పిల్లలు నిన్న పార్కులో బాగా ఎంజాయ్ చేశారు. ఆడటం అయిపోయాక అందరం వృత్తాకారంలో కూచున్నాము. పిల్లలు కొందరు డ్యాన్స్ చేశారు. కొందరు పాటలు పాడారు. ఓ ఆరుగురు పాటలు పాడితే నలుగురు అమ్మ, అమ్మానాన్న అనే కాన్సెప్టు ఉన్న పాటలు పాడారు. తల్లిదండ్రులు లేరన్న బాధ అసంకల్పితంగా అలా బహిర్గతమైందేమో.

పార్కుకు 16 మందే వచ్చారు. ఇద్దరు ఊరికి వెళ్ళారు. మరో ముగ్గురు అనారోగ్యంతో ఇంకా చేరలేదు.

































Read More




పొద్దున ఒకావిడ ఫోన్ చేశారు. జీవని గురించి పేపర్లో చూశాను, విరాళం ఇవ్వాలని.

ఈ రోజు పిల్లల్ని పార్కుకు తీసుకుపోతున్నాం, అక్కడికి రాగలిగితే రండి. పిల్లల్ని పరామర్శించినట్లు ఉంటుంది అలాగే మీరు విరాళం ఇవ్వచ్చు అని చెప్పాను.

నేను రాలేను మీమీద నమ్మకం ఉందిలే. పేపర్లో చూశా కదా, కోర్టు రోడ్ ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు రండి అని ఆమె చెప్పారు.

ఓ పది నిముషాలకు ఆమె వచ్చారు. మెల్లగా నడుస్తున్నారు. తన పేరు శాంతాదేవి అని జిల్లా ఖజనా కార్యాలయంలో STOగా పనిచేసి రిటైర్ అయ్యానని అన్నారు. ఆమెకు 71 ఏళ్ళ వయసు. రకరకాల బాధితుల గురించి పేపర్లో రోజూ చూస్తుంటాను నాయనా! ఎవరైనా ఇలా ఫోన్ నెంబర్లు లాంటివి ఇస్తే వెంటనే సహాయం చేస్తాను అని అన్నారు.

బాగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఆ పెద్దామె బాధితులకు ఫోన్ చేసి సహాయపడటం గొప్పగా అనిపించింది.

Read More





మిత్రులారా కొత్తగా చేరిన పిల్లలకు ఇంటి ధ్యాస లేకుండా చేయడానికి మరియు ఉత్సాహం నింపడానికి రేపు పార్కుకు తీసుకు వెళ్తున్నాము. అనంతపురం నగరంలో ఇదే కాస్త ఊరట కలిగించే ప్రదేశం. ఊరి చివర ఓ పార్కు ఉంది కానీ అక్కడ అసాంఘిక కార్యక్రమాల బెడద.
ఈ వివరణ ఎందుకంటే ప్రతిసారీ రాజీవ్ పార్కు తప్ప ఇంకోటి లేదా అని అనుకుంటారేమో అని :)
అదీకాక పార్కు స్కూల్ కు చాలా దగ్గర.
ఇస్కాన్ టెంపుల్ కూడా బానే ఉంటుంది. ఈ సారి అక్కడికి ప్లాన్ చేస్తాం.
రేపు సాయంత్రం 4.30 కు ఈ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చని సభ్యులందరికీ మెసేజి కూడా పెట్టాము.

ధన్యవాదాలు,

జీవని.



Read More



శ్రీమతి పి.సునీత, పి.సుబ్బారెడ్డి గార్లు పిల్లల దుస్తుల కోసం 11000/- విరాళం అందించారు. సుబ్బారెడ్డి గారు కాంట్రాక్టర్, సునీత గారు గృహిణి. వీరికి జీవని తరఫున ధన్యవాదాలు తెల్పుతున్నాము.

ఇదివరకే వీరు జీవని విద్యాలయానికి 25,000/- విరాళం ఇచ్చారు.

Read More






కవిత్వంతో, భావుకత్వంతో ఎందరినో అభిమానులుగా చేసుకున్న ఉష గారు జీవనికి 13000/- ( ఒక విద్యార్థికి స్కూల్ + హాస్టల్ ఫీజు ) విరాళంగా ఇచ్చారు. వారికి జీవని పిల్లల తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము.




నిన్నటి కార్యక్రమంపై పేపర్ కటింగ్స్...




Read More



మిత్రులారా ఎంపికైన పిల్లల్ని ఈ ఉదయం బడిలో చేర్చాము. ఇంకా కొందరు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. ఒకటి రెండు రోజుల్లో అందర్నీ బడిలోకి చేర్చనున్నాము. జీవని పిల్లల సంఖ్య ఇప్పుడుమొత్తం 21 మంది.



పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంచిన శ్రీనివాస మూర్తి, గంగిరెడ్డి, కృష్ణయ్య గార్లు.






ఇద్దరు పిల్లలకి ఫీజు కట్టడానికి ముందుకువచ్చిన SRINIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY ( SRIT ), ANANTAPUR విద్యార్థులు. వీరు 5000/- విరాళంగా ఇచ్చారు.




పిల్లలతో జీవని కార్యకర్తలు









Read More



జీవని మొట్టమొదటిగా అక్కున చేర్చుకున్న ఇద్దరు చిన్నారులు లావణ్య, ఇంద్రజల నాయనమ్మ అనారోగ్యంతో చనిపోయారు. పిల్లలకు తాతయ్య ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ లేరు.

నాయనమ్మకు చెవుడు ఉండేది. ఇంట్లో ముసలివాళ్ళిద్దరూ చేదోడువాదోడుగా ఉండేవాళ్ళు. ఇపుడు ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. ఇలాంటి సందర్భాలు ఎదురైనపుడు ఒక వృద్ధాశ్రమం కూడా మొదలుపెట్టాలి అని బలంగా అనిపిస్తుంది. అన్నీ అనుకూలించి జీవని విద్యాలయం పూర్తయితే దీని వైపు అడుగులు వేద్దాం. ప్రతి క్షణం వీటి కోసం పనిచేస్తుండటం వల్ల ఇపుడు ఒక మొండి ధైర్యం కూడా వచ్చేసింది. లక్ష్యం సాధించగలమన్న నమ్మకమూ బలపడింది.

ఒక విషాదం ఏమంటే పిల్లలకు ఇంకా విషయం తెలీదు. వాళ్ళు ఎప్పటిలా నవ్వుకుంటూ ఈ రాత్రి నిద్రలోకి జారుకుని వుంటారు. పిల్లలు ఏడుస్తారని ఊరికి తీసుకుపోలేదు. స్కూల్ హాస్టల్లోనే ఉన్నారు. పొద్దున్నే నేనే స్వయంగా వెళ్ళి వదులుతున్నాను. ముసలావిడ ఆత్మకు శాంతి చేకూరాలని,ముసలాయనకు మనోబలం కలగాలని కోరుకుంటూ,

జీవని.




Read More




13-6-10 ఇంటర్వ్యూల తర్వాత పిల్లల స్థితిగతులపై ఫీల్డ్ సర్వే చేశాము. ఎంపికైన వారి వివరాలు.

1 శివ కుమార్
2 హేమంత్ రెడ్డి
3 లలిత్
4 తేజ సాయి
5 గణేష్
6 రామాంజనేయులు
7 మొహమ్మద్ కైఫ్
8 సతీష్ కుమార్
9 ధన లక్ష్మి
10 నాగశిల్ప
11 చందు
12 ఆకాంక్ష
13 దినేష్ కుమార్ రెడ్డి
14 ఉమేరా

వీరందర్నీ ఈ ఆదివారం బడిలో చేర్చనున్నాము.







గమనిక: దరఖాస్తు ఫారాల్లో కులం ప్రస్తావన వచ్చింది. సాధారణంగా వాడే బయోడేటాను అనుసరించడం వల్ల ఈ పొరపాటు జరిగింది. కులం మతం ప్రాంతం వంటి విషయాల ప్రభావం లేకుండా జీవని పనిచేస్తోంది. కాబట్టి ఉద్దేశ్యపూర్వకంగా కులం అని వాడలేదు. ప్రభుత్వ పరమైన సౌలభ్యం కోసం తప్ప ఇక జీవనిలో ఎక్కడా కులం అనే కాలం కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటాము.

ఈ విషయాన్ని తెలియపరిచిన వేణు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.


Read More


జీవని సంస్థకు కొండంత అండగా, సామాజిక సేవా భాగస్వామిగా ఉన్న శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల, అనంతపురం వారు 10000 లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించనున్నారు. యూనివర్శిటీ, పరీక్ష ఫీజుల్లాంటివి మొదటి సంవత్సరం మాత్రం 15000/- లోపు ఖర్చు అవుతుంది. హాస్టల్ / బస్ ఇతర సౌకర్యాలు అన్నీ ఉచితమే. తర్వాతి సంవత్సరాల్లో కేవలం పరీక్ష ఫీజు మాత్రమే ఉంటుంది. అయితే విద్యార్థులు ఇంజనీరింగ్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. కుల మత ప్రాంత పట్టింపులు లేవు. ఆసక్తి ఉన్నవారు jeevani.sv@gmail కు మెయిల్ చేయవచ్చు.

మీ,

జీవని.






Read More




తల్లిదండ్రులు లేని పిల్లలకు విద్య అందిస్తాం అని పది రోజుల కిందట పత్రికా ప్రకటన ఇచ్చాము. ఇందుకు విశేష స్పందన వచ్చింది. 40 మందికి పైగా మమ్మల్ని సంప్రదించారు. ఆదివారం రోజు పిల్లల్ని ఇంటర్వ్యూ చేశాము. ఇందులో ఐదుగురు సభ్యులు పాల్గొన్నారు. పిల్లలు చాలా చలాకీగా ఉన్నారు. ఇంటర్వ్యూ సభ్యులు నేరుగా వారినే ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

ఇంటర్వ్యూకు హాజరైన తల్లిదండ్రులకు రానుపోను చార్జీలు కూడా ఇచ్చాము.

14 మందిని ప్రొవిజనల్ గా ఎంపిక చేశాము. ఇంకా క్షేత్ర స్థాయిలో వీరి కుటుంబ స్థితిగతులను పరిశీలించి నిర్ధారిస్తాము. గత ఏడాది ఉన్న ఆరుగురు, కొత్త పిల్లలు కలిపి మొత్తం 20 మందికి మనం నీడను ఇవ్వనున్నాం. వచ్చే సోమవారం పిల్లలు అందరూ బడిలో చేరుతారు. వీరికి వసతి, చదువు, ఆరోగ్యం, దుస్తులు లాంటి అన్ని ఖర్చులు కలిపి 4 లక్షల వరకూ అవుతుంది.

అలాగే స్థల సేకరణ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. త్వరలోనే అది సరిపోయే అవకాశం ఉంది.























Read More




మూడు రోజుల కిందట అవినీతి నిరోధక శాఖ అదనపు డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి గారు అనంతపురం వచ్చారు. జీవని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే నాగేశ్వర రెడ్డికి ఈయన సీనియర్. జీవని గురించి శ్రీనివాస రెడ్డి గారికి ముందే కొంచెం అవగాహన ఉంది. సంస్థ కార్యకలాపాలను శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు విలువలతో కూడిన చదువు అందించేలా కృషి చేయమని సూచించారు.

అందుకోసమే జీవని విద్యాలయం నిర్మిస్తున్నామని ఆయనకు తెలిపాము. తన వంతు సహకారం అందిస్తానని, బడికి సంబంధించిన అంచనా వ్యయం తనకు పంపమని చెప్పారు. అయితే బడి పూర్తి అయి, ఆ వాతావరణం చూపించాక మీ సహకారం కోరతామని ఆయనకు చెప్పాము.

ఈ విద్యా సంవత్సరానికి కొత్త పిల్లల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. 14 వ తేదీ కల్లా పిల్లల్ని బడిలో చేర్పించాలని అనుకుంటున్నాము.

మీ,

జీవని.



Read More




మిత్రులారా ఈ విద్యా సంవత్సరానికి గాను కొత్తగా మరికొంత మంది పిల్లలకు జీవని ఆశ్రయం ఇవ్వనుంది. నిన్న పత్రికా ప్రకటన ఇచ్చాము, మంచి స్పందన లభించింది. దరఖాస్తులు రాగానే మేము క్షేత్ర స్థాయిలో పిల్లల కుటుంబాలను పరిశీలిస్తాము. ఆ తర్వాత అర్హులైన వారిని ఎంపిక చేయాలి అనుకుంటున్నాము.

పిల్లల్ని చేర్చుకోవడానికి అర్హతలు: తల్లిదండ్రులు లేని వారు, 5-8 సంవత్సరాల లోపు వయసు ఉండాలి, కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదు.



Read More

Blog Archive

Followers