మిత్రులారా జీవని విద్యాలయానికి స్థలం కొనుగోలు చేసిన విషయం మీఅందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించి స్థలం యజమానులకు 1 లక్షఅడ్వాన్సు ఇచ్చాము. రేపు మరో 3 లక్షలు ఇవ్వబోతున్నాము. ఇక చేయాల్సిన పనుల జాబితా ఇలా ఉంది.సైట్ క్లీన్ చేయించడం - 2 రోజుల్లోపు సర్వే - ఈ వారం రిజిస్ట్రేషన్ - మే మొదటి వారం ప్లాన్ వేయించడం - మే మొదటి వారం జీవని సభ్యుల సమావేశం - మే రెండో వారంశంఖుస్థాపన, బోరు వేయించడం, కాంపౌండ్ వాల్ - మే నెల మొక్కలు నాటడం, నిర్మాణ కార్యక్రమం - జూన్, జులై ఈ టైం ఫ్రేం పెట్టుకుని పని చేయాలని అనుకున్నాము. ధన్యవాదాలతో,మీ,జీవని.APRIL 2011...
మిత్రులారా ఎన్నో నెలల తరబడి స్థలం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 2 ఎకరాల స్థలాన్ని జీవని విద్యాలయం కోసం కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజు అగ్రిమెంట్ అయింది. వచ్చే వారంలో రిజిస్ట్రేషన్ జరగనుంది. ఎకరం 3.5 లక్షలు. అనంతపురం నుంచి తాడిపత్రి వెళ్ళేటపుడు రోటరీపురం అనే గ్రామం వస్తుంది. ఇది అనంతపురానికి 15 కిలోమీటర్ల దూరం. ప్రధాన రహదారికి మన స్థలం 150 మీటర్ల దూరంలో ఉంది. ఇక జీవనికి అనుక్షణం తోడు అందిస్తున్న శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజి మన స్థలానికి కేవలం అర కిలోమీటరు.2 సంవత్సరాల కాలంలో జీవని సాధించిన ఈ ప్రగతికి తోడ్పడిన మహానుభావులకు,...
మిత్రులారా ఇంతకు ముందు చెప్పినట్లు సేవ చేయాలనే సత్సంకల్పం ఉన్న మంచి మనుషుల వేదిక జీవని. ఇది అందరిదీ. అందుకే ఎక్కడా ఇంతవరకూ కార్యవర్గ సభ్యులు లేదా పని చేస్తున్నవారి వివరాలు పెట్టలేదు. జీవని ఎప్పటికీ వ్యక్తులకు ఫోకస్ ఇవ్వదు. ఇది సమష్టి కృషి. పేర్లు రాయవలసి వస్తే ఒక్కసారి మాత్రమే 100 రూపాయలు ఇచ్చినవారి నుంచి భేష్ మంచి పని చేస్తున్నారు అని వెన్ను తట్టి ప్రోత్సహించిన వారి వరకు అందరివీ ఉండాలి. కొంతమంది మెయిల్లో అడిగినపుడు మాత్రం వివరాలు అందించాము. ఈ వివరాలను దాతలు సాధారణంగా ఎలాంటి వ్యక్తులు సంస్థను నడుపుతున్నారు అని తెలుసుకోడానికి...
బ్లాగర్లకు, జీవని సభ్యులకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈపండుగ రోజు విరిసిన ఆనందాలు కలకాలం మీ ఇంట నిలిచిపోవాలని. మీకు,మీ కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలనికోరుకుంటూ....మీ అందరి ఆశీస్సులతో బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్న,మీ,జీవని పిల్లలు. APRIL 2011 DAILY BALANCE SHEETBalance as on 31-3-11 21,350/-01- 4-11 - expenditure office Asst. salary 1000/- 20,350/-02- 4-11 - 300/- UMADEVI, KRISHNA MURTHY, SUGUNA 20,650/-03- 4-11 - 500/- HARSHITA 21,150/-04- 4-11 -05- 4-11 -06- 4-11 -07- 4-11 -08- 4-11 -09-...