మిత్రులారా అనంతపురంలో ఈ విద్యా సంవత్సరంలో నెలకొల్పి బాగా పేరుపొందిన AFFLATUS GLOBAL SCHOOL పిల్లలు జీవనికి వచ్చారు. AGS, కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా ఉన్నప్పటికీ విలువలతో కూడిన విద్య, విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వం మీద శ్రద్ధ చూపడం ఫిలాసఫీగా ఈ స్కూల్ నడుస్తోంది. దీనికి ప్రిన్సిపల్ సాల్మన్ రాజు. పిల్లలందరూ ఉన్నత వర్గానికి చెందినవారు. వారికి సాల్మన్ జీవని గురించి ముందే చెప్పారు. దీంతో రకరకాల గిఫ్టులు పట్టుకొచ్చారు పిల్లలు. జీవని పిల్లలతో బాగా కలసిపోయారు. తమ బర్త్ డేలకు మళ్ళీ వస్తామన్నారు.
వందేమాతరం పాడుతున్న జీవని మరియు AGS పిల్లలు
ఎప్పటిలాగే మైకాసురుడు శివ కుమార్ ...
ఒక చక్కటి జోక్ చెప్పిన షిర్లీ డాటరాఫ్ సాల్మన్ రాజు
చిన్న స్కిట్
జోక్ చెప్తున్న గణేష్
SALOMAN RAJU
ఈ పెద్దాయన సాల్మన్ వాళ్ల ఇంగ్లీష్ సార్. అనంతయ్య గారు. కొడిగెనహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్లో రిటైరయ్యాక ఇప్పుడు శిష్యుడి స్కూల్లో పనిచేస్తున్నారు / చేయిస్తున్నారు. ఆయన సాల్మన్ కు సగం బలం. ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే ఇక్కడ సరిపోదు. కుర్చీలు వేయడం, నీళ్ళు ఇవ్వడం, చిన్నాచితకా పనులు చేయడానికి కూడా వెనుకాడరు. చెప్పినా వినరు. ఇది నా పని కాదా, చేస్తే తప్పేం ఉంది అని దబాయిస్తారు. ఇంత గొప్ప గురువు దొరకడం, వారు మాకు పరిచయం కావడం మా అదృష్టం. ఆయన స్పెషల్ మీల్స్ పెట్టించమని విరాళం ఇస్తున్న దృశ్యం.
షిర్లీ వరుసగా రెండో సంవత్సరం తన కిడ్డీ బ్యాంకు డబ్బును పిల్లలకు అందజేసింది. 550/- . సంవత్సరం పాటు తన ఆశలో, తృప్తిలో కొంత భాగాన్ని అణచుకుని వాటిని పొదుపు చేసి జీవని పిల్లలకు అందించిన షిర్లీకి హ్యాట్సాఫ్ .
పిల్లల విజిట్ పై సంధ్య స్పందన
GIFTS
0 వ్యాఖ్యలు