తాడిపత్రికి చెందిన నారాయణ రెడ్డి గారు తమ ధర్మపత్ని స్మృత్యర్థం విరాళం అందించారు. శైలజ గారు చాల సంవత్సరాల నుంచి కేన్సర్ తో పోరాడి చివరకు ఓడిపోయారు. కిందటి నెల పరమపదించారు. 
తాడిపత్రిలో అన్ని  ప్రభుత్వ బడులకు మధ్యాహ్న భోజనం  ఒకేచోట తయారవుతుంది. దాని నిర్వహణ శైలజ గారు చూసుకునేవారు. రోజు అన్నం పప్పు / సాంబారు/ రసంతో పాటు పెరుగన్నం ఇచ్చేవారు. అరటిపండు గుడ్డు వారంలో రెండుసార్లు, ఒకసారి స్వీటు ఇచ్చేవారు. ఇంత క్వాలిటీ ఇస్తూ కూడా సంవత్సరమంతా మిగిలిన డబ్బుతో జూన్లో పిల్లలకు పలకలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు కొని పంపిణి చేసేవారు.. 
మిగతాబడులలో మధ్యాహ్న భోజనం ఎంత అధ్వాన్నంగా ఉంటుందో చెబితే పై మెనూ విలువ అర్థం అవుతుంది. పది శాతం బడులలో తప్ప మధ్యాహ్న భోజనం చండాలంగా ఉంటుంది. నీళ్ళ పప్పు / సాంబారు అది కూడా కడుపు నిండా పెట్టకపోవడం... ఇలాంటి అరాచకాలు చాలా ఉన్నాయి. 
కేన్సర్ బాధిస్తున్నా ఆమె చాలా సంవత్సరాల పాటు ఉత్సాహంగా పిల్లలకు భోజనం వండించారు.
వారు  చనిపోవడానికి 10 రోజుల ముందు  బెంగళూరు ఆస్పత్రిలో చూడడానికి వెళ్ళాం.  ఎంతో ఉత్సాహంగా అసలు తనకు ఎలాంటి జబ్బు లేనట్టు మాట్లాడారు. ఆమెకు కేన్సర్ అంటే నమ్మబుద్ధి కాలేదు కూడా...
పేద పిల్లలకు కడుపార అన్నం పెట్టించిన ఆ తల్లి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటున్నాము. 
కొద్ది రోజుల వ్యవధిలో ఇద్దరు గొప్ప స్త్రీ మూర్తులను పరిచయం చేసే భాగ్యం కలిగింది.
హనుమాయమ్మ గారు ( http://www.jeevani2009.blogspot.in/2012/03/20000.html  ), శైలజ గారు...
మీలాంటి వారి స్ఫూర్తితో మరింత అంకితభావంతో ముందుకు సాగుతామని వినమ్రంగా విన్నవించుకుంటూ....

జీవని కుటుంబం  

on
categories: | edit post

9 వ్యాఖ్యలు

 1. శైలజ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను.
  నారాయణరెడ్డిగారికి ధన్యవాదాలు.

   
 2. నిజంగా స్ఫూర్తిదాతలు వీరు. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

   
 3. శైలజ గారి లాంటి వారు చిర స్మరణీయులు, మనందరికీ మార్గదర్శకులు.. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

   
 4. శైలజ గారి కి జోహార్లు, వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థించుచున్నాను.
  వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి.

   
 5. Ram Says:
 6. శైలజ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను.

   
 7. ఎందరో మహానుభావులు,అందరికీ వందనాలు(పోయినోళ్ళందరూ మంచోళ్ళూ ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపిగురుతులూ)

   
 8. స్పూర్తికరమైన వ్యక్తులు సామాన్యంగానే ఉంటారు. ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ..

   
 9. jeevani Says:
 10. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు

   
 11. పేదపిల్లల పెన్నిది ,అనురాగాల వడి, అమ్మ శైలజ గారు,తాడిపత్రి బడిపిల్లల మద్య్హాహ్నభోజనం రుచి శుచి గురించి చెపుతుంటె నమ్మలేక పోయాను ఇప్పుడు మితృడు యస్.వి.బ్లాగ్ జీవనీ లో మీ గురించి చదివి చింతిస్తూ,మీకు అత్మశాంతి కలగాలని కోరుకుంటూ.......నీ ఒక అకాశంలో నక్షత్రమై మా బడి పిల్లలను ఆశీర్వదిస్తూ.....ఉంటావని కోరుకుంటూ....... ఇట్లూ. తగరం.క్రిష్ణయ్య

   

Blog Archive

Followers