జీవని గురించి ఈనాడు ఆదివారంలో కథనం వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసి ఉంటుంది. అందులో నా నెంబర్ ఇవ్వడంతో ఆదివారం నుంచి ఇప్పటివరకూ కాల్స్ వస్తూనే ఉన్నాయి.
మేము మంచి పని చేస్తున్నాం అని అభినందించారు కొందరు సంబరపడ్డారు మరి కొందరు విరాళం అందించారు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
పిల్లలు లేరు దత్తత ఇస్తారా అని, ఉద్యోగం ఇస్తారా అని చాలామంది అడిగారు.
ఒకాయన తాను త్వరలో అనాధాశ్రమం, వృధాశ్రమం, గోశాల పెడతాను అన్నారు. తర్వాత మీ ప్రాంతం వాళ్ళు కన్నింగ్ మా వాళ్ళతో పోలిస్తే అన్నారు. ఆ తర్వాత నా కులం అడిగారు అప్పటికి నా సహనం చచ్చి ఫోన్ పెట్టేసాను.
ఇక కొంతమందైతే తమ సమస్యలు చెప్పి ఏడ్చేసారు. కొంచెం అన్నం పెట్టండి నీడనివ్వండి నా పెన్షన్ మొత్తం తీస్కోండి ఈ వయసులో నాకు నా అన్న వారు లేరు నన్ను ఆదుకొండి బాబూ అని భోరున విలపించారు. ఎప్పుడు రావాలి అని అడుగుతారు
పిల్లలు తల్లిదండ్రులను సరిగా చూడటం లేదు.
జీవితంలో సమస్యలు కాదు జీవితమే సమస్యగా మారి దుర్భర జీవితం గడుపుతున్నవారు.
చాలా బాధ అనిపించింది. కానీ మన పరిధి చిన్నది. మన పరిమితులు మనకు తెలుసు. వారందరికీ మంచి కలగాలని కోరుకోవడం మినహా చేయగలిగింది లేదు.


ఈనాడు ఆదివారం మాగజైన్‌లో వచ్చిన కథనం 




on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo