పుణెలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సూర్య గారు జీవనికి విరాళం అందించారు. వారు తెలుగు బ్లాగర్ కూడా. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 


http://www.jeevanianantapur.com/dailybalance.php

Read More


షీనా గారు ( ఆదిమూర్తినగర్, అనంతపురం ) జీవనికి 5000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


http://www.jeevanianantapur.com/dailybalance.php

Read More

మిత్రులు మేడాప్రసాద్ గారి కుమారుడు లిఖిత్ ప్రజ్వల్ కు జన్మదిన శుభాకాంక్షలు. లిఖిత్ బర్త్ డే నిన్న. అయితే పని ఒత్తిడివల్ల పోస్ట్ పెట్టలేకపోయాము. ప్రసాద్ అంకితభావం కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నిరంతరం విద్యార్థుల అభ్యున్నతి కోసం తపిస్తూ నూతన విద్యా విధానాలను అన్వేషిస్తూ ఉంటారు. ప్రసాద్ జీవనికి విద్యకు సంబంధించిన విషయాల్లో ముఖ్యసలహాదారు. ప్రతి విషయాన్ని, నిర్ణయాన్ని ఆయనతో చర్చిస్తాము. అంతేకాక జీవనికి మంత్లీ డోనర్ కూడా. వారికి ధన్యవాదాలు తెల్పుతున్నాము. 

http://www.jeevanianantapur.com/dailybalance.php

Read Moreface book లో డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ గారు చాలా పాపులర్. భావకుడిగా, కథకుడిగా సాహిత్యాభిమానిగా అంతకు మించి మనసున్న డాక్టరుగా  సుపరిచితులు. (
https://www.facebook.com/drpen ) వారి అబ్బాయి సుహాస్ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా 10,000/- విరాళం అందించారు.  వారికి వారి  కుటుంబ సభ్యులకు జీవని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుహాస్ బంగారు భవిష్యత్తును కోరుకుంటూ పిల్లల తరఫున శుభాకాంక్షలు.   https://www.facebook.com/notes/ismail-suhail-penukonda/%E0%B0%93-%E0%B0%87%E0%B0%B0%E0%B0%B5%E0%B1%88-%E0%B0%95%E0%B0%A5/10150748307936533

Read Moreఅనంతపురానికి చెందిన రిజిస్టర్డ్ చిట్ ఫండ్ సంస్థల నిర్వాహకులు జీవనికి 35,000/- విలువ చేసే బియ్యాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందుకు వారిని ప్రోత్సహించిన సోదరులు కుమారస్వామి రెడ్డి గారికి  ( అసిస్టెంట్ రిజిస్ట్రార్, చిట్ ఫండ్స్, అనంతపురం )  ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చిట్స్ నిర్వాహకులకు పిల్లల తరఫున కృతఙ్ఞతలు. వీరు ఇంతకుమునుపు విరాళం ఇచ్చిన వివరాలు ఇక్కడ http://jeevani2009.blogspot.in/2013/01/36000.htmlRead Moreమిత్రులారా పిల్లలతోపాటు మేమంతా జీవని ఇల్లు ( రోటరీ పురం గ్రామం ) లో చేరి సంవత్సరం దాటింది. ఏడాదిలో సాధించిన ప్రగతి...
1) గతంలో పిల్లలను ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాము. ప్రస్తుతం పిల్లలకు మెరుగైన భోజన, వసతి , విద్యా సౌకర్యాలు కల్పించగలుగుతున్నాము.
2) పిల్లలతో దాతలను కలుపుతూ మానవసంబంధాలు, సమాజం పట్ల పాజిటివ్ దృక్పథాన్ని అలవరుస్తున్నాము.
3) జీవని విద్యాలయం ప్రారంభించాము. అయితే ఇది కేవలం 2వ తరగతి వరకే. రాబోయే 4-5 సంవత్సరాల్లో 10వ తరగతి వరకు విస్తరించనున్నాము.
4) త్వరలోనే ఈ-బడి కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. వివరాలు ఇక్కడ

జీవని లక్ష్యాలు
ప్రస్తుతం 36 మంది పిల్లలు ఉన్నారు. భవిష్యత్తులో మరికొంత మందికి అవకాశం ఇవ్వడం.
3-5 తరగతి గదుల నిర్మాణానికి నిధులు సమకూర్చుకోవడం ( 4 లక్షలు, అంచనా మాత్రమే... )
జీవని విద్యాలయం శాశ్వత భవనం నిర్మించుకోవడం
పిల్లలకు కొత్త వసతి గదులను నిర్మించడం

సాధకబాధకాలు
ఇప్పటివరకూ పెద్ద సమస్యలు ఏవీ ఎదుర్కోలేదు. అయితే నెలవారీ ఖర్చు విషయంలో మాత్రం కత్తి మీద సాములా ఉంది పరిస్థితి. నెలకు దాదాపు 60-80 వేలు ఖర్చు ఉండగా రెగ్యులర్గా వచ్చే విరాళాలు 40 వేలు మాత్రమే. మిగతావి దాతలు వివిధ సందర్భాలను పురస్కరించుకుని ఇస్తున్న విరాళాలతో నడుస్తోంది. ఈ సంవత్సర కాలంలో ఒకేఒక్కసారి పూర్తి గడ్డుపరిస్థితి ఎదుర్కొన్నాము. చేతిలో, బ్యాంకులో డబ్బులు నిల్. రెండోరోజు విదేశాల్లో ఉంటున్న ఒక బ్లాగర్ 40 వేలు పంపారు. ఆ తర్వాత ఎప్పుడూ ఇబ్బంది కలగలేదు. ప్రస్తుతం ప్రతి నెలా 5000/- జీవని పేరు మీద డిపాజిట్ చేస్తున్నాము. అలాగే 1 లక్ష రూపాయలు విలువైన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసాము.

ధన్యవాదాలు
ముందుగా ఈ క్రెడిట్ మొత్తం జీవని ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డిగారికి దక్కుతుంది. జీవనిని సందర్శించిన బ్లాగర్లందరికీ సాంబశివారెడ్డి పరిచయమే. జీవని ఇల్లు నిర్మాణానికి, క్లాస్ రూములు ఇంకా ఇతర వసతులకు ఆయన ఎంత ఖర్చు చేసారో మొదట నీటుగా రాసాము, అయితే అది లెక్కకు మించి పోయింది. 40లక్షలకు పైగా ఖర్చు అయ్యింది.  ఆ తర్వాత జీవనికి వెన్నెముకలాంటివారు బ్లాగర్లు. జీవని బ్లాగులోని రాతల్ని ఆధారంగా మమ్మల్ని నమ్మి వేలకు వేలు  విరాళంగా పంపారు... పంపుతున్నారు.  ఇక క్రమం తప్పకుండా నెలకు 100/- నుంచి 2000/- వరకూ విరాళం ఇచ్చేవారు ఉన్నారు.  వీరందరి పేర్లు, వీరి గురించి రాయాలని ఉంది కానీ చాలా మందికి తమ పేర్లు బహిర్గతపరచడం ఇష్టం లేదు. వారి మనోభావాలను గౌరవిస్తూ పేర్లు ప్రచురించలేకపోతున్నాము.ఇక స్థానికంగా అనంతపురంలో ఉంటూ  ప్రతి విషయంలోనూ మమ్మల్ని నడిపించే బృందం మరొకటి ఉంది.

అందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు.

మీ అందరి అంచనాలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా, కష్టపడి పనిచేస్తాము. ఇదేమాట ప్రతి సందర్భంలోనూ చెప్పాము ఇప్పుడూ చెబ్తున్నాము. దాతలు విరాళంగా పంపే ప్రతి రూపాయి పిల్లల కోసమే ఖర్చు అవుతుంది.

చివరగా... వీధిబాలలపైన ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. అడుక్కోవడం కోసం కొందరు పిల్లల అవయవాలు తీసివేయడం, పిల్లలకు అనారొగ్యం ఉందని చూపడానికి వారికి మత్తుపదార్థాలు ఇవ్వడం ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. వీటిని ఎదుర్కుని పిల్లల్ని రక్షించి వారికి మంచి జీవితాన్ని ఇవాలి. అయితే ఆ స్థాయి ఇంకా జీవనికి లేదు. భవిష్యత్తులో మనకు అంతబలం చేకూరాలని కోరుకుంటున్నాము.

మీ అందరికీ  మరోసారి ధన్యవాదాలతో,
జీవని 

Read Moreశ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల ( అనంతపురం )లో MBA, HEAD OF THE DEPT. గా పనిచేస్తున్న నబిరసూల్ గారు జీవనికి 5000/- విరాళం అందించారు. ఇది ఆయన రంజాన్ సందర్భంగా వారం కిందటే అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


http://www.jeevanianantapur.com/dailybalance.php

Read More


కర్ణా రాజవర్ధన్ రెడ్డి మరియు శ్రీమతి నిర్మల గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు ( ఆలస్యంగా ) . వీరు జీవనిని సందర్శించి 5000/- విరాళం అందించారు. పిల్లలకు రెండు రోజులకు సరిపడా స్నాక్స్ ఇచ్చారు.
వీరు ఇదివరకే జీవనికి 2 లక్షలు విరాళంగా ఇచ్చారు. http://jeevani2009.blogspot.in/2011/07/2.html ప్రతి నెలా 2000/- ఇస్తూ మంత్లీ డోనర్ గా ఉన్నారు.  వీరికి, వీరి కుమారుడు చి.విశాల్ కు శుభం కలగాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. రాజవర్ధన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. జీవని ప్రధాన కార్యదర్శి, SRIT Correspondent ఆలూరు సాంబశివారెడ్డికి రాజవర్ధన్ క్లాస్ మేట్. వీరందరికీ జీవనిని పరిచయం చేసింది సాంబశివారెడ్డి గారే.   

రాజవర్ధన్  సోదరుడు కర్ణా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల CEO గా ఉన్నారు. జగన్ తాను 2000/- జీవనికి విరాళం ఇస్తుండగా వారి మరో ఇద్దరు మిత్రులు శిరీష గారు 2000/- పద్మనాభ రెడ్డి గారు 1000/- ప్రతి నెలా విరాళం పంపుతున్నారు.   జీవనికి అందిస్తున్న సహాయ సహకారాలకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

http://www.jeevanianantapur.com/dailybalance.php

Read Moreన్యూ జెర్సీ, అమెరికాలో ఉంటున్న శ్రీమతి శైలజ గారు వారి నాన్న జయంతి సందర్భంగా నిన్న జీవని పిల్లలకు స్పెషల్ మీల్ స్పాన్సర్ ( 2000/- ) చేసారు. అలాగే 10,000/- విరాళం అందించారు. వారు నిన్న కుటుంబ సమేతంగా జీవనికి వచ్చారు. భర్త హరి గారు, పిల్లలు హర్షి, ఈషా, శైలజ అమ్మగారు పిల్లలతో ముచ్చటించారు. అందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php 

Read Moreశ్రీమతి ఆషాలత మరియు శ్రీ రమేష్ బుక్కపట్నం గారు జీవనికి 5000/- విరాళం అందించారు. వారు దోహా, ఖతార్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.  ఫేస్ బుక్లో జీవని గురించి తెలుసుకుని వారు విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము.  ఇందుకు సహకరించిన మిత్రులు మేడా ప్రసాద్, మేడా రమేష్ గార్లకు ధన్యవాదాలు.


డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php 

Read Moreమిత్రులారా పిల్లలకు ఆర్థికంగానే కాక ఇతరత్రా ఎలా సహాయపడాలి అని ఎందరో దాతలు అడుగుతుంటారు. వారికోసం ఇక ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో క్లాసులు నిర్వహించనున్నాము. మీలో ఒక్కో రంగంలో ఆరితేరిన మేధావులు, కళాకారులు ఉన్నారు. మీ ఙ్ఞానాన్ని పిల్లలకు పంచండి. మీరు ఏ హైద్రాబాద్, అమెరికా, యూకే నుంచి పాఠాలు చెప్తే, మాట్లాడితే వారికి థ్రిల్లింగా ఉంటుంది. మీ విజయ గాథలు చెప్పండి, కథలు చెప్పండి, ఆత్మస్థైర్యాన్ని నింపండి, మీకు తెలిసిన విషయాలు, ముఖ్యంగా మీ ప్రాంత ఆచార వ్యవహారాలు, ఆ ప్రాంత చరిత్ర చెప్పగలిగితే సంతోషం. ఎందుకంటే చరిత్ర, భూగోళ శాస్త్రం ఈ పద్ధతిలో నేర్చుకుంటే పిల్లలు ఎప్పటికీ మర్చిపోరు. ఫలానా ఆయన అమెరికా నుంచి  ఈ విషయాలు చెప్పారు అని వ్యక్తితోపాటు ఆ విషయాన్ని కూడా గ్రహిస్తారు.  అలాగే మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయొచ్చు.
దీన్ని నిర్వహించడానికి అవసరమయ్యే ప్రొజెక్టర్ కొనడానికి ఒక దాత ముందుకు వచ్చారు. వారికి ధన్యవాదాలు. ఈ నెల 25 వ తేదీ నుంచి దీన్ని ప్రారంభించనున్నాము. అంతకంటే కొన్నిరోజుల ముందు దాత ప్రారంభిస్తారు. ప్రతి ఆదివారం మీరు పిల్లలతో ఇంటరాక్ట్ కావచ్చు. అయితే శుక్రవారంలోగా కింది వివరాలు పంపితే మేము ప్లాన్ చేసుకోగలము. 
పేరు:
నివాస స్థలం:
సబ్జెక్ట్:
వ్యవధి :
సమయం : భారత కాలమానం ప్రకారం
మీరు jeevani.sv@gmail.com కు మెయిల్ చేయవచ్చు

ఒక్కోసారి ఇక్కడి నిర్వాహకులకు అత్యవసర పరిస్థితుల్లో సాధ్యం కాకపోతే దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము.

ఈ రోజు లాప్టాప్ ద్వారా గూగూల్ హ్యాంగ్ ఔట్లో అమెరికాలోని దాత ద్వారా మాట్లాడించాము. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php

Read More

జీవని ప్రధాన కార్యదర్శి మరియు శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి, శ్రీమతి పద్మావతి దంపతులకు పుత్రోదయం కలిగింది. బాబు ఆయురారోగ్యాలతో నాన్నలాగే సేవాతత్పరుడిగా, మంచి వ్యక్తిగా, డైనమిక్ గా తయారుకావాలని జీవని కుటుంబం తరఫున కోరుకుంటున్నాము .


డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php

Read Moreగుడివాడకు చెందిన అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్ వారు జీవనికి 4000/- విరాళం అందజేసారు. వారు గతకొద్ది నెలల నుంచి నెలనెలా 2000/- విరాళం ఇస్తున్నారు. వారికి జీవనిని పరిచయం చేసింది వినీల్ గారు వారు కూడా జీవనికి ప్రతి నెలా 2000/- విరాళం అందిస్తున్నారు. వినీల్ గారికి జీవనిని పరిచయం చేసింది బ్లాగర్ రెహ్మాన్ గారు :) వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php

Read More

Blog Archive

Followers