మిత్రులారా ఈ విద్యా సంవత్సరానికి గాను కొత్తగా మరికొంత మంది పిల్లలకు జీవని ఆశ్రయం ఇవ్వనుంది. నిన్న పత్రికా ప్రకటన ఇచ్చాము, మంచి స్పందన లభించింది. దరఖాస్తులు రాగానే మేము క్షేత్ర స్థాయిలో పిల్లల కుటుంబాలను పరిశీలిస్తాము. ఆ తర్వాత అర్హులైన వారిని ఎంపిక చేయాలి అనుకుంటున్నాము.

పిల్లల్ని చేర్చుకోవడానికి అర్హతలు: తల్లిదండ్రులు లేని వారు, 5-8 సంవత్సరాల లోపు వయసు ఉండాలి, కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదు.on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. మీ జీవని విద్యాలయాన్ని నేను ఒక సారి సందర్శిస్తాను

   
 2. jeevani Says:
 3. శ్రీనివాస్ గారూ,

  ధన్యవాదాలు.జీవని విద్యాలయం ఇంకా నిర్మాణం కాలేదు. ఈ ఏడాది నిర్మాణం మరియు వచ్చే సంవత్సరం బడి ప్రారంభం అవుతుంది.
  ప్రస్తుతం పిల్లలు హాస్టల్ వసతి ఉన్న ప్రైవేటు స్కూల్లో చదువుతున్నారు.
  జీవని విద్యాలయం ప్రారంభానికి మన బ్లాగర్లను వీలైనంత మందిని కలపాలన్న ఆలోచన కూడా ఉంది.
  మరోసారి ధన్యవాదాలతో,

  మీ,
  జీవని.

   
 4. Anonymous Says:
 5. మెదక్ ప్రాతంలో ఆత్మ హత్యలు చేసుకున్న ఎంతోమంది రైతుల బిడ్డలు అనాధలుగా ఉన్నారు మీరు ఆ ప్రాంతంలో జీవని గురించి తెలియజేయండి.
  నిన్న జై కిసాన్ లో ఓ వార్త చూసాను. బోరుబావులు తవ్వి నీరులేక ఆ అప్పులు తీర్చలేక అక్కడి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి అతడి భార్య కూడా చేసుకుంది. దాంతో ఆ రైతు తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడట. చివరికి ఆ కుటుంబంలో ముసలమ్మ మాత్రం మిగిలింది నలుగురు పిల్లలు వాళ్ళ పెంపకం భారం ఆమెపై పడింది. ఆ పిల్లల కళ్ళల్లో దిగులు భయం, కన్నీళ్ళు...

   

Blog Archive

Followers