అనంతపురంలోని క్రాంతి ఆస్పత్రి డైరెక్టర్ ఆదిశేషయ్య గారు జీవనికి విరాళం అందించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Read More


గుంటూరు వాస్తవ్యులు వెంకటేశ్వర రావు గారి ఙ్ఞాపకార్థం వారి కుమారులు బాలికల డార్మిటరీకి విరాళం అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

జీవని పిల్లల తరఫున బ్లాగర్లకు, జీవని కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. 






Read More

శ్రీ నవనీత్ కుమార్ మరియు శ్రీమతి సుమలత గార్లు ( విస్కాన్సిన్ ) బాలికల డార్మిటరీకి విరాళం అందించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


Read More

న్యూజెర్సీలో ఉంటున్న వినోద్ పూనాటి మరియు శ్రీమతి శిరీష గోరంట్ల దంపతులు బాలికల డార్మిటరీకి విరాళం అందించారు. పిల్లల తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

ఇందుకు సహకరించిన మహేష్ గారికి ( మెన్స్ వరల్డ్, సుభాష్ రోడ్, అనంతపురం ) స్పెషల్ థ్యాంక్స్.




Read More


పిట్స్ బర్గ్ లో ఉంటున్న శ్రీ రవి కొల్లి మరియు శ్రీమతి లత కొల్లి దంపతులు బాలికల డార్మిటరీకి విరాళం అందించారు. ఇందుకు అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారు సహకరించారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు  తెలియజేస్తున్నాము.

Sri RAVI KOLLI & Smt. LATHA KOLLI, Pittsburgh donated 12,000/- to JEEVANI for the construction of girl's dormitory.  through ATLURI BHAVANI CHARITABLE TRUST, GUDIWADA.  On behalf of children our sincere thanks to Ravi and Latha garu.


Read More


నవ్వించడం మాత్రమే తెలిసిన పెద్దాయన 6000/- విరాళం అందించారు. వీరు ప్రతి ఆరు నెలలకు క్రమం తప్పక విరాళం ఇస్తున్నారు.

అనంతపురం ముద్దుబిడ్డ బ్లాగర్ల చిట్టి తమ్ముడు 4000/- విరాళం అందించారు. ఐర్లాండులో ఉంటేనేం స్కాట్లాండులో ఉంటేనేం మా జిల్లాకు ఆణిముత్యం అవుతాడని మా ఆశ.

పిల్లల తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.







Read More


జీవని ఆవిర్భావం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీమతి శాంతి మరియు రామ్ దంపతులు తమ కుమార్తె చిన్నారి శృతి పేరు మీద బాలికల డార్మిటరీకి విరాళం అందించారు. వీరికి పిల్లల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.  


Read More


మిత్రులారా గతకొద్ది రోజులుగా ఇంటర్నెట్ కట్ అవడంతో పోస్ట్ అప్డేట్ చేయడం కుదరలేదు. అన్నీ ఒకేసారి అప్డేట్ చేయాల్సి వస్తోంది. పుట్టినరోజు జరుపుకున్న వారందరూ అమ్మాయిలు కావడం విశేషం. సకాలంలో పోస్ట్ చేయనందుకు అందరికీ సారీ అమ్మలూ.



అనంతపురంలోని PRK కళాశాల కరస్పాండెంట్ పవన్ కుమార్ గారి కుమార్తె దుర్గా శరణ్యు  బర్త్ డే సందర్భంగా వారు జీవని పిల్లలందరికీ స్వెటర్లు, మంకీ క్యాప్స్ స్పాన్సర్ చేసారు.


( గత సంవత్సరం ఫోటో )



అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న భానుకిరణ్ మరియు శ్రీమతి. క్రిష్ణ సౌజన్య గార్ల కుమార్తె స్కంద ష్రిక జన్మదినం సందర్భంగా పిల్లలకు స్వీట్లు, గిఫ్ట్ బాక్సులు ఇచ్చారు . శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో MBA విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైరైన రాంప్రసాద్ మరియు శ్రీమతి జ్యోతి గార్ల మనవరాలు స్కంద.




ఙ్ఞాన సహస్ర పుట్టినరోజు. తాడిపత్రిలోని నందలపాడు వాస్తవ్యులు ప్రవీణ్ రెడ్డి మరియు శ్రీమతి.నాగేశ్వరి గార్ల కుమార్తె సహస్ర.  వారు 3000/- స్పెషల్ మీల్స్ కోసం విరాళంగా ఇచ్చారు. 







రమేష్ యాదవ్ మరియు శ్రీమతి యమునా రాణి గార్ల కుమార్తె కార్తికా రమేష్ జన్మదినం సందర్భంగా స్పెషల్ మీల్స్ కోసం 3000/- విరాళం అందజేశారు 








పీలేరులో ఉంటున్న సిబ్బల షారిఖ 7వ పుట్టినరోజు జరుపుకొంది. షారిఖ నాన్న మహేష్ గారు జీవనికి 7000/- విరాళం అందించారు.








వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  


Read More


మిత్రులారా వారం రోజుల్నుంచి నెట్ కనెక్షన్ పోయింది. సెల్ తో కనెక్ట్ చేస్తుంటే చాలా చాలా స్లోగా ఉంది. ఈ మధ్యలో విరాళం పంపిన దాతలు దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అన్నీ అప్డేట్ చేయడానికి ఇంకా సమయం పడుతుంది. ధన్యవాదాలు. 

Read More

అనంతపురంలో ప్రముఖ హోమియో వైద్యులు డా.ప్రకాష్ కవి మరియు వారి శ్రీమతి డా. మీరా కవి గార్ల కుమార్తె చి.అమోఘ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వారు జీవనికి 10,000/- విరాళం అందించారు.

అనంతపూర్ సర్జికల్స్ యజమాని, జీవని జాయింట్ సెక్రెటరీ చంద్రకాంత్ నాయుడు మరియు శ్రీమతి జ్యోతి గార్ల వివాహ వార్షికోత్సవం నిన్న. వారు 11,116/- విరాళం అందించారు.

వీరందరికీ పిల్లల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

Read More


బ్లాగర్ ఉష ( maruvam.blogspot.in ) గారి కుమారుడు యువ తన సంపాదనలోంచి జీవనికి తొలిసారిగా విరాళం అందించారు. ఉషగారు ప్రతి సంవత్సరం  తన శిష్యుల పేరిట, నాన్నగారి పేరిట విరాళం అందిస్తూ ఉన్నారు.
 

కుమారుడి గురించి ఉషగారి మాటల్లోనే  "   చిన్న వయసులోనే ముందుకు వెళ్ళాడు కెరీర్ లో, అది కూడా ఉత్తమశ్రేణి విద్యాసంస్థ ల్లోను, ఆర్ధిక రంగంలోనూ. బాధ్యతాయుతమైన మనిషిగా మెసులుతాడు. 911 సంఘటన వెంటనే ముందుకు వచ్చి విరాళాలు పోగేసి సత్వర సహాయం అందించిన 5 గురు విద్యార్థుల్లో తనొకడు.  వారిని గూర్చి టీవీ లో వచ్చిన వార్తతో మరెందరో పిల్లలు స్ఫూర్తి తో ఇంకొంత ఆర్ధిక సాయం చేసారు. విద్యార్ధి దశ లో తనకి వీలైన రీతిలో సాటి విద్యార్థులకి తోడ్పాటు ఇచ్చాడు. ఉద్యోగిగా ఈ మధ్యనే మారాడు.  ఇప్పుడిప్పుడే తన పరిధి achievements దిశ  నుంచి contributions వైపుగా విస్తరిస్తుంది, నా ప్రణాళికలకి తన అండ ఉంటుంది "

యువ గారు ప్రస్తుతం AT &T లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు.

పిల్లల తరఫున ఉషగారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo