నిన్న శివరాత్రి సందర్భంగా పిల్లల్ని చిన్న ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్ళాము. మొదట బుక్కరాయసముద్రం కొండ. కిందనుంచి కొండమీదకు ఒక కిలోమీటరు మేర మెట్లు ఉంటాయి. పెద్దలకు ఎక్సర్ సైజు... పిల్లలకు ఉత్సాహం. కొండమీద వెంకటేశ్వర స్వామిని కొండమీద రాయుడు అంటారు. 
 తర్వాత ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాము.


శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజి బస్సులో వెళ్ళాము. ఇందుకు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. 

Read Moreఈ మధ్యే వివాహం జరుపుకున్న ఇద్దరు బ్లాగర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి మిత్రులు, శ్రేయోభిలాషులు జీవనికి 5000/- విరాళం అందించారు. కొత్త దంపతులను దేవుడు చల్లగా చూడాలని, వారి జీవన యానం  సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సాగాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. Read More


కాకినాడలో ఉంటున్న శ్రీ విశ్వనాధ సూర్యనారాయణ మరియు శ్రీమతి విశ్వనాధ సుభద్రా మహాలక్ష్మి గార్లు బాలికల డార్మిటరీకి విరాళం అందించారు. వారి కుమారుడు చంద్రశేఖర్ గారు నెలనెలా 1000/- విరాళం ఇస్తున్నారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.Read Moreఅనంతపురంలో ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే మంచిపేరు తెచ్చుకున్న స్కూల్ AFFLATUS GLOBAL SCHOOL (AGS). ప్రిన్సిపల్ సాల్మన్ రాజు విలువలతో కూడిన చదువును, ఒత్తిడిలేని విద్యను అందించడానికి కృషిచేస్తున్నారు. SRINIVSA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY ( SRIT ) లాగా AGS కూడా జీవనికి నైతిక ఆర్థిక మద్దతు ఇస్తోంది. సామాజిక సేవపై పిల్లలకు అవగాహన కల్పించడానికి పిల్లలు మొత్తం ఒకసారి జీవనిని సందర్శించారు. ఆ పిల్లలు అదే స్ఫూర్తితో తమ కిడ్డీ బ్యాంక్ లోని డబ్బును, పుట్టినరోజు సందర్భగాను విరాళం ఇస్తూ వచ్చారు. ఆరవ తరగతి పిల్లలు తమ క్లాస్ తరఫున 5400/- విరాళం అందించారు. చిన్నారులకు ధన్యవాదాలు అలాగే వారి కుటుంబసభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లల్ని ఇందుకు ప్రోత్సహించిన క్లాస్ టీచర్ సలోమి గారికి, ప్రిన్సిపాల్ సాల్మన్ గారికి జీవని పిల్లల తరఫున కృతఙ్ఞతలు. 

AGS children at JEEVANI


 


 Learning by doing.... AGS core philosophy...


Read More


టోక్యోలో ఉంటున్న శ్రీ విశ్వనాథన్ చంద్రశేఖర్ మరియు వారి కుటుంబసభ్యులు బాలికల డార్మిటరీకి 10,000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

file photo: TV anchor chitra lekha appreciating JEEVANI child shiva's dance performance at SRIT annual day celebrations, last year.


Read More

శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుతున్న పి.సంధ్య ( శ్రీ.రామాంజనేయ రెడ్డి, శ్రీమతి జయలక్ష్మి గార్ల కుమార్తె ) జీవనికి 5000/- విరాళం అందించారు. వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


Read More


ఆస్టిన్లో ఉంటున్న శ్రీ. రమేష్ రెడ్డి సోమగట్టు గారు 30,000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


వీరికి జీవనిని పరిచయం చేసిన  Dr.ISMAIL  SUHAIL PENUKONDA https://www.facebook.com/drpen గారికి ప్రత్యేక ధన్యవాదాలు.


Read Moreఅనంతపురం ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరసింహ మరియు శ్రీమతి శ్రీలక్ష్మి దంపతులు తమ కుమారుడు హిమవర్ష్ పుట్టినరోజు సందర్భంగా జీవనికి 25,000/- విరాళం అందించారు. వారు ప్రతి సంవత్సరం విరాళం ఇస్తున్నారు. నరసింహ గారి కుటుంబ సభ్యులకు జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.Read Moreజీవనికి గత రెండేళ్ళుగా అర్థికంగా, నైతికంగా మద్దతు ఇస్తున్నారు అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ ( ABC Trust ) వారు.
వారికి జీవనిని పరిచయం చేసింది ఈ శ్రేయోభిలాషే. ఆయన వివాహం రేపు. ఈ సందర్భంగా ABC Trust 6000/- విరాళం అందించింది. నూతన వధూవరుల జీవన యానం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సాగిపోవాలని పిల్లల తరఫున దేవుని ప్రార్థిస్తున్నాము.  

Read More

Blog Archive

Followers