గార్లదిన్నె గ్రామానికి చెందిన అనితగారు ఈ రోజు తమ నాన్నగారు స్వర్గీయ రాజశేఖర రెడ్డిగారి స్మృతిలో జీవనికి 15,000/- విలువైన వస్తుసామగ్రి విరాళంగా ఇచ్చారు. 100 కె.జి.ల బియ్యం, 50 కె.జి.ల కందిపప్పు, చక్కెర, 45 లీటర్ల వంటనూనె తీయించారు. ఈరోజు వంటకు కూరగాయలతో సహా ప్రతి చిన్న వస్తువు తాము కొన్నదే వాడాలి అని చెప్పారు. ఈరోజు అనంతపురంలో బంద్ ఉద్దృతంగా ఉంది. కనీసం ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకు పోవాలన్నా కష్టంగా ఉంది. వీటన్నిటిని ఎదుర్కుని స్వీట్లు, పండ్లు కొని తెచ్చారు. వారి నాన్నగారికి ఇష్టమైన మెనూను ఆమె ముందే చెప్పి చేయించారు. పిల్లలకు కొసరికొసరి వడ్డించారు. అనితగారితో పాటు వాళ్ళ అమ్మగారు లక్ష్మిదేవి, సోదరుడు శ్రీధర్ రెడ్డి, కుమారుడు సాయి వచ్చారు. పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

0 వ్యాఖ్యలు