొంత భాగాన్ని అణచుకుని వాటిని పొదుపు చేసి జీవని పిల్లలకు అందించిన షిర్లీకి హ్యాట్సాఫ్ .





 పిల్లల విజిట్ పై సంధ్య స్పందన


 GIFTS


Read More


 ఈ రోజు పిల్లలకు క్విజ్ పోటీలు పెట్టాము. 4-6 తరగతులు ఒక బ్యాచ్. 7-9 ఒక బ్యాచ్.



 మిత్రులు శ్రీనివాసరెడ్డి ( తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్ ) దీన్ని నిర్వహించారు. బహుమతులు కూడా స్పాన్సర్ చేసారు. ప్రశ్నల తయారీలో వారి శ్రీమతి నాగలక్ష్మి గారు సహాయపడ్డారు. క్విజ్ నిర్వహణలో కుమారస్వామి రెడ్డిగారు ( అసిస్టెంట్ రిజిస్ట్రార్ - చిట్స్, అనంతపురం ) పాల్గొన్నారు. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మొదటి బహుమతిగా నిఘంటువులు ఇవ్వాలని శ్రీను అనుకున్నారు. అయితే బంద్ వల్ల అవి దొరకలేదు. రెండవ బహుమతిగా సెట్ చేసేవి ఇచ్చారు.




 క్విజ్ అవుతుండగా సోదరులు డాక్టర్ హరిప్రసాద్ ( అనంతపురంలో ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు ), డాక్టర్ జయంత్ ( ప్రముఖ దంత వైద్యులు ) వచ్చారు. వారితో పిల్లలకు బహుమతుల ప్రదానం చేయించాము.



 ఈ లోపు హరి చెప్పారు, ఈ రోజు జయంత్ గారి బర్త్ డే అని. అందరం శుభాకాంక్షలు చెప్పాము. జయంత్ గారు చాలా సంతోషించారు. హరి సర్ప్రైజ్ చేసాడని చెప్పారు. డాక్టర్లు తమ కర్తవ్యం మరచిపోరు కదా ! ఇద్దరూ చెరోపక్క పిల్లల్ని పరీక్షించారు. కొంతమందికి పళ్ళ సమస్య ఉన్నట్టు గుర్తించారు. వారికి వైద్యం అందిస్తాను అని జయంత్ చెప్పారు. తన వెంట తెచ్చిన బోల్డన్ని బిస్కెట్లు, బ్రెడ్లు, స్వీట్లు, పండ్లు పిల్లలకు పంచారు. హరి 1000/- విరాళంగా ఇచ్చారు. ప్లాన్ లేకుండా వచ్చినా చాలా సంతోషంగా గడిపామని డాక్టర్లు అనంతపురానికి బయల్దేరారు. వీరికి కూడా పిల్లల తరఫున ధన్యవాదాలు.




  జయంత్ గారూ మరోసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Read More



మిత్రులారా జీవనిలో LKG నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మొదటి అంతస్థులో బాలబాలికలు పక్కపక్కన డార్మిటరీల్లో ఉంటున్నారు. పిల్లలు అందరూ సోదరభావంతో మెలగుతూ ఉంటారు. అయితె పెరుగుతున్న వారి వయసును దృష్టిలో పెట్టుకుని బాలికలకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డార్మిటరీని నిర్మించాలని అనుకుంటున్నాము. వచ్చే జూన్ కల్లా దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాము. ఇలా ఆలొచిస్తున్నప్పుడే జీవని మంత్లీ డోనర్ వినీల్ గారు ఫోన్ చేసి తమ మిత్రులు ( అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్ వారు మరియు వారి మిత్ర బృందం ) జీవనికి 75,000/- విరాళం ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పారు.


ఇక్కడ ఒక విషయం గుర్తుకు వస్తోంది...అనంతపురం సేవా రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న Rural Development Trust ( RDT ) కి చీఫ్ MONCHO FERRER. వాళ్ల నాన్నగారు Late. VICENT FERRER. వారే వ్యవస్థాపకులు. అనంతపురానికి దగ్గర్లో ఒక ఆస్పత్రి నెలకొల్పాలని అనుకున్నారట. అయితే అందుకు తగ్గ నిధులు వాళ్ళ దగ్గర లేవు. ఇదే విషయాన్ని ఆయన ఫాదర్ కు చెప్పారు. ఆయన అన్నారట మాంచొ మంచి పనిచేయాలని అనుకున్నపుడు డబ్బు గురించి ఆలోచించవద్దు అదే వస్తుంది అని. అలా మొండి ధైర్యంతో ఆస్పత్రి ప్రారంభించారు. అది ఇప్పుడు జిల్లాలోనే పేదలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఆస్పత్రి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఉంది. ఈ విషయాన్ని జీవని ఆశ్రమం శంకుస్థాపన రోజున ముఖ్య అతిథిగా వచ్చిన మాంచో ఫెర్రర్ చెప్పారు. ఇదే మాకు కూడా స్ఫూర్తి. 


జీవనికి కార్పస్ ఫండ్ లేదు, నెలకు 30 వేల రూపాయల డెఫిసిట్తో నడుస్తోంది, అయినా 1 సంవత్సర కాలంగా ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడలేదు. వస్తూనే ఉన్నాయి. సమయానికి ఎవరో ఒకరు స్పందించి  ఆదుకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు  తెలియజేస్తున్నాము.

ఇక 75,000/- విరాళం దగ్గరికి వస్తే తెలుగు బ్లాగర్ రెహమాన్ తన మిత్రుడు వినీల్ ను పరిచయం చేసారు, ఆయన శ్రీ గారిని, వారి మిత్రులు శ్యాం గారు , ఫైనల్గా శ్యాం గారి ఫ్రెండ్స్. వీరందరూ కలసి విరాళం పంపారు.
వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది బాలికల వసతి గృహానికి మొదటి డొనేషన్. ఈ నిర్మాణానికి అంచనా వ్యయాన్ని తర్వాతి టపాలో తెలియబరుస్తాము.


Santosh Krishnamoorthy - 6000
 
Kishore Kumar - 6000
 
Bhargav Tadepalli - 6000
 
Sreekanth Kamineni - 6000
 
Ronak Tak - 6000
 
Rahul Sowmian - 6000
 
Ramshankar Subbaiah - 6000
 
Upendar Rao Peram - 6000
 
Ravi Kiran Reddy Chada - 6000
 
Sarat Apparasu - 3000
 
Jitendra Yarlagadda (Sri's friend) - 3500
 
Shyam Kandala - 14500
 
*  ఈ విరాళం చాలా రోజుల కిందటే అందింది. అయితే ఇంటర్నెట్ కనెక్షన్ లేక పోస్ట్ పెట్టడం ఆలస్యం అయింది. 
thank you

Read More



గార్లదిన్నె గ్రామానికి చెందిన అనితగారు ఈ రోజు తమ నాన్నగారు స్వర్గీయ రాజశేఖర రెడ్డిగారి  స్మృతిలో జీవనికి 15,000/- విలువైన వస్తుసామగ్రి విరాళంగా ఇచ్చారు. 100 కె.జి.ల బియ్యం, 50 కె.జి.ల కందిపప్పు, చక్కెర, 45 లీటర్ల వంటనూనె తీయించారు. ఈరోజు వంటకు కూరగాయలతో సహా ప్రతి చిన్న వస్తువు తాము కొన్నదే వాడాలి అని చెప్పారు. ఈరోజు అనంతపురంలో బంద్ ఉద్దృతంగా ఉంది. కనీసం ఒక రోడ్డు  నుంచి ఇంకో రోడ్డుకు పోవాలన్నా కష్టంగా ఉంది. వీటన్నిటిని ఎదుర్కుని స్వీట్లు, పండ్లు కొని తెచ్చారు. వారి నాన్నగారికి ఇష్టమైన మెనూను ఆమె ముందే చెప్పి చేయించారు. పిల్లలకు కొసరికొసరి వడ్డించారు. అనితగారితో పాటు వాళ్ళ అమ్మగారు లక్ష్మిదేవి, సోదరుడు శ్రీధర్ రెడ్డి, కుమారుడు సాయి వచ్చారు. పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 




Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo