మిత్రులారా నిన్న పిల్లల్ని బడిలో చేర్పించాము. జీవని హాస్టల్కు 6 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త స్కూల్ ఉంది. ప్రస్తుతానికి 15 రోజులు వారి హాస్టల్ కూడా అక్కడే. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలకు బాగా నచ్చింది. అయితే నిన్నటికి పిల్లలు అందరూ రాలేకపోయారు. ఇంకా సగం మంది రావాల్సి ఉంది.
ఈ నెలాఖరుకల్లా జీవని హాస్టల్ నిర్మాణం పూర్తి కానుంది. అప్పుడు పిల్లల్ని అక్కడికి షిఫ్ట్ చేయనున్నాము.
హాస్టల్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడినదే. అయినప్పటికీ పిల్లలకు ప్రేమపూరిత వాతావరణం అందించాలన్నా వారికి మంచి విద్య నేర్పించాలన్నా సొంత హాస్టల్ తప్పనిసరి. అందుకే మొండి ధైర్యంతో ముందడుగు వేశాము. జీవని అభివృద్ధిలో బ్లాగర్ల పాత్ర ఎంతో ఉంది. మీ అందరి సహాయ సహకారాలతో పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడానికి మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తాము.

జీవని హాస్టల్ నిర్వహణ వ్యయం అంచనా....
ఫుడ్ - 40,000 - 50,000
జీతభత్యాలు 15,000/-
స్కూల్ ఫీజు - 30,000/-
ఇతరాలు - 10,000/-
దాదాపు లక్ష వరకూ ఉంటోంది. ఒక నెల గడిస్తే కచ్చితమైన ఫిగర్ తెలుస్తుంది.  

మనకు వస్తున్న విరాళాలు
SRIT స్టాఫ్ - 10,000/-
నెలవారీ విరాళాలు - 20,000/-
వార్షిక విరాళాలు + వ్యక్తిగత స్పాన్సర్ షిప్ + ఇతరాలు - 20,000/-
ఇవి కాక ఇంకా 50,000/- అవసరం అవుతున్నాయి.

ఈ విషయాన్ని కొంతమంది మిత్రులతో చర్చించినపుడు తాము మరింత విరాళం ఇస్తామని అధైర్యపడవద్దని చెప్పారు. అయితే వారి విశాలహృదయానికి ధన్యవాదాలు చెబ్తూనే అది సరైన పద్ధతి కాదని వారికి విన్నవించాము. విరాళం, సేవ చాలా తేలికగా ఉండాలి. దాతలకు ఇబ్బంది కలిగించకూడదు. బరువు కాకూడదు. దాతలను మొహమాటపెట్టి  విరాళాలు స్వీకరించడం జీవని సిద్ధాంతాలకు విరుద్ధం. సేవ, సహాయం ఒక నిరంతర ప్రక్రియ కావాలి. అది అతి చిన్న మొత్తమైనా చాలు. ఆ మొత్తం జీవనికి రావాలని కూడా ఎప్పుడూ భావించము. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరికి జీతంలో 1% డబ్బు జీవితంలో 1% సమయాన్ని సేవకు కేటాయించాలని మనవిచేస్తూ వస్తున్నాము.
 

అందుకే ఇప్పటికే జీవనిని ఆదరిస్తున్న దాతలకు సవినయంగా కోరేది ఒకటే... మీరు మరింత భారం మోయవద్దు. మరికొంత మందికి జీవనిని పరిచయం చేయండి. ఒక్కసారి, ఒకే ఒక్కసారి జీవని అనే ఒక సంస్థ పారదర్శకతతో, చిత్తశుద్ధితో పనిచేస్తోందని వారికి చెప్పండి. విరాళం ఇవ్వాలని ఉన్నా అవి ఎక్కడ దుర్వినియోగం అవుతాయో అని భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వారికి జీవనిని చూపండి. బ్లాగు లింక్ ఇవ్వండి. మీరు ఎంతో మేలు చేసినవారు అవుతారు. 

50,000/- పెద్ద మొత్తమే అయినా  500 మంది చేయి వేస్తే 100/- చాలు. నెలకు 100/- విరాళంతో తల్లిదండ్రులను కోల్పోయిన 50 మంది చిన్నారులు ఇతర పిల్లల్లాగే ఉన్నత జీవన ప్రమాణాలతో మంచి భవిష్యత్తుకోసం అడుగులు వేస్తారు.
 
ధన్యవాదాలతో,
జీవని.

contact details : 94405 47123, jeevani.sv@gmail.com

account details:
SBI : JEEVANI VOLUNTARY ORGANISATION, CURRENT ACCOUNT 30957763358 
TREASURY BRANCH, ANANTAPUR, IFSC CODE : SBIN0012831

ICICI : JEEVANI VOLUNTARY ORGANISATION, CURRENT ACCOUNT 043905000999 ANANTAPUR IFSC CODE: ICIC0000439

ANDHRA BANK : JEEVANI VOLUNTARY ORGANISATION, S.B. ACCOUNT 038510100023594, 0385 NEW TOWN ANANTAPUR COURT ROAD. IFSCCODE: ANDB0000385

మీరు NRI  అయితే  ఓక విన్నపం. ఇండియాలో ఉన్న అకౌంటు నుంచి మాత్రమే మీరు విరాళం పంపండి. విదేశి అకౌంట్ల నుంచి నేరుగా విరాళం తీసుకునే సౌలభ్యం జివనికి ఇంకా లేదు. 
ఒకవేళ మీకు ఇండియన్ అకౌంటు లేకపోతె మీ మిత్రులకు పంపి అటునుంచి జివనికి అందచేయవచ్చు.
on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. Anonymous Says:
 2. Why don't you create Facebook account / group for regular jeevani activities or share your blog URL in FB.

  I hope many people will try to help.

   
 3. jeevani Says:
 4. @anon
  మీ స్పందనకు ధన్యవాదాలు. FB లో జీవని అకౌంటు ఉంది. అయితే FB వాడటం గజిబిజిగా అనిపించి మానేశాము.
  మీ సూచనలు పాటిస్తాము. thank you

   
 5. కొత్త స్కూల్ బాగుంది ప్రసాద్ గారూ...
  పిల్లల్ని చూసి చాలా కాలం అయిపోయినట్టూ ఉందీ.

  పైన అనానిమస్ గారు చెప్పినట్టూ ఫేస్బుక్ లో కూడా పెడదాం అండీ. కొత్త వాళ్లకి షేర్ చెయ్యడానికి అవకాశం ఎక్కువ ఉంది.
  అంతా శుభం కలుగు గాక

   

Blog Archive

Followers