ఎత్తైన భవనాలు, చిన్న మనసులు....విశాలమైన దారులు, సంకుచితమైన స్వభావాలు... ఖర్చు ఘనం, తృప్తి స్వల్పం... ఎక్కువ వస్తువులు, తక్కువ ఆనందం... ఆస్తులు పెరుగుతున్నాయ్ , విలువలు తగ్గుతున్నాయ్... ప్రేమించే మనసు మోడువారింది. పర నిందకు సిధ్ధంగా ఉంటాం. ఎలా బతకాలో తెలుసు కాని నిండుగా బతకలేక పోతున్నాం... చందమామను అందుకుంటాం మన పొరుగు వారి హీన స్థితిని పట్టించుకోం... నాలుగు చేతులా సంపాదిస్తాం... సంపాదిస్తాం... సంపాదిస్తూనే ఉంటాం... వయసు పరిగెడుతూనే ఉంటుంది... వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడో మినుకు మినుకు మంటూ మనం చేసిన మంచి పనులు కనపడుతూ ఉంటాయి......