ఈ రోజు పిల్లలకు క్విజ్ పోటీలు పెట్టాము. 4-6 తరగతులు ఒక బ్యాచ్. 7-9 ఒక బ్యాచ్.
మిత్రులు శ్రీనివాసరెడ్డి ( తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్ ) దీన్ని నిర్వహించారు. బహుమతులు కూడా స్పాన్సర్ చేసారు. ప్రశ్నల తయారీలో వారి శ్రీమతి నాగలక్ష్మి గారు సహాయపడ్డారు. క్విజ్ నిర్వహణలో కుమారస్వామి రెడ్డిగారు ( అసిస్టెంట్ రిజిస్ట్రార్ - చిట్స్, అనంతపురం ) పాల్గొన్నారు. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మొదటి బహుమతిగా నిఘంటువులు ఇవ్వాలని శ్రీను అనుకున్నారు. అయితే బంద్ వల్ల అవి దొరకలేదు. రెండవ బహుమతిగా సెట్ చేసేవి ఇచ్చారు.
క్విజ్ అవుతుండగా సోదరులు డాక్టర్ హరిప్రసాద్ ( అనంతపురంలో ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు ), డాక్టర్ జయంత్ ( ప్రముఖ దంత వైద్యులు ) వచ్చారు. వారితో పిల్లలకు బహుమతుల ప్రదానం చేయించాము.
ఈ లోపు హరి చెప్పారు, ఈ రోజు జయంత్ గారి బర్త్ డే అని. అందరం శుభాకాంక్షలు చెప్పాము. జయంత్ గారు చాలా సంతోషించారు. హరి సర్ప్రైజ్ చేసాడని చెప్పారు. డాక్టర్లు తమ కర్తవ్యం మరచిపోరు కదా ! ఇద్దరూ చెరోపక్క పిల్లల్ని పరీక్షించారు. కొంతమందికి పళ్ళ సమస్య ఉన్నట్టు గుర్తించారు. వారికి వైద్యం అందిస్తాను అని జయంత్ చెప్పారు. తన వెంట తెచ్చిన బోల్డన్ని బిస్కెట్లు, బ్రెడ్లు, స్వీట్లు, పండ్లు పిల్లలకు పంచారు. హరి 1000/- విరాళంగా ఇచ్చారు. ప్లాన్ లేకుండా వచ్చినా చాలా సంతోషంగా గడిపామని డాక్టర్లు అనంతపురానికి బయల్దేరారు. వీరికి కూడా పిల్లల తరఫున ధన్యవాదాలు.
జయంత్ గారూ మరోసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
0 వ్యాఖ్యలు