మా మిత్రుడు ఆకెళ్ల రాఘవేంద్ర ద్వారా మొన్న తనికెళ్ళ భరణి గారిని కలిశాము. నేను, మరో అరుగురు మిత్రులు వెళ్లాము. ఆయన సింప్లిసిటీకి అందరం ఫ్లాట్ అయ్యాము. ఆయనలో కించిత్తు ఈగో కూడా కనబడలేదు. చాలా సరదాగా కలివిడిగా మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత అందరూ మొదట అన్న మాట ఇదే. దాదాపు రెండున్నర గంటల సేపు ఆయనతో గడిపాము.


తన కవిత్వం చదివి వినిపించారు, అలాగే కొన్ని పాటలు పాడారు. ఆయనది మంచి గొంతు.


నేటి విద్యా వ్యవస్థను భరణి గారు తీవ్రంగా విమర్శించారు. కాసింత కవిత్వం, సంగీతం ఇతర కళలు లేకుండా ఈ చదువులు ఏమిటి? కళలు మనిషిలో సృజనాత్మకతను పెంచడమేకాకుండా మానవత్వాన్ని నింపుతాయి. చిన్న పిల్లల్ని చదువు పేరుతో హాస్టళ్ళలో వేసి తాము వారిని ఉద్ధరిస్తున్నామని అనుకుంటున్నారు పెద్దలు. ఈ పిల్లలు పెద్దయ్యాక తమను చూడకపోతే అది వారి తప్పు ఎంత మాత్రం కాదు. పిల్లల్ని యంత్రాల్లా మార్చి పెద్దలే తప్పు చేస్తున్నారని ఆయన అన్నారు.


అలాగే మార్కుల పోటీ ఎంత అసహ్యంగా ఉందో?? ఫస్టు రావడం అనేదానికి ఓ లిమిట్ లేకుండా పోయింది. 99% వచ్చినా ఇంకో శాతం ఏమైంది అంటారు. వ్యవస్థలో సమూలంగా మార్పులు రావాలని ఆయన అభిలషించారు.


విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరం అని తనికెళ్ళ భరణిగారు చెప్పారు. చదువే జీవితం కాదు, అది జీవిరంలో ఒక భాగం మాత్రమే అని అన్నారు.


మొత్తమ్మీద ఎన్నో విషయాల మీద మేము అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.


జీవని గురించి మేము వివరించాము. చాలా మంచి పని చేస్తున్నారు, కానీయండి. విజయం సాధిస్తారు అని అన్నారు.
on
categories: | edit post

6 వ్యాఖ్యలు

 1. rameshsssbd Says:
 2. chalamandi laga hippocrat kadu. if availvle plese read his poet "AATA GADARA SIVA" realley excellent book on siva tathva.if possible plese send his mobile no or personal address to me for send wishes only.rameshsssbd@gmail.com

   
 3. భరణి గారు వ్రాసిన 'పరికిణీ' కవితా సంపుటి చదవండి.

   
 4. karthik Says:
 5. wow!
  good to know this..
  hope jeevani will reach out to more and more people..

   
 6. sowmya Says:
 7. భరణి గారు చెప్పిన అంశాలు ఎంతో నిజం. మీరు ఇలా టూకీగా కాకుండా మీ చర్చ మొత్తం ఒక పెద్ద పోస్ట్ రాస్తే బాగుంటుంది. నాకు భరణి గారి ఆహర్యం అంటే చాలా ఇష్టం.

   
 8. jeevani Says:
 9. @రమేష్ గారు

  తప్పకుండా పంపుతాను.

  @ అక్షర మోహనం గారూ

  క్షమించాలి. పరికిణీ అని గుర్తు ఉంది. కానీ అనుమానం వచ్చి రాయలేదు. భరణి గారు దాదాపు సంపుటి మొత్తం చదివి వినిపించారు.

  @ కార్తీక్ గారూ,

  ధన్యవాదాలు.

  @ సౌమ్య గారూ తప్పకుండా! కాకపోతే కాస్త సమయం ఇవ్వండి. నిజానికి సెల్లో రికార్డింగ్ చేస్తున్నాము. ఆయన " దయచేసి ఆపండి. నాకు ఇబ్బందిగా వుంది చదవడానికి " అన్నారు.

   
 10. భరణి గారు మంచి అభిప్రాయాలు వ్యక్తపరిచారు.

   

Blog Archive

Followers