When you want something, all the universe conspires in helping you to achieve it.

-Paulo Coelho


ఇది నిజమేమో అనిపిస్తుంది. జీవని విద్యాలయానికి డెస్కులు స్పాన్సర్ చేస్తామని ఒకాయన చెప్పారు. మొత్తం 70,000/- ప్రాజెక్టు. ఆయన ఐరన్ తీయించి కొన్ని ఇబ్బందుల వల్ల డ్రాప్ అయ్యారు. ఈ ఐరన్ ఎక్కడా పెట్టుకోలేము. పోనీ కంప్లీట్ చేయిద్దాం అంటే 50,000/- డొనేషన్లు సేకరించాలి. తర్జనభర్జనల అనంతరం డెస్కులు చేయించాలని అనుకున్నాము. తర్వాత కొద్దిరోజులకే 30,000/- విరాళాలు వచ్చాయి. ఇక చివరి పేమెంటు కాస్త టైట్ అయింది. 20కె ప్రామిస్ ఒకటి జాప్యం అవసాగింది. డెస్కులు రెడీ అయిపొయాయి, తీసుకోవాలి. డబ్బు ఇబ్బంది అవుతోంది. సరిగ్గా అప్పుడు ఫేస్ బుక్లో పరిచయం అయిన  తాడిపత్రికి చెందిన కాకర్ల రంగనాయకులు గారు, కాల్ చేసారు. (ఆయన కూడా కేవలం వారం కిందట జీవని గురించి ఎఫ్.బి.లో చూసారట). మరుసటిరోజు జీవనికి వచ్చారు. తమ పాప బర్త్ డే సందర్భంగా 20,000/- ఇవ్వాలనుకుంటున్నాము అన్నారు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాము.  ( బాలికలకు ప్రత్యేక డార్మిటరీ కోసం వచ్చిన విరాళాలు ఉన్నప్పటికీ వాటిని డైవర్ట్ చేయరాదన్న ఉద్దేశంతో ఇలా చేసాము ) డెస్కులు నిన్న జీవనికి వచ్చాయి.
ఇక ఈ విరాళానికి కర్త అయిన యోఙ్ఞవి పుట్టినరోజు నేడు   ( 20.10.2013). శ్రీ కాకర్ల రంగనాయకులు శ్రీమతి కవిత గార్ల కుమార్తె.







































ఈ సందర్భంగా వీరు  కాకర్ల రంగనాథ సేవా సమితి తరఫున విరాళం అందించారు.
వీరు తాడిపత్రిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.











పిల్లల తరఫున యోఙ్ఞవికి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే కాకర్ల కుటుంబ సభ్యులందరికీ 
 ఆయురారోగ్యాలు కలగాలని వారు మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నాము.



డెస్కుల ప్రాజెక్టు దాతలు
విజయ భాస్కర్, Anantapur : ఐరన్
కాకర్ల రంగనాథ  సేవా సమితి, Tadipatri : 20,000/-
Srinivasa Ramanujan Institute of technology స్టాఫ్ : 20,000/-
రమేష్, Nellore : 5000/-
దయాజ్, Nellore: 5000, /-
వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.




on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. Anonymous Says:
  2. Jeevani for uncared,
    but for new visitor,
    there is no info
    to whom contact,
    that what ur people r presently
    handling at what place,
    it should happen easily in a blog.

    this info if not provided,
    ur going to miss so many people,
    Plz. put atleast put a permanant address.

     
  3. jeevani Says:
  4. anonymous గారూ
    మీరు చెప్పింది నిజమే కొత్తవారికి కాస్త ఇబ్బందే. కాంటాక్ట్ ట్యాబ్ ఉంచుతాము.
    aboutలో మెయిల్ ఐడి ఉంది. మొదట దీనికి కాంటాక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో మిగతా సమాచారం ఇవ్వలేదు. మీ సూచనకు ధన్యవాదాలు.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo