జీవని ప్రారంభం నుంచి ఇంతవరకూ పిల్లలకు ఎవరికీ తీవ్రమైన ఆరోగ్య సమస్య రాలేదు. మొదటిసారిగా సాయి ప్రత్యూషకు అపెండిసైటిస్ వచ్చింది. సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి ఫోన్ చేసాను. తీసుకురా చేసేద్దాం అన్నారు. ఒక్కపైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ అయిపోయింది. అంతకంటే ముఖ్యం ప్రత్యూషను ఇంకా అడ్మిట్ చేయలేదు, నేను హరితో మాట్లాడుతుండగా రెండు కేసులు వచ్చాయి. బెడ్స్ ఖాళీ లేవు ఇప్పుడే ఒక అమ్మాయి ( ప్రత్యూష ) అడ్మిట్ అయింది అని చెప్పారు. హరి గారు నడుపుతున్న చిన్నారి హాస్పిటల్ చాలా చిన్నది. 6 పడకలు మాత్రమే ఉన్నాయి. వారి గొప్ప మనసుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
హరి చాలా సరదాగా, ఫ్రాంక్ గా ఉంటారు. అలాగే సేవా తత్పరత ఎక్కువ. అడ్వాన్సు, ఫీజులతో సంబంధం లేకుండా ఆపరేషన్ చేస్తుంటానని, హాస్పిటల్ నిర్వహణ ఖర్చు వస్తే చాలు అనుకుంటూ ఉంటానని అన్నారు. ఈ తరం శిశువుల్లో జన్యుపరమైన లోపాలు ఎక్కువగా ఉన్నాయని. ఈ ఆపరేషన్లను తక్కువ ఖర్చుతో పేదలకు అందించేలా ఒక ట్రస్టు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలిపారు.
బెడ్డు ఖాళీగా ఉందంటే పడిశం పట్టిన పిల్లలకు న్యుమోనియా అని బెదరగొట్టి వారం రోజులు అడ్మిట్ చేసుకుని డబ్బులు దండుకునే డాక్టర్లు అనంతపురంలో ఉన్నారు. కొత్త పేషెంట్ వచ్చే వరకూ వీరిని డిశ్చార్జ్ చేయరు. ఈ డాక్టర్లతో డిశ్చార్జ్ చేయించుకోవాలంటే మర్డర్ కేసులో బెయిల్ తెచ్చుకోవాలన్నంత కష్టం. ఇక పిల్లలు పుట్టగానే జాండిస్ పేరు చెప్పి పిల్లల్ని దాదాపుగా ఎత్తుకుపోయి ( మెటర్నిటీ హాస్పిటల్ నుంచి ) తమ ఆస్పత్రుల్లో చేర్చుకునే పిల్లల డాక్టర్లు ఉన్నారు.
వీరి మధ్య మంచి డాక్టర్లు, గొప్ప డాక్టర్లు కూడా ఉన్నారు. గొప్ప డాక్టర్లలో  ఒకరుగా హరి గొప్ప స్థానానికి చేరుకోవాలని కోరుకుంటున్నాము.
తాను ఇంగ్లీష్ నేర్చుకోవడంలో పడ్డ ఇబ్బందిని గుర్తు చేసుకుని తన మండలంలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు 1000 గ్రామర్ పుస్తకాలు ఉచితంగా సరఫరా చేసారు.  


ఇక్కడ ముందు కూచున్న అమ్మాయి ప్రత్యూష ( తెల్ల డ్రస్ )


 డాక్టర్ హరి ప్రసాద్ 

నిన్న ఆపరేషన్ విషయం తెలవగానే తాము సహాయం చేయాలా అని ముందుకు వచ్చిన అట్లూరి భవాని చారిటబుల్ ట్రస్ట్, గుడివాడ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.




 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo