మిత్రులారా 2009లో ప్రారంభమైన జీవని మీ అందరి కళ్ళముందూ ఎదుగుతోంది. ఇంతవరకూ మనం 24 మంది చిన్నారులకు నీడను ఇస్తున్నాము. వచ్చే విద్యా సంవత్సరానికి మరో 26 మందిని చేర్చుకోవాలని జీవని కార్యవర్గం నిర్ణయించింది. ఇప్పటివరకూ నగరంలోని సన్ షైన్ పాఠశాలలో పిల్లలు చదివారు. అక్కడే హాస్టల్లో ఉండేవారు.
ఇప్పుడు జూన్ లో జీవని హాస్టల్ ప్రారంభం అవుతుంది. పిల్లలందర్నీ రోటరీపురం దగ్గర ఉన్న పాఠశాలలో చేర్చనున్నాము. జీవని విద్యాలయం నిర్మాణం మరోవైపు సాగుతుంటుంది.
మీకు తెలిసి, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటె దయచేసి మాకు తెలియజేయండి....
Read More
అనంతపురంలో ఉన్న అతికొద్ది మంది క్లాస్ 1 కాంట్రాక్టర్లలో ఒకరు దేశాయి మదనమోహన రెడ్డి గారు. వారికి కంకర ఫ్యాక్టరీ ఉంది. విరాళం కోసం ఆయన్ను కలిసినపుడు తమ వంతు 50 వేలు ఇస్తామని అది డబ్బు లేదా మెటల్ ఏ రూపంలో అయినా తీసుకోండి అని హామీ ఇచ్చారు. మనము కంకర కావాలని అడిగాము. 50 వేల రూపాయల విలువ చేసే కంకర జీవని సైట్కు పంపారు. ప్రస్తుతం మొదటి ఫ్లోర్ స్లాబ్ వేయాల్సి ఉంది. ఇందుకు దీన్ని ఉపయోగించనున్నాము. మదనమోహన్ గారికి జీవని కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
...
అనంతపురానికి చెందిన ఎన్.వి.శ్రీనివాస రెడ్డి గారు బెంగళూరులో బ్రాడ్ కాం అనే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. వారు 50,000/- విరాళం అందించారు. వారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరం రామకృష్ణ మిషన్ కు లక్షన్నర విరాళం ఇస్తుంటారు . ఇక నుంచి జీవనికి కూడా తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు.
...
బ్లాగుల్లో మరీ పాపులర్ కాదుగాని, బజ్జు ప్లస్ లో అందరికి పరిచితులైన వ్యక్తి జీవనికి విరాళం అందించారు.
గూడచారిలా రహస్యంగా విరాళం అందించిన ఆయనకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము :)
...
తాడిపత్రికి చెందిన నారాయణ రెడ్డి గారు తమ ధర్మపత్ని స్మృత్యర్థం విరాళం అందించారు. శైలజ గారు చాల సంవత్సరాల నుంచి కేన్సర్ తో పోరాడి చివరకు ఓడిపోయారు. కిందటి నెల పరమపదించారు.
తాడిపత్రిలో అన్ని ప్రభుత్వ బడులకు మధ్యాహ్న భోజనం ఒకేచోట తయారవుతుంది. దాని నిర్వహణ శైలజ గారు చూసుకునేవారు. రోజు అన్నం పప్పు / సాంబారు/ రసంతో పాటు పెరుగన్నం ఇచ్చేవారు. అరటిపండు గుడ్డు వారంలో రెండుసార్లు, ఒకసారి స్వీటు ఇచ్చేవారు. ఇంత క్వాలిటీ ఇస్తూ కూడా సంవత్సరమంతా మిగిలిన డబ్బుతో జూన్లో పిల్లలకు పలకలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు కొని...