మిత్రులారా జీవని కార్యవర్గ సభ్యులు శ్రీ డేవిడ్ గారికి హైదరాబాద్ లో మంగళవారం అంటే 23వ తేదీన బైపాస్ సర్జరీ ఆపరేషన్ జరగనుంది. ఆయన రక్తం గ్రూపు A+. రక్తం ఇవ్వదల్చుకున్నవారు దయచేసి సాల్మన్ రాజు, 9951123522కు సంప్రదించగలరు.

ధన్యవాదాలు.

మీ

జీవని

Read More





మా మిత్రుడు ఆకెళ్ల రాఘవేంద్ర ద్వారా మొన్న తనికెళ్ళ భరణి గారిని కలిశాము. నేను, మరో అరుగురు మిత్రులు వెళ్లాము. ఆయన సింప్లిసిటీకి అందరం ఫ్లాట్ అయ్యాము. ఆయనలో కించిత్తు ఈగో కూడా కనబడలేదు. చాలా సరదాగా కలివిడిగా మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత అందరూ మొదట అన్న మాట ఇదే. దాదాపు రెండున్నర గంటల సేపు ఆయనతో గడిపాము.


తన కవిత్వం చదివి వినిపించారు, అలాగే కొన్ని పాటలు పాడారు. ఆయనది మంచి గొంతు.


నేటి విద్యా వ్యవస్థను భరణి గారు తీవ్రంగా విమర్శించారు. కాసింత కవిత్వం, సంగీతం ఇతర కళలు లేకుండా ఈ చదువులు ఏమిటి? కళలు మనిషిలో సృజనాత్మకతను పెంచడమేకాకుండా మానవత్వాన్ని నింపుతాయి. చిన్న పిల్లల్ని చదువు పేరుతో హాస్టళ్ళలో వేసి తాము వారిని ఉద్ధరిస్తున్నామని అనుకుంటున్నారు పెద్దలు. ఈ పిల్లలు పెద్దయ్యాక తమను చూడకపోతే అది వారి తప్పు ఎంత మాత్రం కాదు. పిల్లల్ని యంత్రాల్లా మార్చి పెద్దలే తప్పు చేస్తున్నారని ఆయన అన్నారు.


అలాగే మార్కుల పోటీ ఎంత అసహ్యంగా ఉందో?? ఫస్టు రావడం అనేదానికి ఓ లిమిట్ లేకుండా పోయింది. 99% వచ్చినా ఇంకో శాతం ఏమైంది అంటారు. వ్యవస్థలో సమూలంగా మార్పులు రావాలని ఆయన అభిలషించారు.


విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరం అని తనికెళ్ళ భరణిగారు చెప్పారు. చదువే జీవితం కాదు, అది జీవిరంలో ఒక భాగం మాత్రమే అని అన్నారు.


మొత్తమ్మీద ఎన్నో విషయాల మీద మేము అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.


జీవని గురించి మేము వివరించాము. చాలా మంచి పని చేస్తున్నారు, కానీయండి. విజయం సాధిస్తారు అని అన్నారు.




Read More





జీవని సలహా మండలి చైర్మన్ శ్రీ జగదీశ్వర రెడ్డి గారు జీవనికి 10000/- విరాళం ఇచ్చారు. దాన్ని బ్యాంకు ఖాతాలో వేయడం జరిగింది.

మీ,

జీవని.



Read More



మిత్రులారా మీ పరిధిలో తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే దయచేసి తెలియచేయండి. జూన్ 2010 లో 25 మంది పిల్లల్ని కొత్తగా జీవని చేర్చుకుంటోంది. పిల్లల మత ప్రాంత తదితర పట్టింపులు లేవు. దూర ప్రాంతం వారైనా ఇబ్బంది లేదు. ఈ ఒక్క సంవత్సరం మాత్రమే వాళ్ళు ప్రైవేటు బడిలో చదువుకుంటారు. 2011 జూన్ లో జీవని విద్యాలయం ప్రారంభం అవుతుంది. అప్పుడు అందరూ అక్కడికి వెళ్తారు. ముందుగా చెప్పినట్లు పిల్లలు పెద్ద అయ్యేంత వరకు వారు స్థిరపడే వరకు జీవని బాధ్యత వహిస్తుంది.




అయితే కొన్ని నియమాలు.


1) తల్లీ తండ్రి ఇద్దరూ లేని వారికి మొదటి ప్రాధాన్యం
2) సింగిల్ పేరెంట్ ఉన్నవారు
3) పేరెంట్స్ పూర్తి అనారోగ్యంతో మంచం మీద ఉన్న పరిస్థితి
4) పిల్లలు 5-8 సంవత్సరాల లోపు వుండాలి.
5) HIV సోకిన పిల్లల్ని మనం తీసుకోవడం లేదు


అర్హులైన వారినే ఆదరించాలని ఈ నియమాలు పెట్టడం జరిగింది.


contact: jeevani.sv@gmail.com
9948271023




Read More



మిత్రులారా కిందటి వారంలో నా స్నేహితుడు ఆకెళ్ళ రాఘవేంద్ర అనంతపురం వచ్చారు. అతను నాకు ఈ టీవీలో మిత్రుడు. ప్రస్తుతం హైదరాబాద్ అశోక్ నగర్లో IAS స్టడీ సర్కిల్ నడుపుతున్నాడు. అది అతని ప్రధాన వృత్తి కాగా వివిధ ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో వ్యక్తిత్వ వికాసంపై సెమినార్లు ఇస్తుంటాడు. అయితే వీటి ద్వారా వచ్చిన ఆదాయంతో సేవ చేస్తున్నాడు. అంధులకు, వికలాంగులకు వ్యక్తిత్వ వికాసం, స్వయం ఉపాధిపై సీడీలు తయారుచేసి వారికి ఉచితంగా అందజేస్తున్నాడు. అలాగే ఒక ట్రస్టు ద్వారా పూర్తి స్తాయిలో సేవలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది త్వరలోనే ప్రారంభం కానుంది.

రాఘవేంద్ర పర్యటనలో ఒక సెషన్ లో మాకు కేటాయించాలని కోరాను. మాకు దగ్గరలో ఉన్న రాజేంద్ర మునిసిపల్ హై స్కూల్ పిల్లలకు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న అంశంపై దాదాపు రెండు గంటలు ప్రసంగించాడు.

పిల్లల మొదటి ప్రశ్న సార్ మాకు చదివింది ఒక్క ముక్క గుర్తు ఉండదు అన్నారు.

అందుకు రాఘవేంద్ర ఇలా చెప్పారు. ఆటో సజెషన్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఒక అంశం చదివే ముందు దీన్ని ఏదో ఒక సందర్భంలో తిరిగి అడుగుతాను కాబట్టి జాగ్రత్తగా గుర్తు పెట్టుకో అని మెదడుకు హెచ్చరిక చేయాలట.

మన మెదడుకు ఒక లక్షణం ఉంది. ఏదైనా సాదాసీదా విషయం అయితే వీలైంత త్వరగా మర్చిపోతుంది. విలక్షణమైన అంశాలను బాగా గుర్తు పెట్టుకుంటుంది. పెక్యూలియర్ గా ఉండే వ్యక్తులు మనకు బాగా గుర్తుండిపోతారు. కాబట్టి మనం చదివే అంశంలో ఇలాంటి లక్షణాలు ఉంటే వాటిని గుర్తించడం ఇంకా ఎన్నో చెప్పాడు.




దీన్ని జీవని తరఫున ఆర్గనైజ్ చేశాము























.

Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo