friends pl give suggestions, these are printed on flexis and hanged to the walls. every day children will read. if you want to add any point or if you feel to delete kindly suggest. it is raw format, will be improved after suggestions
tq.
morning prayer
నా లక్ష్యం చేరుకోవడానికి మరో ఉదయం నా ముందుకు వచ్చింది
ప్రశాంతంగా మంచి మనసుతో పాజిటివ్‌గా ఈ రోజును నేను ప్రారంభిస్తున్నాను
నిన్నటి తప్పులను పొరపాట్లను ఈ రోజు అధిగమిస్తాను
చదువే నా గమ్యం చదువే నా ఊపిరి చదువే నా జీవితం
నా జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దేది చదువే
నా తలరాతను మార్చేది చదువే 
అందుకే నేను ఈరోజు పాఠాలు చక్కగా వింటాను బాగా చదువుతాను 
అందరితో స్నేహంగా ఉంటాను
check list
నేను ఈరోజు బాగా పాఠాలు విన్నానా?
అబద్ధాలు చెప్పానా?
చాడీలు చెప్పానా?
ఇతరులను బాధపెట్టానా?
పోట్లాడానా?
నా లక్ష్యాన్ని మరిచానా?
ఎంతసేపు నవ్వాను?
ఎంత ఆనందంగా ఉన్నాను?
night prayer
నేటి దినచర్యను నేను ఆత్మ విమర్శ చేసుకుంటున్నాను 
నేను తప్పు చేసి ఉంటే ఇప్పుడే సరిదిద్దుకుంటున్నాను 
కొన్ని వందలమంది నేను గొప్ప స్థానానికి పోవాలని కోరుకుంటున్నారు 
నాకు సహాయం చేస్తున్నారు 
వారిలో పిల్లలు పెద్దలు పేదలు కూడా ఉన్నారు
వారి నమ్మకాన్ని నేను వమ్ము చేయను
పెద్దయ్యాక ఈ సమాజానికి నేను తప్పకుండా సహాయపడతాను 
మాకు చేయీతనిస్తున్న వారికి సుఖ సంతోషాలను ఇమ్మని దేవుని ప్రార్థిస్తూ ఈరోజుకు సెలవు తీసుకుంటున్నాను
pic: model of a hanged flexi


on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. నిన్నటి లోపాలను పాఠాలుగా చేసుకుని ఈరోజు పనిలో ఫలితం సాధిస్తాను.

    రోజు రోజుకు క్రమ క్రమంగా అన్నింటా అభివృద్ధిని సాధిస్థాను.

    అంతా పోయినా భవిష్యత్తు మిగిలే ఉంటుంది.

    తప్పు చేయనిది శిశువు శవం మాత్రమే.

    రెండడుగులు ముందుకు - ఒక అడుగు వెనుకకు - మొత్తంగా ముందుకు

     
  2. jeevani Says:
  3. Thank you sir

     

Blog Archive

Followers