Read More

ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఒక స్నేహితుడు / రాలు ఉంటారు. వారు లేకపోతే జీవితంలోనే వెలితి అనిపిస్తుంది. మరి జీవనికి జీవని పిల్లలకు ఆ వెలితిని తీరుస్తున్నది బ్లాగర్లు. జీవని సోషల్ మీడియా ప్రస్థానం  ప్రారంభం అయింది బ్లాగులతోనే. ఎందరో సహ్రుదయులు అడుగడుగునా సహకారం ఇచ్చారు, ఇస్తున్నారు. జీవనికి ఆర్థికంగా పిల్లలకు ఆత్మీయంగా మద్దతు ఇస్తున్నారు. గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా ఏటా పిల్లలను పలకరిస్తున్నారు బ్లాగు అన్నలూ అక్కలూ. పిల్లల సంతోషాన్ని గ్రాఫ్ లా గీస్తే all time high point తప్పకుండా బ్లాగర్లతో గడిపిన క్షణాలే అయి ఉంటాయి.  అలా వారితో అనుబంధం పెనవేసుకు పోయింది. జీవనికి ఆర్థికంగా సహాయపడాలన్న తపనతో గత ఫిబ్రవరిలో హృదయ స్పందన కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.  ఇందుకోసం తమ బిజీ షెడ్యూల్స్ పక్కన పెట్టారు. ఒంగోలు శీను, రాజ్ కుమార్, కార్తీక్ గార్లు రూపకర్తలు కాగా సురేష్ పెద్దరాజు, Kvk కుమార్, నాగార్జున చారి  గార్లు సహకారం అందించారు. వీరంతా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పరోక్షంగా మరెందరో సహాయ పడ్డారు.  ఆ కార్యక్రమం ద్వారా సమకూరిన డబ్బుతో కొద్ది రోజుల కిందట బస్సు కొన్నాము. దీనిని  జీవని విద్యాలయానికి ఉపయోగిస్తున్నాం. వారికి ధన్యవాదాలు చెప్పినా ఇంకేం చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం బ్లాగుల మీద ఆసక్తి తగ్గి అందరూ facebook కు వచ్చేశారు.
బ్లాగు అన్నయ్యలు, అక్కయ్యలతో పాటు జీవనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ పిల్లల తరపున రాఖీ పండుగ శుభాకాంక్షలు.

Pics : బ్లాగర్లు జీవనికి వచ్చిన సందర్భాలు.

Read More

తాడిపత్రి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ.జె.సి.ప్రభాకర రెడ్డి గారు జీవనికి విరాళం అందించారు. ఇందుకు శ్రీ.నారాయణ రెడ్డి గారు సహకరించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


ప్రభాకర రెడ్డి గారి నుంచి విరాళం అందుకుంటున్న జీవని కార్యదర్శి ఆలూరు సాంబశివా రెడ్డిగారు .

Read Moreబ్లాగర్ సౌమ్య గారు తమ కుమార్తె చి.అమల్య సుమాళి పుట్టినరోజు సందర్భంగా బాహుబలి మ్యాట్నీ షో స్పాన్సర్ చేసారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసారు. సౌమ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లలకు థియేటర్లో చూపిన చివరి సినిమా సెవెంత్ సెన్స్. 
Read More


జీవని నుంచి మొట్టమొదటి 10వ తరగతి విద్యార్థిని మెహతాజ్ పరీక్షల్లో 8.5 / 10 మార్కులతో పాసైంది. ప్రస్తుతం ఆ ఆమ్మాయి పాలిటెక్నిక్ కోచింగ్ వెళ్తోంది. ఇందులో కూడా మెహతాజ్ విజయం సాధించాలని కోరుకుంటున్నాము. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము .


బ్లాగులో పాఠకులు తగ్గిపోయారన్న భావనతో ముఖ్యమైన విషయాలు మాత్రమే ఇందులో అప్డేట్ చేస్తున్నాం. రోజువారీ అప్డేట్ ఫేస్‌బుక్లో చేస్తున్నాము దయచేసి గమనించగలరు. 
Read More

మిత్రులారా
వచ్చే విద్యా సంవత్సరానికి జీవని కొత్త పిల్లలకు అవకాశం ఇస్తోంది
మీ పరిధిలో ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటె దయచేసి తెలపండి
అయితే రెండు షరతులు
1. వారు 5-7 సంవత్సరాల మధ్య వారు అయి ఉండాలి.
2. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన వారు అయి ఉండాలి
కుల మత ప్రాంత పట్టింపులు లేవు
పిల్లలు జీవితంలో స్థిరపడే వరకు జీవని బాధ్యత వహిస్తుంది
వారికి తల్లిదండ్రులకు లేని లోటు లేకుండా నాణ్యమైన జీవన శైలి చదువు ఆరోగ్యం అన్ని అందించగలము
ఈ విషయాన్నీ మీకు తెలిసినవారికి చెప్పండి
ఎక్కడో ఉన్న ఎవరికో మీ వాళ్ళ ఉపయోగం జరగవచ్చు
సంప్రదించవలసిన నెంబరు 9505201111
ధన్యవాదాలు  

Read More

 

Read More


బ్లాగాడిస్తా బ్లాగర్ శ్రీ రవి వారి శ్రీమతి ఫణి జ్యోతి గార్లు కుమార్తె చి.సంహిత పేరు మీద 12,000/- విరాళం అందించారు. పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఈ మధ్య జరిగిన హృదయ స్పందన కార్యక్రమానికి కూడా వారు 20,000/- విరాళం ఇచ్చారు.


Read More

donations and expenditure details of HRUDAYA SPANDANA
Amount raised from ticket sales : 2,26,600/-
donations from...
bloggers..........................................1,00,000/-
online friends.....................................25,000/-
Sri. Venkatadri...................................10,000/-
Smt. Priyanka & Sri. Mukesh ............. 5,000/-
Sri. Subbareddy & Smt. Lakshmi...... 10,000/-
Sri. Narayana Reddy........................ 50,000/-
----------------------------------------------------------- 
Total................................................4,26,600/-
pending amount.................................80,000/-
total expenditure for the praogramme is raised from sponsors. net donations credited to JEEVANI 4,26,600/- + 80,000/-
on behalf of JEEVANI children we thank one and all who helped.


Read Moreజీవనికి తెలుగు బ్లాగర్లతో ఉన్న అనుబంధం గురించి మీ అందరికీ తెలుసు. రేపటికి హృదయ స్పందన కార్యక్రమం జరిగి నెల అవుతుంది. టికెట్ అమ్మకం డబ్బులు పూర్తిగా చేతికి అందలేదు అందుకే జమాఖర్చులు కాస్త లేటుగా తెలియజేస్తున్నాము.
ఇక హృదయ స్పందన కార్యక్రమం క్రెడిట్ ఒంగోలు శీను గారిదే. కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి రాజ్, కార్తీక్, సురేష్, కుమార్ గార్లు అందరం తరచుగా చర్చించుకుంటూ ప్లాన్ చేసాము.
శీనుగారికి సేవా రంగంలో పండిపోయిన తల ఇక్కడ జీవనికి బాగా ఉపకరిస్తోంది. ఆయన సలహాలు సూచనలు జీవనికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 
ఈ కార్యక్రమం వేదికగా విరాళం అందించిన దాతల వివరాలు 

సర్వ శ్రీ 

+Sri nivas 
+రాజ్ కుమార్. +Karthik Indrakanti +Suresh Peddaraju +KVK Kumar +nagarjuna chary +బులుసు సుబ్రహ్మణ్యం +Vijayamohan Chilamakuru +Sri Atluri +Vineel Gattu +sapta swaraalu +Thanneeru Sasi +Ravi E.N.V.  +anand addanki  nishigandha  +Venu Srikanth Darla  +Nagh Raj  +pappu sreenivasa rao  +sowmya alamuru +Indu Priya  Padma Wundavalli +Manasa Chamarthi ఫోటాన్ హర్ష +మీ భారతీయుడు 

వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 
Read More

జీవని గురించి ఈనాడు ఆదివారంలో కథనం వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసి ఉంటుంది. అందులో నా నెంబర్ ఇవ్వడంతో ఆదివారం నుంచి ఇప్పటివరకూ కాల్స్ వస్తూనే ఉన్నాయి.
మేము మంచి పని చేస్తున్నాం అని అభినందించారు కొందరు సంబరపడ్డారు మరి కొందరు విరాళం అందించారు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
పిల్లలు లేరు దత్తత ఇస్తారా అని, ఉద్యోగం ఇస్తారా అని చాలామంది అడిగారు.
ఒకాయన తాను త్వరలో అనాధాశ్రమం, వృధాశ్రమం, గోశాల పెడతాను అన్నారు. తర్వాత మీ ప్రాంతం వాళ్ళు కన్నింగ్ మా వాళ్ళతో పోలిస్తే అన్నారు. ఆ తర్వాత నా కులం అడిగారు అప్పటికి నా సహనం చచ్చి ఫోన్ పెట్టేసాను.
ఇక కొంతమందైతే తమ సమస్యలు చెప్పి ఏడ్చేసారు. కొంచెం అన్నం పెట్టండి నీడనివ్వండి నా పెన్షన్ మొత్తం తీస్కోండి ఈ వయసులో నాకు నా అన్న వారు లేరు నన్ను ఆదుకొండి బాబూ అని భోరున విలపించారు. ఎప్పుడు రావాలి అని అడుగుతారు
పిల్లలు తల్లిదండ్రులను సరిగా చూడటం లేదు.
జీవితంలో సమస్యలు కాదు జీవితమే సమస్యగా మారి దుర్భర జీవితం గడుపుతున్నవారు.
చాలా బాధ అనిపించింది. కానీ మన పరిధి చిన్నది. మన పరిమితులు మనకు తెలుసు. వారందరికీ మంచి కలగాలని కోరుకోవడం మినహా చేయగలిగింది లేదు.


ఈనాడు ఆదివారం మాగజైన్‌లో వచ్చిన కథనం 
Read Moreమహేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటూ, శివరాత్రి శుభాకాంక్షలతో...
జీవని కుటుంబం 

Read More


జీవని అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన, పోషిస్తున్న ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జీవని సేవా కార్యక్రమాలను ఆయన ఎక్కడా ఎప్పుడూ తన వ్యక్తిగత అవసరం కోసం వాడుకోలేదు.
జీవని ద్వారా ఏ ఒక్క వ్యక్తీ పేరు ప్రఖ్యాతులు పొందరాదు అన్న ఆశయాన్ని ఆయన నిలబెట్టారు. జీవని సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరి వేదిక. ఇది అందరిదీ, ఈ భావనకు తోడ్పడుతున్న జీవని ప్రధాన బాధ్యులు అందరికీ వేనవేల నమస్కారాలు.


Read More

blogger Raj Kumar post......


మిత్రులారా..!!
జీవని  చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం నేను నా బ్లాగర్ ఫ్రెండ్స్ అయిన శ్రీనివాస్, కార్తీక్, నాగార్జున, సురేష్ గారు, Ravi ENV లతో పాటూ చాలామంది తెలుగు బ్లాగర్లం  కలిసి అనంతపురం లో ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ (A
musical night by differently able) చేయడానికి సంకల్పించాం.

తేది. 01-02-2015
ప్రదేశం: లలిత కళా పరిషత్, అనంతపురం.
సమయంః సాయత్రమ్ 6 గం. నుండి.
అతిధులుః 

Kireeti Damaraju Garu ( Second Hand Movie Fame)
Ravi Varma Garu ( Vennela , Bommarillu Fame)
Sudhakar Komukula Garu ( Life is Beautiful Fame)
Music Director Agasthya Garu ( Pellaina Kothalo Fame)
Lyric Writer Vanamali Garu
Director Madan Garu ( pellaina Kothalo Fame )
Anchor Chitra Lekha Garu
Anchor Eswar Garu మొదలగు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిధులుగా రావడానికి అంగీకరించారు. 

మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. అటెండ్ అవ్వడానికి కుదరక పోయినా సహాయం చేయాలనుకునేవారు 1000/- ఈ టికెట్  కొనడం ద్వారా ఈ కార్యక్రమం లో పాల్గొనవచ్చు. ఈవెంట్ లైవ్ టెలీకాస్ట్ చెయ్యబడుతుంది.
మరిన్ని వివరాల కోసం  దయచేసి jeevani.sv@gmail.com కు మెయిల్ లేదా 9505201111  నెంబరుకు ఫోన్ చేయగలరు. 

http://jeevani2009.blogspot.in/2008/12/blog-post.html
https://www.youtube.com/watch?v=KbSRgXLiziM&feature=youtu.be
 
 
 
 
 
 

Read Moreమిత్రులారా నమస్కారం. జీవని ఆవిర్భావం నుంచి బ్లాగర్లు ఇస్తున్న తోడ్పాటు మాటల్లో చెప్పలేనిది. బ్లాగు చూసి జీవనికి సహాయం అందిస్తున్న దాతలు ఎందరో ఉన్నారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
బాలికల డార్మిటరీ సందర్భంగా ఇక్కడికి వచ్చిన బ్లాగర్ల ఆలోచన ఒక కార్యక్రమానికి నాంది పలికింది. హృదయస్పందన పేరుతో అంధ కళాకారులతో ఒక మ్యూజికల్ నైట్ చేద్దాం అన్నది ఆ ఆలోచన. ఒంగోలు శీను, రాజ్ కుమార్, కార్తీక్, సురేష్ పెద్దరాజు గార్లు ప్రత్యక్షంగా మరియు
చాలా మంది పరోక్షంగా  రంగంలోకి దిగారు. 1.2.15 న అనంతపురంలోని లలిత కళాపరిషత్ వేదికగా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కొందరు సినీ ప్రముఖులు రావడానికి అంగీకరించారు.

ఇందుకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము. రావాలనుకున్నవారు 9505201111 కు ఫోన్ చేయవలసిందిగా మనవి. ఇక్కడికి రాలేకపోయినా సహాయం చేయాలనుకునేవారు 1000/- ఈ టికెట్ కొనవచ్చు. మరిన్ని వివరాలకోసం దయచేసి jeevani.sv@gmail.com కు మెయిల్ లేదా పై నెంబరుకు ఫోన్ చేయగలరు. 


ఈ-టికెట్ కొన్న దాతలకు ధన్యవాదాలు
Read More

చి. శ్రీమహి s/o  శ్రీ.చందగాని నాగశేఖర్ & శ్రీమతి. అనిత గార్లు 5000/-
చి. నవీన్ దత్తా s/o  శ్రీధర్ ఫణి &  శ్రీమతి సునీతా దేవి  గార్లు 3100/-
చి.ఫర్హాన్ s/o శ్రీ. బాబా ఫకృద్దీన్ &  శ్రీమతి నసీమా 1000/- విరాళాలు అందించారు
పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలుRead More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo