మిత్రులారా 2009లో ప్రారంభమైన జీవని మీ అందరి కళ్ళముందూ ఎదుగుతోంది. ఇంతవరకూ మనం 24 మంది చిన్నారులకు నీడను ఇస్తున్నాము. వచ్చే విద్యా సంవత్సరానికి మరో 26 మందిని చేర్చుకోవాలని జీవని కార్యవర్గం నిర్ణయించింది. ఇప్పటివరకూ నగరంలోని సన్ షైన్ పాఠశాలలో పిల్లలు చదివారు. అక్కడే హాస్టల్లో ఉండేవారు.
ఇప్పుడు జూన్ లో జీవని హాస్టల్ ప్రారంభం అవుతుంది. పిల్లలందర్నీ రోటరీపురం దగ్గర ఉన్న పాఠశాలలో చేర్చనున్నాము. జీవని విద్యాలయం నిర్మాణం మరోవైపు సాగుతుంటుంది. 
మీకు తెలిసి, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటె దయచేసి మాకు తెలియజేయండి. వయసు  0-7 లోపు ఉండాలి. వయసు పరిమితి ఎందుకంటే..
పిల్లలకి కేవలం నీడను ఇవ్వడం జీవని ప్రధాన ఉద్దేశం కాదు. వారికి ఉన్నత చదువులు అందించి  విలువలు, సేవాభావం పెంపొందించి తర్వాతి తరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి. వీటన్నిటిని అందించాలంటే సరైన వయసు 7 సంవత్సరాల లోపే అని భావించాము. 
కుల మత ప్రాంతాల ప్రసక్తి లేదు. 
గతంలో ఒక పేరెంట్ ఉన్నా పరిస్థితిని బట్టి పిల్లల్ని తీసుకున్నాము. అయితే ఈసారి నుంచి తల్లి,తండ్రి ఇద్దరు లేని పిల్లలే అర్హులు. దీనికి కారణం...
ఇంటర్వ్యూ సమయానికి సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లల్ని కూడా వారి బంధువులు తీసుకుని వస్తారు. నిజానికి వారి పరిస్థితి దారుణంగానే ఉంటుంది. కానీ అంత మందిని పోషించగల వనరులు మనకు ఇంకా అందుబాటులో లేవు. వాళ్ళను వెనక్కు పంపడం మాకు చాల బాధగా అనిపిస్తుంది.  అందుకే స్ట్రిక్ట్ గా ఈ నియమం పెట్టుకున్నాము. 
మీకు తెలిసిన వాళ్ళకు కూడా దయచేసి ఈ విషయాలు తెలియపరచండి. ఎక్కడో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ఓ చిన్నారికి మీరు వెలుగును ప్రసాదించినట్లు అవుతుంది. 
ధన్యవాదాలతో,
జీవని.    


DAILY BALANCE SHEET - APRIL

BALANCE AS ON 31-3-2012 8,116/-

01-4-12-  Office Asst. salary 1000/- 7,116/-
02-4-12-  expenditure tipper rent 1400/-     5716/-
04-4-12-  UMADEVI 100/- KRISHANMURTHY 100/- SUGUNA 100/-    6016/-
05-4-12-  VARA PRASAD 100/- KIRAN 200/-   6316/-
06-4-12-  SURESH REDDY 300/- PARAMESH 100/- 6716/-
07-4-12-  AMARENDER REDDY 200/- SANTOSH 100/- 7016/-
08-4-12-  RAMSESH 200/- CHANDRAMOHAN REDDY 200/- 7416/-
09-4-12-  SRI HARSHA 200/- VENKAT NAIDU 400/- 8016/-
10-4-12-  RAMMOHAN NAIDU 200/- ANIL KUMAR REDDY 100/- 8316/-
11-4-12-  NATESH CHOWDARY 5000/- 13316/-
12-4-12-  KRISHNA VENI 5000/- 18,316/-
13-4-12-  10,000/- credited in to JEEVANI VIDYALAYAM BUILDING FUND 8,316/-
14-4-12-  NIL
15-4-12-  NIL
16-4-12-  NIL
17-4-12-  NIL
18-4-12-  NIL
19-4-12-  NIL
20-4-12-  NIL
21-4-12-  NIL
22-4-12-  NIL
23-4-12-  NIL
24-4-12-  NIL
25-4-12-  NIL
26-4-12-  NIL
27-4-12-  NIL
28-4-12-  NIL
29-4-12-  NIL
30-4-12-  NIL
31-4-12-  NILSCHOOL FEES DETAILS 
AMOUNT PAID
JUNE ------------------- 40,000/-
JULY ------------------- 50,000/-
AUGUST---------------- 20,000/-

OCTOBER-------------- 50,000/-

NOVEMBER----------- 30,000/-
DECEMBER------------ 30,000/-
JANUARY-------------- 20,000/-  
FEBRUARY------------ 45,000/- 
MARCH --------------- 35,000/-


TOTAL EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------  -------- 7,35,000
site cleaning--------------------------- 54,100
ec-----------------------------------   ------600
registration--------------------- -------- 8800
land survey ---------------------------- 1200
demand draft for bore----------------- 2200
Bore drilling ---------------------- -----30,000
Sub mersible bore+accessories------ 36,500
November month expenditure-----2,40,649 
December month expenditure----- 1,91,515
January month expenditure-------3,82,540
February month expenditure------1,96,611
==============================
TOTAL------------------------------ 18,79,715
==============================

EXPENDITURE IN FEBRUARY

DIESEL-----------------------------3500
MASON LABOR------------------34600
MILLER RENT---------------------2000
BRICKS LABOR------------------21300
ROD BENDERS----------------- 12900
IRON------------------------------21700
LABOR------------------------------1200
ELECTRICIAN-----------------------500
SAND------------------------------30600
CEMENT--------------------------58000
HARDWARE MATERIAL----------2311
WATCHMAN SALARY-------------2000
SUPERWISER SALARY-----------6000
 ========================================
TOTAL----------------------------196611
 ========================================


Read Moreఅనంతపురంలో ఉన్న అతికొద్ది మంది క్లాస్ 1 కాంట్రాక్టర్లలో ఒకరు దేశాయి మదనమోహన రెడ్డి గారు. వారికి కంకర ఫ్యాక్టరీ ఉంది. విరాళం కోసం ఆయన్ను కలిసినపుడు తమ వంతు 50 వేలు ఇస్తామని అది డబ్బు లేదా మెటల్ ఏ రూపంలో అయినా తీసుకోండి అని హామీ ఇచ్చారు. మనము కంకర కావాలని అడిగాము. 50 వేల రూపాయల విలువ చేసే కంకర జీవని సైట్కు పంపారు. ప్రస్తుతం మొదటి ఫ్లోర్ స్లాబ్ వేయాల్సి ఉంది. ఇందుకు దీన్ని ఉపయోగించనున్నాము. మదనమోహన్ గారికి జీవని కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


Read Moreఅనంతపురానికి చెందిన ఎన్.వి.శ్రీనివాస రెడ్డి గారు బెంగళూరులో బ్రాడ్ కాం అనే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. వారు 50,000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరం రామకృష్ణ మిషన్ కు లక్షన్నర విరాళం ఇస్తుంటారు .  ఇక నుంచి జీవనికి కూడా తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు.

 

Read More

బ్లాగుల్లో మరీ పాపులర్ కాదుగాని, బజ్జు ప్లస్ లో అందరికి పరిచితులైన వ్యక్తి జీవనికి విరాళం అందించారు. 
గూడచారిలా రహస్యంగా విరాళం అందించిన ఆయనకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము :)Read More

తాడిపత్రికి చెందిన నారాయణ రెడ్డి గారు తమ ధర్మపత్ని స్మృత్యర్థం విరాళం అందించారు. శైలజ గారు చాల సంవత్సరాల నుంచి కేన్సర్ తో పోరాడి చివరకు ఓడిపోయారు. కిందటి నెల పరమపదించారు. 
తాడిపత్రిలో అన్ని  ప్రభుత్వ బడులకు మధ్యాహ్న భోజనం  ఒకేచోట తయారవుతుంది. దాని నిర్వహణ శైలజ గారు చూసుకునేవారు. రోజు అన్నం పప్పు / సాంబారు/ రసంతో పాటు పెరుగన్నం ఇచ్చేవారు. అరటిపండు గుడ్డు వారంలో రెండుసార్లు, ఒకసారి స్వీటు ఇచ్చేవారు. ఇంత క్వాలిటీ ఇస్తూ కూడా సంవత్సరమంతా మిగిలిన డబ్బుతో జూన్లో పిల్లలకు పలకలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు కొని పంపిణి చేసేవారు.. 
మిగతాబడులలో మధ్యాహ్న భోజనం ఎంత అధ్వాన్నంగా ఉంటుందో చెబితే పై మెనూ విలువ అర్థం అవుతుంది. పది శాతం బడులలో తప్ప మధ్యాహ్న భోజనం చండాలంగా ఉంటుంది. నీళ్ళ పప్పు / సాంబారు అది కూడా కడుపు నిండా పెట్టకపోవడం... ఇలాంటి అరాచకాలు చాలా ఉన్నాయి. 
కేన్సర్ బాధిస్తున్నా ఆమె చాలా సంవత్సరాల పాటు ఉత్సాహంగా పిల్లలకు భోజనం వండించారు.
వారు  చనిపోవడానికి 10 రోజుల ముందు  బెంగళూరు ఆస్పత్రిలో చూడడానికి వెళ్ళాం.  ఎంతో ఉత్సాహంగా అసలు తనకు ఎలాంటి జబ్బు లేనట్టు మాట్లాడారు. ఆమెకు కేన్సర్ అంటే నమ్మబుద్ధి కాలేదు కూడా...
పేద పిల్లలకు కడుపార అన్నం పెట్టించిన ఆ తల్లి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటున్నాము. 
కొద్ది రోజుల వ్యవధిలో ఇద్దరు గొప్ప స్త్రీ మూర్తులను పరిచయం చేసే భాగ్యం కలిగింది.
హనుమాయమ్మ గారు ( http://www.jeevani2009.blogspot.in/2012/03/20000.html  ), శైలజ గారు...
మీలాంటి వారి స్ఫూర్తితో మరింత అంకితభావంతో ముందుకు సాగుతామని వినమ్రంగా విన్నవించుకుంటూ....

జీవని కుటుంబం  

Read More

Blog Archive

Followers