శ్రీనివాస రెడ్డి, సబ్ రిజిస్ట్రార్, గుత్తి మరియు శ్రీమతి నాగలక్ష్మి గార్ల కుమారుడు చి. మోక్ష చైతన్య జన్మదినం సందర్బంగా జీవనిలో కేకు కట్ చేసి పిల్లలకు స్వీట్స్ పంచారు.                      శ్రీనివాసరెడ్డి గారు జీవని ప్రధాన బాధ్యుల్లో ఒకరు.  వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.                
Read More

అనంతపురం ఎక్సైజ్ సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీ. నరసింహులు మరియు శ్రీమతి శ్రీ లక్ష్మి గార్లు తమ కుమారుడు చి. హిమవర్ష్ పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందించారు. వారందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Read More


అయ్యప్ప స్వామి భక్తులు పూజ నిర్వహించి భిక్ష పెట్టే సంప్రదాయం మనందరికీ తెలుసు. భిక్షా కార్యక్రమానికి అయ్యే ఖర్చును సేవా కార్యక్రమానికి వినియోగించాలని స్వాములు అనుకున్నారు. ఆ మొత్తంతో జీవని నెలసరి భత్యాన్ని స్పాన్సర్ చేసారు . మొత్తం 11,000/- రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు విరాళంగా ఇచ్చారు. అనంతపురానికి చెందిన మణికంఠ బ్యాటరీ వర్క్స్ సంస్థ అధినేత జయచంద్ర నాయుడు, గోపాల్ వారి మిత్రబృందం ఈ కార్యక్రమలో పాల్గొన్నారు. వారికి జీవనిని పరిచయం చేసింది మిత్రులు సాయి. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

Read More

 
బ్లాగర్ శ్రీమతి మధురవాణి గారు వారి జీవిత భాగస్వామి శ్రీ.ప్రసాద్ గారు 15,000/- విరాళం అందించారు. వారు ప్రతి సంవత్సరం జీవనికి విరాళం అందిస్తున్నారు. పిల్లల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
November Donations
SBI
Sarva Sri.
Sujani - 500/-
Dasari Balasekhar - 500/-
Shiak shikshavali - 1000/-
Atluri Bhavani Charitable Trust - 5000/-
Noor Mahammad - 2000/-
Sridhar kethepally - 500/-
Anonymous - 5000/-
Janaki Maruthi - 1000/-
Sri Kalyani Viswanathan - 1000/-
Lavanya Polepalli - 5000/-
Sadlapalle Chidambara Reddy - 2000/-
Nagamani - 1000/-
ICICI
Nanda kiran kumar - 500/-
Udaybhaskar reddy - 1000/-
Mdhuravani & Prasad - 15,000/-
Andhra Bank
Usha Rani - 20,000/-

Read Moreఉదయం పిల్లలతో పాటు లేచి పిల్లలు పడుకున్నాక ఆమె పడుకుంటుంది. ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటుంది, ఆమె తత్వమే అంత. కానీ వాటి వెనుక అవ్యాజమైన ప్రేమ ఉంది. పిల్లల ఆరోగ్యం, తిండి, సాధకబాధకాలు.... జీవని క్యాంపస్‌లో చెట్ల పెంపకం, పరిశుభ్రత ఇలా చాలా బాధ్యతలు నిర్వర్తిస్తూంటుంది. నిజానికి ఎక్కువ పనిపెట్టామా అనిపిస్తుంది.

అమ్మకు ఇలా సేవ చేయడం ముందునుంచీ అలవాటు. వైద్య ఆరోగ్య శాఖలో ఆమె రిటైర్ అయ్యారు. 1980 కాలాల్లో రవాణా సౌకర్యాలు లేనప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా కాన్పులు చేయడానికి వెళ్ళేవారు. గర్భిణీల బంధువులు ఎద్దులబండిలో వచ్చి మేమున్న పంచాయితీ గ్రామం నుంచి పల్లెలకు పిల్చుకుపోయేవారు. చాలామంది పేద విద్యార్థులకు సహాయం చేసేది. సేవాభావానికి నాకు స్ఫూర్తి ప్రదాతల్లో అమె కూడా ఒకరు.

నిజానికి ఆమెకు కేక్, సెలెబ్రషన్స్ ఇష్టంలేదు, కానీ పిల్లల ఆనందం కోసం ఒప్పుకుంది.
కొసమెరుపేమంటే ఇది ఆమె జీవితంలో జరుపుకున్న మొదటి పుట్టిన రోజు.
జీవని మనవళ్ళు, మనవరాళ్ళ తరఫున మా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

అలాగే జీవని విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షహీన్ తాజ్ గారు తమ జన్మదినం సందర్భంగా మధ్యాహ్నం, రాత్రి భోజనం స్పాన్సర్ చేసారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Read More


జీవనికి తమ సహకారాన్ని అందిస్తూ వస్తున్న మరువం ఉషగారు విరాళం అందించారు. ఉషగారికి నాన్న కేశవ రావు గారంటే  ప్రాణం. ఆయన పేరిట విరాళం అందిస్తున్నారు. ఉషగారి దాతృత్వాన్నికుమారుడు యువ కూడా అందుకున్నారు. యువ తన మొదటి జీతం తీసుకున్నపుడు జీవనికి విరాళం ఇచ్చారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.Read More

దేవరహస్యం పుస్తకావిష్కరణ సభ ఈరోజు సచివాలయం లో ప్రభుత్వ సలహాదారు శ్రీ కే వీ రమణ గారు అవిశ్కరించరు. దానికి సంబంధించిన వార్తా స్టూడియో ఎన్ లో ప్రసారమయింది ఈ కథనాలకు గతం లో జీ 24 గంటలు చానల్ లో వీక్షకులు అదరించారు. తరువాత బ్లాగర్లు  అభిమనించారు. ఇప్పుడు పాఠకులు ఆదరించాలని  ఆశిస్తున్నా 


 posted by : kovela santosh kumar

Read More

ఓ రెండేళ్ల కిందట ఒక ఫోన్‌కాల్ వచ్చింది. తాను చంద్రశేఖర్, ఈటీవి అనంతపురం అని పరిచయం చేసుకున్నారు. బ్లాగులో జీవని గురించి చూసానండీ చాలా బావుంది ఒకసారి ఈటీవిలో కథనం వేద్దాం అన్నారు. ఈలోపు బాలికల డార్మిటరీ నిర్మాణం ప్రారంభం అయింది. ఇది పూర్తి అయ్యాక ఈటీవిలో వస్తే బావుంటుందని అనుకున్నాము. తర్వాత దాని గురించి ఇద్దరం మరచిపోయాము. మళ్ళీ ఉన్నట్టుండి శేఖర్ గారు స్టోరీ చేసేద్దాం అని మొన్న షూటింగ్ పెట్టారు. వస్తూవస్తూ తన పిల్లల్ని తీసుకొచ్చారు జీవని పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు పంచారు. రమణ గారు, చాలా ఓపిగ్గా దృశ్యాలు సేకరించారు.
వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము


 ఆలూరు సాంబశివా రెడ్డి, కార్యదర్శి, జీవని


సుప్రజ, జీవని అమ్మాయి

Read More


అనంతపురంలో పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులు

Read Moreనాలుగేళ్ళుగా తమతో పాటు ఉండి ఒక్కసారిగా ఈ ప్రపంచం నుంచి మాయం అయితే... 

మిత్రుడి ఙ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆ కన్నీళ్ళను ఆపుకోడానికి మరోచోట ఆనందం పొందాలని సేద తీరాలని వారంతా జీవనికి వచ్చారు. 
పిల్లల్ని రోజంతా ఆడించారు చక్కటి బోజనం పెట్టారు పిల్లల నవ్వులతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిన తమ మిత్రుడికి నివాళులు అర్పించారు.
తమ క్లాస్‌మేట్ మేఘశ్యాం స్మృతిలో వారి మిత్రులు జీవనికి వచ్చారు. వారంత ఇంజనీరింగ్ ఆఖరు సంవత్సరం చదువుతున్నారు.
భాను అనే అమ్మాయి పుట్టినరోజు కూడా కావడంతో ఆ కార్యక్రమం జరిపారు. జీవని అబ్బాయి హరిక్రిష్ణ బర్త్‌డే కూడా అదే రోజు.
మేఘశ్యాం మిత్రులంతా జీవనికి సర్వింగ్ టేబుల్స్ విరాళంగా ఇచ్చారు
వారితో పాటు లెక్చరర్స్ కూడా వచ్చారు, అందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 


Read More

చి.సుహాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు శ్రీ.నాగార్జున రెడ్డి మరియు శ్రీమతి,స్రవంతి గార్లు ( అమెరికా ) జీవనికి విరాళం అందజేసారు. వీరు ప్రతి సంవత్సరం విరాళం ఇస్తున్నారు.  విరాళం అందించడంలో నాగార్జున గారి అమ్మానాన్న సహకరించారు
వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఈనెల పుట్టినరోజు జరుపుకొంటున్న హరిక్రిష్ణ, గత నెల పుట్టినరోజులు అయిపోయిన ధనలక్ష్మి , శ్రావణి కేక్ కట్ చేసారు.


Read More


మొత్తం కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించిన జీవని శ్రేయోభిలాషి కుమార స్వామి రెడ్డి గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు.

Read Moreశ్రీమతి.ప్రభావతి మరియు శ్రీ చంద్రఓబుళ రెడ్డి గార్లు తమ కుమారుడు భరత్‌సింహా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందించారు. వారు బాలికల డార్మిటరీకి సహాయం చేయాలి అనుకున్నారు. బిల్డింగ్ నిర్మాణం కోసం 3 లక్షలు అప్పు చేసిన విషయం మీకు ఇదివరకే తెలిపాము. నిన్న ఈ సొమ్మును లోనుకు జమ చేసాము. దాతలకు జీవనిని పరిచయం చేసింది శ్రీ నార్పల సప్తగిరి రెడ్డిగారు మరియు వారి సతీమణి శ్రీమతి అనిత గారు వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 

Read Moreశ్రీ అమరనాథ్ రెడ్డి ( శక్తి స్వరూప్ చిట్స్ ) మరియు శ్రీమతి లలిత గార్ల కుమార్తె సంజన మొదటి పుట్టినరోజు నేడు. ఈసందర్భంగా వారు 20,000/- విరాళం అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  Read More

friends pl give suggestions, these are printed on flexis and hanged to the walls. every day children will read. if you want to add any point or if you feel to delete kindly suggest. it is raw format, will be improved after suggestions
tq.
morning prayer
నా లక్ష్యం చేరుకోవడానికి మరో ఉదయం నా ముందుకు వచ్చింది
ప్రశాంతంగా మంచి మనసుతో పాజిటివ్‌గా ఈ రోజును నేను ప్రారంభిస్తున్నాను
నిన్నటి తప్పులను పొరపాట్లను ఈ రోజు అధిగమిస్తాను
చదువే నా గమ్యం చదువే నా ఊపిరి చదువే నా జీవితం
నా జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దేది చదువే
నా తలరాతను మార్చేది చదువే 
అందుకే నేను ఈరోజు పాఠాలు చక్కగా వింటాను బాగా చదువుతాను 
అందరితో స్నేహంగా ఉంటాను
check list
నేను ఈరోజు బాగా పాఠాలు విన్నానా?
అబద్ధాలు చెప్పానా?
చాడీలు చెప్పానా?
ఇతరులను బాధపెట్టానా?
పోట్లాడానా?
నా లక్ష్యాన్ని మరిచానా?
ఎంతసేపు నవ్వాను?
ఎంత ఆనందంగా ఉన్నాను?
night prayer
నేటి దినచర్యను నేను ఆత్మ విమర్శ చేసుకుంటున్నాను 
నేను తప్పు చేసి ఉంటే ఇప్పుడే సరిదిద్దుకుంటున్నాను 
కొన్ని వందలమంది నేను గొప్ప స్థానానికి పోవాలని కోరుకుంటున్నారు 
నాకు సహాయం చేస్తున్నారు 
వారిలో పిల్లలు పెద్దలు పేదలు కూడా ఉన్నారు
వారి నమ్మకాన్ని నేను వమ్ము చేయను
పెద్దయ్యాక ఈ సమాజానికి నేను తప్పకుండా సహాయపడతాను 
మాకు చేయీతనిస్తున్న వారికి సుఖ సంతోషాలను ఇమ్మని దేవుని ప్రార్థిస్తూ ఈరోజుకు సెలవు తీసుకుంటున్నాను
pic: model of a hanged flexi


Read More


దత్తతకు సంబంధించి మాకు తరచుగా కాల్స్ వస్తుంటాయి. కొద్దిరోజుల కిందట దినపత్రికలో వచ్చిన వార్త చూసి మరోసారి టపా పెడుతున్నాము.

దత్తత ఎందుకు?

1) పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్లు నిర్ధారించాక వీలైనంత త్వరగా దత్తత ప్రక్రియ మొదలుపెట్టండి.
2) టెస్ట్ ట్యూబ్ బేబీస్ కోసం ఎక్కువసార్లు ప్రయత్నిచడం వల్ల మహిళల్లో హార్మోన్ల పరంగా సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతారు
3) పిల్లలు లేరు అన్న భావన భార్యాభర్తలను కుంగదీస్తుంది
4) స్త్రీలు బంధువుల నుంచి, ఇంటాబయట రకరకాలుగా హింసను ఎదుర్కోవలసి వస్తుంది.
5) ఒక అనాధ బిడ్డను దత్తత చేసుకుంటే ఆ పాపకు / బాబుకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు
6) మీకు పాపపుణ్యాల పట్ల నమ్మకం ఉంటే ఏ మనిషీ జీవితంలో ఇంతకంటే పెద్ద పుణ్యం చేయలేరు. ఎంతమంది దేవుళ్ళను కొలిచినా అంత పుణ్యం వస్తుందని అనుకోలేము
7) మనం కొన్ని వేల సంవత్సరాలు బతకడం లేదు, ఏక్షణంలోనైనా ఈ ప్రపంచాన్ని వీడి పోవచ్చు. క్షణభంగురమైన జీవితానికి పిల్లలు లేరు అని ప్రతి క్షణం హింసపడే బదులు చక్కగా దత్తత తీసుకోవచ్చు. జీవితాన్ని సతృప్తికరంగా మలచుకోవచ్చు.

కొన్ని సలహాలు...

1) డాక్టర్లు నిర్ధారించాక మరికొన్ని సంవత్సరాలు గుళ్ళూగోపురాలు తిరిగాక తీరా చివరి అవకాశంగా దత్తతకు వెళ్తారు, అప్పటికి భార్యాభర్తలకు వయసు ఎక్కువ అయిపోయి ఉంటుంది. అలాగే మనం అప్లికేషన్ పెట్టిన వెంటనే దత్తత ఇవ్వరు. ఇందుకు కనీసం 1-2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోండి. మీ పేరు సీనియారిటీ లిస్టులో ఉంటుంది. ఈలోపు పిల్లలు కలిగారనుకోండి శుభం, మీరు దత్తత ప్రక్రియ నుంచి తప్పుకోవచ్చు.

2) జీవని లాంటి ఆశ్రమాల్లో రాష్ట్రవ్యాప్తంగా వేల మంది పిల్లలు ఉంటారు. కానీ చాలామంది పిల్లలకు వారి అవ్వాతాతలు, పెదనాన్న చిన్నాన్న లాంటి వారు ఉంటారు. కాబట్టి ఆశ్రమాలు దత్తత ఇవ్వడం జరగదు. అలా ఇవ్వడం తీసుకోవడం చట్టవిరుద్ధం కూడా. డబ్బులు ఇచ్చి మోసపోవద్దు.

3) దత్తత ప్రక్రియ శిశుసంక్షేమ శాఖ, ఫ్యామిలీ కోర్టు ద్వారా అధికారులు, న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది.

దత్తత తీసుకునే భార్యాభర్తలకు సహాయపడటానికి మేము ఎళ్ళవేళలా సిద్ధం. సమాచారం కావాలంటే jeevani.sv@gmail కి మెయిల్ చేయవచ్చు. 

మిగతా వివరాలు కింద చూడండి Read More

నిన్నటి నుంచి దసరా సెలవులు కావడంతో పిల్లలు తమ అవ్వాతాతలు, తల్లిదండ్రుల రక్తసంబంధికుల ఇళ్ళకు వెళ్ళారు. ఓ ఐదుగురు పిల్లలు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. తిరిగి పిల్లలు 5వ తేదీన జీవనికి వస్తున్నారు. ఇంటర్నెట్ సమస్య వల్ల గత కొద్దిరోజులుగా బ్లాగ్ అప్డేషన్ కుదరలేదు. పిల్లలతోపాటు మేమంతా కూడా వారం పాటు సెలవు తీసుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలతో సెలవు.


 pic taken at JEEVANI
courtesy: Rajkumar Neelam  http://rajkumarneelam2.blogspot.in/
Read More
మిత్రులారా మొన్న బాలికల డార్మిటరీ ప్రారంభోత్సవం రోజున 65 హుండీలను ఇక్కడికి వచ్చిన పిల్లలకు ఇచ్చాము. పిల్లలకు వారి తల్లిదండ్రులకు విన్నవించింది ఏమంటే పుట్టినరోజు లేదా ఇతరత్రా సందర్భాల్లో వీటిని ఓపెన్ చేయండి. ఆ మొత్తాన్ని జీవనికే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినచోట అవసరం ఉన్నవారికి ఇవ్వండి అని. పిల్లల్లకు ఆదా చేయడాన్ని ఆపైన సేవకు వాటిని వినియోగించడాన్ని నేర్పండి. జీవని నినాదం జీవితంలో జీతంలో 1% సమయాన్ని డబ్బును సేవకు కేటాయించండి ఎక్కడైనా ఎవరికైనా... అది జీవని కావాల్సిన అవసరం లేదు. పిల్లల్లో సేవాభావాన్ని పెంపొదిస్తే సమాజం పట్ల ఒక సానుకూల ధోరణి, దయాగుణం, స్నేహశీలత లాంటివి అలవడతాయి అని చెప్పాము. ఇకనుంచి కూడా జీవనికి వచ్చే ప్రతి కుటుంబానికి రెండు హుండీలు ఇవ్వాలని అనుకున్నాము. ఒకటి వచ్చినవారికి రెండోది వచ్చిన పిల్లల బెస్ట్ ఫ్రెండ్‌కి. హుండీలకు అడ్రస్‌లు అతికిస్తున్న బ్లాగర్లు

Read More

 
 నెట్ ఇబ్బందులు ఇతర పనులవల్ల మొన్నటి కార్యక్రమ విశేషాలను మీముందు ఆలశ్యంగా ఉంచడం జరుగుతోంది. మూడు సంవత్సరాల కిందట శంకుస్థాపన రోజున మేము ఉన్నాము, జీవని మరో మైలురాయి సాధించిన రోజున కూడా మేము ఉంటాము అని బ్లాగర్ రాజ్‌కుమార్ గారు ముందే చెప్పారు. అనుకున్నట్టుగానే రాజ్ దంపతులు, కార్తీక్, రహమాన్ గార్లు బెంగళూరు నుంచి వచ్చారు.

ఆతర్వాత జరిగింది రాజ్ మాటల్లోనే చదవండి...


ఎన్ని సార్లు వెళ్ళినా జీవని కి వెళ్ళొచ్చిన ప్రతి సారీ సరికొత్త అనుభవాలు ఙ్ఞాపకాలై ఉండిపోతాయి నాకు. పోయిన ఏడాది అనుకున్న ప్రయాణం అలా వాయిదాల మీద వాయిదాలు పడి మొన్నటికి కుదిరింది.

ఈ సారి ఎప్పుడూ వచ్చే మన వాళ్ళలో చాలా మందికి కుదరక పోయినా, అనుకోని ట్విస్టులతో సరదాగానే సాగింది. బెంగుళూరు నుండి నేనూ మా ఓనర్ గారూ, కార్తీకూ, రెహమానూ శనివారం పొద్దున్నే బయలెళ్ళాం.

మా ఆచారం ప్రకారం, ఈ సారి కూడా దారి మరిచిపోయి వీలైనంత ఎక్కువ దూరం ప్రయాణించి జీవని కి చేరుకున్నాం. రెండేళ్ళ క్రితం పునాది రాయి వేసినప్పుడు చూసిన ప్రదేశమేనా ఇదీ? అనిపించేలా చుట్టూ ప్రహారీ గోడ, దాన్ని ఆనుకొని మొక్కలు, ఓ పక్క స్కూల్, ఆ పక్క బోయ్స్ హాస్టల్, దాని పక్కనే ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్దం గా ఉన్న గర్ల్స్ హాస్టల్. "ఆహా..." అనుకున్నాం. ప్రతి సారీ మేం వెళ్ళగానే చుట్టుముట్టి అల్లరి చేసే పిల్లలు, ఈ సారి మాత్రం అలా పలకరించి తిరిగి వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. కొందరు అమ్మాయిలు గుడ్డముక్కలతో గులాబీలు చేస్తుంటే, మరికొందరు వాకిలి అలుకుతూ, ఇంకొందరు పూలమాలలు కడుతూ, పరిసరాలు శుభం చేస్తూ బిజీ బిజీగా  కనిపించారు. కొందరు అబ్బాయిలు , అమ్మాయిల కోసం గోరింటాకు తెచ్చి పేద్ద బండరాయితో నూరుతూ ఉంటే, చిన్నప్పుడు  మా అమ్మ , పిన్ని ల కోసం గోరింటాకు తెచ్చి నూరి న రోజులు గుర్తొచ్చాయి.
ఇవన్నీ మరునాడు జరగబోయే ఫంక్షన్  కి ఏర్పాట్లన్న సంగతి అర్ధమయ్యి   భోజనాలు చేసి  ఎవరో మత్తు మందు ఇచ్చినట్టుగా బజ్జున్నాం. సాయంత్రం అలా ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళి హరేకృష్ణ.. అనుకొని తిరిగొచ్చేసరికి, పక్కనే ఉన్న ఇంజినీరింగ్ కాలేజ్ పిల్లల
సహాయంతో  ఒక పేద్ద రంగుల ముగ్గేసే బృహత్ కార్యక్రమం నడుస్తుంది అక్కడ. ఆ ముగ్గు చుట్టూరా తిరుగుతూ నాలుగు ఫోటోలు తీసి కబుర్లు చెప్పుకున్నాం.
 

  అప్పటి వరకూ ఏర్పాట్లూ, గ్యాప్ లేకుండా వచ్చే ఫోన్ లతో  తీరిక లేకుండా ఉన్న ప్రసాద్ గారూ -సునంద అక్కలు కూడా  మాతో కలిశారు.


రాత్రి  10 గంటల సమయం లో  శివ కుమార్ అనే చలాకీ బుడ్డోడు,బయట ఆడుకొని నిద్రపోయిన ఇంకో చిన్న పిల్లాడిని  ఎత్తుకొని  మేడ మీది గది లో పడుకోబెట్టడానికి మెట్లెక్కుతుంటే మేమంతా అలా చూస్తూ ఉండిపోయాం."పిల్లలు తొందరగా
ఎదిగిపోతున్నారు " అని చూడగానే అనుకున్నాం గానీ "బాధ్యత గల కుటుంబ సభ్యులు" గా ఎదుగుతున్నారని  అప్పుడే తెలుసుకున్నాం. ఆ ఏజ్  లో  నాకంత మెచూరిటీ ఉన్నట్టు నాకయితే గుర్తు లేదు, తమ్ముడి పుట్టిన్రోజు నాడు  నాకు కొత్త బట్టల్లేవని ఏడ్చి కొనిపించుకున్న  అల్లరితనం, రోజంతా  కొట్టుకుని  చివరాఖర్న తన్నులు తిన్న తింగరితనం తప్ప.పిల్లని ఈ  రీతి లో  పెంచుతున్నందుకు మనసు లో ఓ సారి దండం పెట్టుకున్నాను.

మరుసటి రోజు  పిల్లలు ఇచ్చే పెర్ఫార్మెంస్ లని ఓ సారి రివ్యూ చేసి, కామెడీ స్కిట్ లో  కొంచెం కరివేపాకు వేసి, రిహార్సల్స్ అన్నీ అయ్యాక   రాత్రి  ఒంటిగంటకెపుడో   మేం నిద్రపోయాం. స్టాఫ్ మా త్రం తెల్లవార్లూ డెకరేషన్ స్  చేస్తూనే ఉన్నారు.

పొద్దున్నే   తెలివొచ్చినాగానీ  బద్దకం గా ఇంకా మంచం మీదున్న  నాకు"సార్... ఈ మంచం తియ్యండి, లెగండి ఇంక పడుకున్నది చాలు" అన్న మాటలు  కొంచెం కరకు గా వినిపించడం తో  కార్తీక్ నీ, రెహ్మాన్ నీ లేపి, ఏదో‌డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూశా, మిర్చి లో ప్రభాస్ లాగా మొహానికి తువ్వాలు కట్టుకుని అరుస్తున్నది "శీనన్న" అని కనిపెట్టి షాకయ్యాం అందరం.(శీనన్న   వస్తున్నట్టు మాకు తెలవది) ఆ పక్కనే‌ సురేష్ గారు. ఓ సారి కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్  మని అరిచి కిందకి
ఉరికాం. శీనన్న వచ్చాక ఎలా ఉంటాదో మన జనాలకి బాగా తెలుసు కదా. రచ్చ రచ్చ అన్నమాట.
 
డార్మిటరీ ఓపెనింగ్ సెర్మనీ  విశాల ఫెర్రర్ గారి చేతుల మీదుగా  అయింది.
 
 
 
 
 ఊరికి దూరం అయినా  మూడొందల మంది కి పైగా జనాలు వచ్చారు.
పిల్లలు చేసిన గ్రూప్ డ్యాంస్ లు (వాళ్ళే కంపోజ్ చేసుకున్నారు) ఆకట్టు కోగా, కామెడీ స్కిట్  జనాల్లో నవ్వుల సునామీ ని  సృష్టించింది.
 
 
 
 

  ప్రసాద్ గారి అధ్యక్షతన  జీవని కుటుంబ సభ్యులంతా మాట్లాడారు. బ్లాగర్ల ప్రతినిధి గా  స్టేజెక్కి కూర్చున్న శీనన్న, మైక్ పట్టుకొని  నించొని ఇచ్చిన  స్పీచ్ కి   సభ మొత్తం షేక్ అయ్యింది. తెలుసుగా... ఆ వాయిస్ కి బేస్ ఎక్కువ,మాటలకి పదునెక్కువ.
 


విజయ్ మోహన్ గారు ఈ సారి  కూడా వచ్చి కలిశారు. ఇంటికి రమ్మని  ఎప్పటిలానే  పిలిచారు. సమయం లేక వెళ్లలేకపోయాం. సభానంతరం  క్లాస్ రూం  బెంచ్ ల మీద కూర్చొని భోజనం చెయ్యడం ఒకరకం ఆనందాన్నిస్తే, అక్కడ జరిగిన మరో
చిన్న సంఘటన  ఇంకో  రకమైన  ఙ్ఞాపకాన్నిచ్చింది. మా ముందు బెంచ్ లో కూర్చుని భోజనం‌చేస్తున్న  ఓ పిల్లాడి దగ్గరకి , రైస్ ప్లేట్ తో వచ్చిన  ఓ‌ అమ్మాయి (మూడో, నాలుగో చదువుతుంది అనుకుంటా) "ఏరా... పప్పు వేస్కొని తింటున్నావా
అయి..పోయావ్. అంతే ఇక" అని  ఓ సీరియస్ లుక్కిచ్చి  పక్క  బెంచ్ మీద కూర్చుంది. ఇంకో అబ్బాయి వచ్చి.."నువ్ పప్పు తినకూడదని చెప్పారు కదరా...బుద్ది లేదా? తినేస్తున్నావ్" అని తిట్టాడు. వాడు  కలిపిన పప్పు ముద్దని ఏడుపు మొహంతో  పక్కన పెట్టేశాడు. విషయం‌ఏంటని  అడిగితే చెప్పాడు.."వాడినీ కుక్క కరిచింది సార్.. గాయం మానే వరకూ పప్పు తినకూడదు అన్నారు. వీడు  తినేస్తున్నాడు"అని అసలు సంగతి చెప్పాడు. వాళ్ళ అభిమానం, స్నేహం చూసి ఎంత ముచ్చటేసిందో.!!!

సాయంత్రం ఐదింటికి శీనన్న, విజయ్ మోహన్ గారు, సురేష్ గార్లకీ, జీవని కుటుంబం మొత్తానికీ వీడ్కోలు చెప్పి , మళ్ళీ వచ్చేవరకూ  సరిపయే అనుభవాలని  నింపుకొని తిరుగు ప్రయాణమయ్యాం.

***********************************************************************************************************************
జీవని ప్రారంభం నుంచి బ్లాగర్లు ఇస్తున్న ఆర్థిక నైతిక మద్దతు మరువలేనిది. జీవనిని నిలబెట్టడంలో మీ అందరి పాత్ర ఎంతో ఉంది. మీకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Read More

Blog Archive

Followers