మిత్రులారా గతకొద్ది రోజులుగా ఇంటర్నెట్ కట్ అవడంతో పోస్ట్ అప్డేట్ చేయడం కుదరలేదు. అన్నీ ఒకేసారి అప్డేట్ చేయాల్సి వస్తోంది. పుట్టినరోజు జరుపుకున్న వారందరూ అమ్మాయిలు కావడం విశేషం. సకాలంలో పోస్ట్ చేయనందుకు అందరికీ సారీ అమ్మలూ.అనంతపురంలోని PRK కళాశాల కరస్పాండెంట్ పవన్ కుమార్ గారి కుమార్తె దుర్గా శరణ్యు  బర్త్ డే సందర్భంగా వారు జీవని పిల్లలందరికీ స్వెటర్లు, మంకీ క్యాప్స్ స్పాన్సర్ చేసారు.


( గత సంవత్సరం ఫోటో )అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న భానుకిరణ్ మరియు శ్రీమతి. క్రిష్ణ సౌజన్య గార్ల కుమార్తె స్కంద ష్రిక జన్మదినం సందర్భంగా పిల్లలకు స్వీట్లు, గిఫ్ట్ బాక్సులు ఇచ్చారు . శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో MBA విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైరైన రాంప్రసాద్ మరియు శ్రీమతి జ్యోతి గార్ల మనవరాలు స్కంద.
ఙ్ఞాన సహస్ర పుట్టినరోజు. తాడిపత్రిలోని నందలపాడు వాస్తవ్యులు ప్రవీణ్ రెడ్డి మరియు శ్రీమతి.నాగేశ్వరి గార్ల కుమార్తె సహస్ర.  వారు 3000/- స్పెషల్ మీల్స్ కోసం విరాళంగా ఇచ్చారు. రమేష్ యాదవ్ మరియు శ్రీమతి యమునా రాణి గార్ల కుమార్తె కార్తికా రమేష్ జన్మదినం సందర్భంగా స్పెషల్ మీల్స్ కోసం 3000/- విరాళం అందజేశారు 
పీలేరులో ఉంటున్న సిబ్బల షారిఖ 7వ పుట్టినరోజు జరుపుకొంది. షారిఖ నాన్న మహేష్ గారు జీవనికి 7000/- విరాళం అందించారు.
వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  


on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers