జీవనికి తెలుగు బ్లాగర్లతో ఉన్న అనుబంధం గురించి మీ అందరికీ తెలుసు. రేపటికి హృదయ స్పందన కార్యక్రమం జరిగి నెల అవుతుంది. టికెట్ అమ్మకం డబ్బులు పూర్తిగా చేతికి అందలేదు అందుకే జమాఖర్చులు కాస్త లేటుగా తెలియజేస్తున్నాము.
ఇక హృదయ స్పందన కార్యక్రమం క్రెడిట్ ఒంగోలు శీను గారిదే. కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి రాజ్, కార్తీక్, సురేష్, కుమార్ గార్లు అందరం తరచుగా చర్చించుకుంటూ ప్లాన్ చేసాము.
శీనుగారికి సేవా రంగంలో పండిపోయిన తల ఇక్కడ జీవనికి బాగా ఉపకరిస్తోంది. ఆయన సలహాలు సూచనలు జీవనికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 
ఈ కార్యక్రమం వేదికగా విరాళం అందించిన దాతల వివరాలు 

సర్వ శ్రీ 

+Sri nivas 
+రాజ్ కుమార్. +Karthik Indrakanti +Suresh Peddaraju +KVK Kumar +nagarjuna chary +బులుసు సుబ్రహ్మణ్యం +Vijayamohan Chilamakuru +Sri Atluri +Vineel Gattu +sapta swaraalu +Thanneeru Sasi +Ravi E.N.V.  +anand addanki  nishigandha  +Venu Srikanth Darla  +Nagh Raj  +pappu sreenivasa rao  +sowmya alamuru +Indu Priya  Padma Wundavalli +Manasa Chamarthi ఫోటాన్ హర్ష +మీ భారతీయుడు 

వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము 
Read More

జీవని గురించి ఈనాడు ఆదివారంలో కథనం వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసి ఉంటుంది. అందులో నా నెంబర్ ఇవ్వడంతో ఆదివారం నుంచి ఇప్పటివరకూ కాల్స్ వస్తూనే ఉన్నాయి.
మేము మంచి పని చేస్తున్నాం అని అభినందించారు కొందరు సంబరపడ్డారు మరి కొందరు విరాళం అందించారు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
పిల్లలు లేరు దత్తత ఇస్తారా అని, ఉద్యోగం ఇస్తారా అని చాలామంది అడిగారు.
ఒకాయన తాను త్వరలో అనాధాశ్రమం, వృధాశ్రమం, గోశాల పెడతాను అన్నారు. తర్వాత మీ ప్రాంతం వాళ్ళు కన్నింగ్ మా వాళ్ళతో పోలిస్తే అన్నారు. ఆ తర్వాత నా కులం అడిగారు అప్పటికి నా సహనం చచ్చి ఫోన్ పెట్టేసాను.
ఇక కొంతమందైతే తమ సమస్యలు చెప్పి ఏడ్చేసారు. కొంచెం అన్నం పెట్టండి నీడనివ్వండి నా పెన్షన్ మొత్తం తీస్కోండి ఈ వయసులో నాకు నా అన్న వారు లేరు నన్ను ఆదుకొండి బాబూ అని భోరున విలపించారు. ఎప్పుడు రావాలి అని అడుగుతారు
పిల్లలు తల్లిదండ్రులను సరిగా చూడటం లేదు.
జీవితంలో సమస్యలు కాదు జీవితమే సమస్యగా మారి దుర్భర జీవితం గడుపుతున్నవారు.
చాలా బాధ అనిపించింది. కానీ మన పరిధి చిన్నది. మన పరిమితులు మనకు తెలుసు. వారందరికీ మంచి కలగాలని కోరుకోవడం మినహా చేయగలిగింది లేదు.


ఈనాడు ఆదివారం మాగజైన్‌లో వచ్చిన కథనం 
Read Moreమహేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటూ, శివరాత్రి శుభాకాంక్షలతో...
జీవని కుటుంబం 

Read More


జీవని అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన, పోషిస్తున్న ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జీవని సేవా కార్యక్రమాలను ఆయన ఎక్కడా ఎప్పుడూ తన వ్యక్తిగత అవసరం కోసం వాడుకోలేదు.
జీవని ద్వారా ఏ ఒక్క వ్యక్తీ పేరు ప్రఖ్యాతులు పొందరాదు అన్న ఆశయాన్ని ఆయన నిలబెట్టారు. జీవని సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరి వేదిక. ఇది అందరిదీ, ఈ భావనకు తోడ్పడుతున్న జీవని ప్రధాన బాధ్యులు అందరికీ వేనవేల నమస్కారాలు.


Read More

Blog Archive

Followers