అనంతపురంలో జీవనికి చేదోడువాదోడుగా నిల్చే సంస్థల్లో పవిత్ర హైపర్ మార్ట్ ఒకటి. కొద్ది నెలల కిందట ప్రారంభించిన పవిత్ర మార్ట్, కొద్దిరోజుల్లోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇందులో విరాళాల కలెక్షన్ బాక్స్ ఉంచారు. కస్టమర్లతో పాటు యాజమాన్యం కూడా విరాళాలు అందులో వేసారు. ఇది 5600/- అయింది. నిజానికి చాలా రోజుల కిందటే బాక్స్ ఓపెన్ చేసాము. కానీ వరుసగా టపాలు పెట్టవలసి వచ్చి ఇది ఆలస్యం అయింది. పవిత్ర మార్ట్ మేనేజింగ్ పార్టనర్లు వంశీ మోహన్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, రామచంద్రా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి  మరియు సిబ్బందికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పవిత్ర మార్ట్ దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటున్నాము. 




Read More


శెట్టూరులో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న బాబూరావు, చాలా రోజుల నుంచి పిల్లలకు బ్లడ్ గ్రూపింగ్ చేద్దాం  అంటున్నారు. నిన్నటికి తీరింది. ఇందుకు కావలసిన సరంజామాను బాబు సోదరుడు, AFFLATUS GLOBAL SCHOOL ప్రిన్సిపాల్  సాల్మన్ స్పాన్సర్ ( 3500/- ) చేసారు. గ్రూపింగ్ తోపాటు, HIV TEST కూడా చేసారు. వీరికి శ్యాం సహాయం చేసారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

సునీత మొదటినుంచీ ఏడుస్తూ చాలా బాధపడి రక్తం ఇచ్చింది. కానీ తీసేటపుడు మాత్రం మారాం చేయలేదు. ఆ అమ్మాయికి చెప్పాము. సమస్య కూడా ఇలానే ఉంటుంది. దాన్ని ఫేస్ చేయనంత వరకూ భూతంలాగా కనిపిస్తుంది. చాలా సమస్యలు ఫేస్ చేస్తే తేలిగ్గానే ఉంటాయి. మనమే భయపడతాం అని.  

చిట్టచివరగా బ్లడ్ శాంపిల్ తీసిన నంద కిషోర్ మాత్రం ముగ్గురు పట్టిలాగినా పిడికిలి వదల్లేదు. బొటన వేలు దాచిపెట్టుకున్నాడు :)
మిగతా వాళ్లు ఎవ్వరూ ఏడ్చలేదు. అందరికీ లంచంగా చాక్లెట్లు ఇచ్చాము.
బాబు బ్లడ్ గ్రూపింగ్ చేయటమే కాక వాటి గురించి పూర్తిగా పిల్లలకు వివరించాడు. వారికి ప్రాక్టికల్గా చూపించాడు. మేమందరం కూడా బ్లడ్ గ్రూపింగ్ ఎలా చేస్తారో  తెలుసుకున్నాము.

పిల్లల బ్లడ్ గ్రూపులు .... 

Jyothi, Sandhya, Dhanalakshmi, Banu, Ramanji, Chaitanya, Asif, Manisha - A+

Om prakash - A- 
 
Ravi, Lavanya, Shiva, Hemanth, Supriya, Supraja, Surendra, Dinesh, Manoj, Indraja, Sravani, Sunitha, Satish, Ganesh, Nanda kishore, - B+

Srinidhi, Anand - AB+
 
Mehataj, Vamsi, Hari, E.Ganesh, Sowjanya, Bhaskar, Sowmya, Srithaja, Vivekananda  - O+


సేవారంగంలో ఒకప్పుడు అద్భుతంగా పనిచేసిన బాబు కొన్నేళ్ళుగా స్తబ్దుగా ఉన్నాడు. ఇప్పుడు తిరిగి తన కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్లు చెప్పాడు. రక్తదానంలో అవార్డు అందుకున్నాడు. రక్తదానం విరివిగా చేయించాడు. అంతకంటే ముఖ్యంగా అంటురోగాలతో చనిపోయిన వారికి, అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేసేవాడు. బాబు తిరిగి తన కార్యక్రమాలు మొదలుపెట్టాలని పదిమందికీ సేవ చేయాలని కోరుకుంటున్నాము. 



నిన్న సాయంత్రం మిత్రులు హరీష్ బాబు ( పెనుకొండలో డిగ్రీ కాలేజి లెక్చరర్గా పని చేస్తున్నారు ) జీవని సందర్శించి పిల్లలకు స్వీట్లు పంచారు. వారికీ థ్యాంక్స్.



Read More


నరేంద్ర జయంత్ గారు చక్కటి డెంటిస్ట్ ( ఎప్పుడో పదేళ్ల కిందట మా కుటుంబ సభ్యులకు పన్ను తీసేసి క్యాప్ పెట్టారు, ఇప్పటికీ ఎలాంటి సమస్య లేదు ). ఆయన కొద్దిరోజుల కిందట డాక్టర్ హరిప్రసాద్ ( ప్రత్యూషకు అపెండిసైటిస్ చేసారు) తో కలిసి జీవనికి వచ్చారు. ఆ రోజు ఆయన బర్త్ డే. సరే పనిలోపనిగా పిల్లల పళ్ళు చెక్ చేసారు. వారిలో సందీప్ కు కాస్త డేంజర్ ఉంది అని చెప్పారు. తీసుకురండి ట్రీట్మెంట్ ఇద్దాం అన్నారు. పనుల హడావిడిలో మేము మర్చిపోయాము. నిన్న సందీప్ పన్ను బాగా నొప్పిపెడుతోంది అని వచ్చాడు. జయంత్ గారి దగ్గరకు తీసుకెళ్ళాము. ఒక పిప్పిపన్ను పీకేసి, మరో పంటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. పిల్లలకు బోల్డన్ని పేస్టులు బ్రష్ లు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 




Read More

మిత్రులు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు జీవని పిల్లలతో ఇలా...





శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియెంటేషన్ కార్యక్రమం కోసం ఆయన అనంతపురం వచ్చారు.
రఘూ ధన్యవాదాలు...

Read More




మిత్రులారా బాలికల డార్మిటరీకి అంచనా ( పూర్తి స్థాయి ) 15,00,000/- అయితే ఇప్పటిదాకా వచ్చిన విరాళాలు 3,22,871/-
ఒక చిన్న విన్నపం గత కొద్దిరోజులుగా జీవనికి ఆదాయపు పన్ను మినహాయింపు, జీవని విద్యాలయం రికగ్నిషన్ పనులతో బిజీగా ఉన్నాము. ఒకవేళ ఎవరైనా విరాళం ఇచ్చి ఇక్కడ చూపకపోతే దయచేసి క్షమించండి. మెయిల్ చేయండి. దీన్ని మా నిర్లక్ష్యంగా భావించవద్దని మనవి. ఇక 10,000/- పైన వచ్చే విరాళాలు డార్మిటరీకి మళ్ళిద్దాం అనుకున్నాము. మిగతావి జీవని నిర్వహణకు వినియోగిస్తాము. ఈ నిర్ణయాన్ని జీవని కమిటీ సభ్యులు రెండు రోజుల కిందట తీసుకున్నారు. ఇందులో మీకు ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే దయచేసి తెల్పండి. దాతలకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 
కింద మొదటి సెగ్మెంట్లో ఉన్న విరాళాలు మొత్తం అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారి ద్వారా అందాయి.  


6000 - Sri. Santosh Krishnamoorthy
6000  -
Sri. Kishore Kumar
6000  -
Sri.Bhargav Tadepalli
6000  -
Sri.Sreekanth Kamineni
6000  -
Sri.Ronak Tak
6000  -
Sri.Rahul Sowmian
6000  -
Sri.Ramshankar Subbaiah
6000  -
Sri.Upendar Rao Peram
6000  -
Sri.Ravi Kiran Reddy Chada
3000  -
Sri.Sarat Apparasu
3500  -
Sri.Jitendra Yarlagadda
14500-
Sri.Shyam Kandala

30000- Atluri Bhavani Charitable Trust, Gudivada

18000- Master Archish Soto

12000- Smt.Sarasu
---------------------------------------------

10,000 - Baby SRUTHI
10,000 -
Sri.KRANTHI
15,000 - Master SUHAS REDDY

10,000 - Sri.SURYA
10,000 -
Sri.ANANAD REDDY
20,000 -
Sri.YUVA
1,12,871- Smt. AGTU PUSHPAVATHI &
Sri.AGTU VARA PRASAD REDDY
15,352 - Sri VINOD


ఈ పోస్ట్ టైప్ చేస్తుండగా చివరి విరాళం అందింది. ఇందుకు సహకరించిన మహేష్ గారికి ( మెన్స్ వరల్డ్ , సుభాష్ రోడ్, అనంతపురం ) ధన్యవాదాలు

Read More



అనంతపురం వృత్తివిద్య జూనియర్ కళాశాల విద్యార్థులు రోటరీపురం గ్రామంలో 7 రోజులపాటు NSS క్యాంపు నిర్వహించారు. ఇందులో భాగంగా 3 రోజులు జీవనిలో గ్రౌండ్ క్లీనింగ్, చదును చేశారు. కళాశాల విద్యార్థులకు, ప్రిన్సిపల్ ఈశ్వర రెడ్డి గారికి, NSS కో ఆర్డినేటర్ కొండన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.









 జీవని కార్యదర్శి, SRIT కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి ప్రసంగిస్తున్న దృశ్యం
ఎడమ నుంచి కుడికి : Sri.Kondanna, NSS coordinator; Sri.Eswara reddy, Principal; SRIT CEO Sri.Jaganmohan reddy, Tadipatri sub registrar Sri.D.Srinivasula reddy




రెండో వరుసలో : Sri.Narpala sapthagiri reddy, CEO Sai Datta maac society

Read More


శ్రీమతి అగ్తు పుష్పావతి మరియు శ్రీ అగ్తు వరప్రసాద రెడ్డి గారి పేరు మీద వారి కుమారుడు శ్రీ రామకృష్ణా రెడ్డి, శ్రీమతి మంజూష గార్లు ఈ విరాళం అందించారు. రామకృష్ణా రెడ్డి గారు అట్లాంటాలో ఉంటున్నారు. వీరు జీవనికి చాలా కాలం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు.  వీరందరికీ జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.



Read More


పిట్స్ బర్గ్ లో ఉంటున్న శ్రీ మనోజ్ నందమూరి శ్రీమతి హేమ నందమూరి గార్లు కొత్త ఇంటిలో ప్రవేశించారు. ఈ సందర్భంగా వారి కుమార్తె నేహ నందమూరి స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. పిల్లల సౌలభ్యం కోసం స్పెషల్ మీల్స్ ఆదివారం అరేంజ్ చేయనున్నాము. నందమూరి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము.   



Read More






బ్లాగర్ శంకర్ గారి శ్రీమతి స్వాతి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా శంకర్ గారి బ్లాగు మిత్రులు జీవనికి 5000/- విరాళం అందించారు. సోదరి స్వాతి గారికి మంచి జరగాలని పిల్లల తరఫున కోరుకుంటున్నాము. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

అలాగే కార్తీక్ కుమార్ రెడ్డికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. కార్తీక్, చంద్రమౌళి రెడ్డి గారి రెండో అబ్బాయి. వీరు జీవనికి వచ్చి పిల్లలకు స్వీట్లు, సమోసా ఇచ్చారు.  చంద్రమౌళి గారి మొదటి అబ్బాయి ఈశ్వర రెడ్డి లుకేమియాతో చనిపోయిన విషయం గతంలో పోస్ట్ చేసాము. 

Read More



జీవని ప్రారంభం నుంచి ఇంతవరకూ పిల్లలకు ఎవరికీ తీవ్రమైన ఆరోగ్య సమస్య రాలేదు. మొదటిసారిగా సాయి ప్రత్యూషకు అపెండిసైటిస్ వచ్చింది. సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి ఫోన్ చేసాను. తీసుకురా చేసేద్దాం అన్నారు. ఒక్కపైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ అయిపోయింది. అంతకంటే ముఖ్యం ప్రత్యూషను ఇంకా అడ్మిట్ చేయలేదు, నేను హరితో మాట్లాడుతుండగా రెండు కేసులు వచ్చాయి. బెడ్స్ ఖాళీ లేవు ఇప్పుడే ఒక అమ్మాయి ( ప్రత్యూష ) అడ్మిట్ అయింది అని చెప్పారు. హరి గారు నడుపుతున్న చిన్నారి హాస్పిటల్ చాలా చిన్నది. 6 పడకలు మాత్రమే ఉన్నాయి. వారి గొప్ప మనసుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
హరి చాలా సరదాగా, ఫ్రాంక్ గా ఉంటారు. అలాగే సేవా తత్పరత ఎక్కువ. అడ్వాన్సు, ఫీజులతో సంబంధం లేకుండా ఆపరేషన్ చేస్తుంటానని, హాస్పిటల్ నిర్వహణ ఖర్చు వస్తే చాలు అనుకుంటూ ఉంటానని అన్నారు. ఈ తరం శిశువుల్లో జన్యుపరమైన లోపాలు ఎక్కువగా ఉన్నాయని. ఈ ఆపరేషన్లను తక్కువ ఖర్చుతో పేదలకు అందించేలా ఒక ట్రస్టు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలిపారు.
బెడ్డు ఖాళీగా ఉందంటే పడిశం పట్టిన పిల్లలకు న్యుమోనియా అని బెదరగొట్టి వారం రోజులు అడ్మిట్ చేసుకుని డబ్బులు దండుకునే డాక్టర్లు అనంతపురంలో ఉన్నారు. కొత్త పేషెంట్ వచ్చే వరకూ వీరిని డిశ్చార్జ్ చేయరు. ఈ డాక్టర్లతో డిశ్చార్జ్ చేయించుకోవాలంటే మర్డర్ కేసులో బెయిల్ తెచ్చుకోవాలన్నంత కష్టం. ఇక పిల్లలు పుట్టగానే జాండిస్ పేరు చెప్పి పిల్లల్ని దాదాపుగా ఎత్తుకుపోయి ( మెటర్నిటీ హాస్పిటల్ నుంచి ) తమ ఆస్పత్రుల్లో చేర్చుకునే పిల్లల డాక్టర్లు ఉన్నారు.
వీరి మధ్య మంచి డాక్టర్లు, గొప్ప డాక్టర్లు కూడా ఉన్నారు. గొప్ప డాక్టర్లలో  ఒకరుగా హరి గొప్ప స్థానానికి చేరుకోవాలని కోరుకుంటున్నాము.
తాను ఇంగ్లీష్ నేర్చుకోవడంలో పడ్డ ఇబ్బందిని గుర్తు చేసుకుని తన మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు 1000 గ్రామర్ పుస్తకాలు ఉచితంగా సరఫరా చేసారు.  


ఇక్కడ ముందు కూచున్న అమ్మాయి ప్రత్యూష ( తెల్ల డ్రస్ )


 డాక్టర్ హరి ప్రసాద్ 

నిన్న ఆపరేషన్ విషయం తెలవగానే తాము సహాయం చేయాలా అని ముందుకు వచ్చిన అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.




 

Read More



మిత్రులారా గడచిన వారం రోజుల నుంచి ఏకబిగిన కార్యక్రమాలు, వరుసబెట్టి బర్త్ డేలు, మధ్యలో సాయిప్రత్యూషకు అపెండిసైటిస్ ఆపరేషన్, జీవనిలో ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమం మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసాయి. ప్రత్యూష ఇప్పుడు బావుంది. జీవని ప్రారంభం అయ్యాక ఆరోగ్య పరంగా వచ్చిన మొదటి పెద్ద సమస్య.  అనంతపురంలో ప్రముఖ సర్జన్, సోదరులు హరిప్రసాద్ చాలా తక్కువ ఖర్చులో ఆపరేషన్ చేసారు. వీటన్నిటికి సంబంధించి విడివిడిగా టపా పెడతాము.
మాకున్న మానవ వనరులు తక్కువ, జీవని నిర్వహణ మొత్తం ముగ్గురు వ్యక్తులు చేస్తున్నారు. ఈ హడావిడిలో ఎవరికైనా మెయిల్స్ రిప్లై ఇవ్వడం ఆలస్యం అయినా, బర్త్ డేలు, స్పెషల్ మీల్స్ అటూఇటూ అయినా దయచేసి అలసత్వంగా భావించకండి. ఇప్పటి వరకు అలా ఎవరూ అనుకోలేదు, మా మీద అపారమైన నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు. అది మా అదృష్టం.
ఇక నవంబర్, డిసెంబర్లలో ఎక్కువ బర్త్ డేలు ఉన్నాయి. ఒకే రోజు ఇద్దరి ముగ్గరి కార్యక్రమాలు వుంటున్నాయి. మనం స్పెషల్ మీల్స్ రోజుకు ఒకసారే పెడతాము. అందరి విరాళం 9000/- అవుతుంది. ఈ సందర్భంలో మిగతా విరాళాన్ని జీవని నిర్వహణ ఫండ్లోకి కలపనున్నాము. కాబట్టి అందరూ మీల్స్ స్పాన్సర్ చేసినట్లే భావించండి. 
పిల్లలకు స్పెషల్ తిండి ఎక్కువై బాధపడుతున్నారు. కొంతమంది వాంతులు చేసుకుంటున్నారు. స్పెషల్ మీల్స్ పెట్టించకపోతే దాతలు ఫీలవుతారని భయం. నిన్న మరీ దారుణం. SRIT సివిల్ పిల్లలు రాత్రి మీల్స్ స్పాన్సర్ చేసారు. ప్రసాదం అని ఇద్దరు స్వీట్లు తెచ్చారు  ( పులిహోర, కేసరిబాత్ )  . బాలల దినోత్సవం అని మళ్ళీ స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చారు.
జీవని నిర్వహణ వ్యయం నెలకు 70-80 వేలు ఉంటోంది. ప్రతి నెలా క్రమం తప్పక మనకు వస్తున్న విరాళాలు 40000/- స్పెషల్ మీల్స్ వారానికి ఒకసారి అయితే బావుంటుంది అనుకుంటున్నాము. మిగతా విరాళాల్ని నిర్వహణ ఫండ్కు డైవర్ట్ చేస్తాము. ఇందులో ఏవైనా సవరణలు ఉంటే దయచేసి తెలియజేయండి.

Read More



అమెరికాలో ఉంటున్న నాగార్జున రెడ్డి మరియు శ్రీమతి స్రవంతి గార్ల కుమారుడు సుహాస్ రెడ్డి పుట్టిన రోజు 13వ తేదీన. సుహాస్ కు ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వారు జీవనికి 15000/- విరాళం ఇచ్చారు. నాగార్జున గారు ప్రతి సంవత్సరం 25,000/- విరాళం ఇస్తున్నారు. వారి సహాయ సహకారాలకు పిల్లల తరఫున కృతఙ్ఞతలు. 







 file photo


file photo

Read More


దోహాలో ఉంటున్న శ్రీ బుక్కపట్నం రమేష్ మరియు శ్రీమతి ఆషాలత గార్ల కుమారుడు వెంకట నితిన్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా వారు పిల్లలకు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు.  వీరికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.




Read More



అనంతపురం జిల్లా బత్తలపల్లిలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీ సంజీవరెడ్డి, శ్రీమతి లావణ్య గార్ల కుమారుడు ఉదయశేఖర రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్లు, నూనె, సోపులు తదితర నిత్యావసరాలు విరాళంగా ఇచ్చారు. వారితోపాటు ఆంజనేయ ప్రసాద్ గారు, సిసి టు కళ్యాణదుర్గం డిఎస్పీ, గణేష్ కుమార్, గ్రామ కార్యదర్శి, ఆత్మకూరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరికీ ధన్యవదాలు  తెలియజేస్తున్నాము. 






Read More


చక్కటి కవితలు, కథలు, స్వగతాలు కలగలిపిన బ్లాగు మురళీగానం. దాన్ని ఆలపిస్తున్న బ్లాగర్ నాగమురళీధర్ గారు.  మురళి గారి పుట్టినరోజు నేడు అలాగే మ్యారేజి డే కూడా. మురళి, శ్రీమతి ఝాన్సి దంపతులకు జీవని పిల్లల తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వారు 5000/- విరాళం అందించారు. వారికి ధన్యవాదాలు.
అన్నట్టు మురళి గారి బోనస్ బ్లాగ్ మహానగరం. అందులో జానపద సీరియల్ రాస్తున్నారు. 

http://muralidharnamala.wordpress.com

http://mahanagaram.wordpress.com/

http://facebook.com/nnmuralidhar 

http://twitter.com/muralidharnn 

https://profiles.google.com/muralidhar.namala/buzz 

 
మురళిగారి చిరు కవిత ఒకటి...

రాత్రిని చూడగలిగే ఊరేదన్నా ఇంకా బ్రతికుంటే చెప్పు
ఏ రాములోరి గుడి మెట్ల మీదో, ఏ కోనేటి ఒడ్డునో నిలబడి
ఒక్కటంటే ఒక్కటి మంచుకురిసే కార్తికరాత్రిని చూసొచ్చేద్దాం.

Read More



స్వర్గీయ ఆలూరు పుల్లారెడ్డి గారి ( జీవని ప్రధాన కార్యదర్శి, SRIT కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి గారి సోదరులు )   స్మృతిలో వారి సతీమణి  ఆలూరు రాజేశ్వరమ్మ గారు నిన్న జీవనిలో స్పెషల్ మీల్ స్పాన్సర్ చేసారు. 1000/- విరాళంగా ఇచ్చారు.
జీవనిలో నీళ్ళు, కరెంటు, నిర్మాణం ఇలా ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి చేదోడువాదోడుగా ఉండే  ఆలూరు నాగశేషారెడ్డి వారి సతీమణి శ్రీమతి రమాదేవి, కోడలు శ్రావణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  

Read More







Read More



జీవని ఆశ్రమం ప్రారంభించాక ఇది రెండవ దీపావళి.
ఈసారి పటాసులు స్పాన్సర్ చేసినవారు


1. Chandrakanth Naidu, Anantapur Surgicals 
2. Chandra Mohan Reddy, PA to MLA, Anantapur
3. Gnaneswara Reddy, Asst. Admin. Officer, Afflatus Global School, Anantapur
4. Jagadeesh, Crackers shop no. 9, ATP
5. Jahnavi
6. Pavithra Voluntary Organisation, Anantapur
7. Rangaiah, Commissioner, Anantapur Municipal Corporation
8. Seshasayana Reddy, Director, Afflatus Global School, Anantapur

వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మరికొందరు బ్లాగు మిత్రులు టపాసులకోసం డబ్బు పంపినప్పటికీ మనకు వచ్చినవే పిల్లలకు సరిపోయాయి. కాబట్టి ఆ విరాళాలను బాలికల డార్మిటరీకి డైవర్ట్ చేయడం జరిగింది.


ఈసారి గాలి ఎక్కువగా ఉండటంతో దీపాలు పెట్టలేకపోయాము.
అందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు. 

















Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo