మిత్రులారా నమస్కారం. జీవని ఆవిర్భావం నుంచి బ్లాగర్లు ఇస్తున్న తోడ్పాటు మాటల్లో చెప్పలేనిది. బ్లాగు చూసి జీవనికి సహాయం అందిస్తున్న దాతలు ఎందరో ఉన్నారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
బాలికల డార్మిటరీ సందర్భంగా ఇక్కడికి వచ్చిన బ్లాగర్ల ఆలోచన ఒక కార్యక్రమానికి నాంది పలికింది. హృదయస్పందన పేరుతో అంధ కళాకారులతో ఒక మ్యూజికల్ నైట్ చేద్దాం అన్నది ఆ ఆలోచన. ఒంగోలు శీను, రాజ్ కుమార్, కార్తీక్, సురేష్ పెద్దరాజు గార్లు ప్రత్యక్షంగా మరియు
చాలా మంది పరోక్షంగా  రంగంలోకి దిగారు. 1.2.15 న అనంతపురంలోని లలిత కళాపరిషత్ వేదికగా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కొందరు సినీ ప్రముఖులు రావడానికి అంగీకరించారు.

ఇందుకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము. రావాలనుకున్నవారు 9505201111 కు ఫోన్ చేయవలసిందిగా మనవి. ఇక్కడికి రాలేకపోయినా సహాయం చేయాలనుకునేవారు 1000/- ఈ టికెట్ కొనవచ్చు. మరిన్ని వివరాలకోసం దయచేసి jeevani.sv@gmail.com కు మెయిల్ లేదా పై నెంబరుకు ఫోన్ చేయగలరు. 


ఈ-టికెట్ కొన్న దాతలకు ధన్యవాదాలు
on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers