కర్నూలు ప్రజలను వరదలు ముంచెత్తి ఒక సంవత్సరం గడచిపోయింది. వరద బాధితులకు సహాయం అందించడంలో జీవని తన వంతు కృషి చేసింది. ఒకసారి ఆ కార్యక్రమాన్ని నెమరువేసుకుందామని ఈ టపా పెడుతున్నాము...నిజానికి ఈ కార్యక్రమంపై స్పష్టత లేని సమయంలో మమ్మల్ని ప్రోత్సహించి ముందడుగు వేయించింది మలక్పేట్ రౌడీ భరద్వాజ్ గారు.మొదటి రోజు 2000 మందికి పులిహోర సిద్ధం చేయించాము. పొద్దున్నే ఆహారంతో లారీ కర్నూలు బయలుదేరింది. అప్పటికి కర్నూలు కొంచెం కూడా తేరుకోలేదు. మన వాళ్ళు పాత...