నిన్న రాత్రి సుప్రజ అనే అమ్మాయి చెవిలో పేడ పురుగు దూరింది. ఇలా జరగడం ఇది మూడోసారి. గతంలో మనీషాకు, నాకూ చెవిలో పురుగులు దూరాయి. అయితే ఈ టపా ముఖ్య ఉద్దేశం, వాటిని బయటకు రప్పించే టెక్నిక్ మీకూ తెలియజేయాలని. బహుశా చాలా మందికి తెలిసుండొచ్చు, తెలియనివారికి ఇది. గదిలో లైట్లు ఆపేసి టార్చిని చెవిలోకి ఫోకస్ చేయాలి. ఆ వెలుగును వెతుక్కుంటూ పురుగులు క్షణాల్లో బయటకు వస్తాయి. ఇక మేము ఊరి బయట, పల్లెలో ఉండటం వల్ల కీటకాలు కాస్త ఎక్కువే. కిటికీలకు నెట్స్ ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని లోపల తిరుగుతూనే ఉంటాయి.
డైలీ బ్యాలెన్స్...
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ అనంతపురం జిల్లాలో వాన జాడే లేదు. భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రస్తుతం జీవనిలో కూడా నీటికి చాలా ఇబ్బంది పడుతున్నాము. కిందటి యేడాది ఇదే నెలలో 4 ఇంచుల నీరు వచ్చేది. ఇప్పుడు ఆగి ఆగి వస్తున్నాయి. తాజాగా ఒక కొత్త బోరు వేయించినా ఫలితం లేకపోయింది. ఇక వర్షం కరుణించాల్సిందే....
డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.ph...
అట్లాంటాలో ఉంటున్న చిరంజీవి గారు తమ కుమారుడు సమృధ్ పేరు మీద జీవనికి విరాళం అందించారు. వారికి జీవనిని పరిచయం చేసిన వారి సోదరుడు కళ్యాణ్ చక్రవర్తి ( సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, కళ్యాణదుర్గం ) గారికి, చిరంజీవి గారి కుటుంబ సభ్యులకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.ph...
ఆటల్లో మునిగిపొయి....
బాధ్యత నిర్వర్తిస్తూ...
serious civil engineering .... gated community complex ... a joint venture of 15 kids ...
డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.php
...
california లోఉంటున్న శ్రీక్రిష్ణ శ్రీనివాస్ గారు, తమ జీవితభాగస్వామి స్వాతి గారి పుట్టినరోజు సందర్భంగా జీవనికి 10,000/- విరాళం అందించారు. వీరికి జీవని పిల్లల తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము.
డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...
http://www.jeevanianantapur.com/dailybalance.ph...
జె.లక్ష్మి రెడ్డి గారు ఢిల్లీలో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. వారి స్వస్థలం జమ్మలమడుగు అయినప్పటికీ గత 50 సంవత్సరాలుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. 27.5.13న వారి కుమారుడు మధుసూధన్ రెడ్డిగారి వివాహం జరిగింది. ఈ సందర్భంగా 25,000/- విరాళం అందించారు. లక్ష్మిరెడ్డి గారి కుటుంబానికి జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నవదంపతులకు శుభాకాంక్షలు.
డైలీ బ్యాలెన్స్ షీటు వెబ్సైట్ లో చూడవచ్చు...http://www.jeevanianantapur.com/dailybalance.php
SCHOOL FEES PAID
June 2013 - 30,000/-
July 2013-- ...
కొన్ని రోజుల కిందట బర్మింగ్ హాం, అలబామా నుంచి ఒక దాత జీవనికి చెక్ పంపారు. వారి పోస్టల్ అడ్రస్ ఉంది కానీ మెయిల్ ఐడి లేదు. అందుకే ఇలా టపా పెడుతున్నాము. సర్ మీరు పంపిన చెక్ బ్యాంకులో వేద్దామని వెళ్ళాము. ఇది క్యాష్ చేయాలంటే చాలా మొత్తం కమీషన్ రూపంలో పోతుంది. అలాగే క్యాష్ కావడానికి 50 - 60 రోజులు పడుతుందని మేనేజర్ చెప్పారు. మీరు దయచేసి ఆన్ లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే మాకు సహాయం చేసిన వారు అవుతారు. ఒక్కసారి jeevani.sv@gmail.com కు మెయిల్ చేయండి పూర్తి వివరాలు అందజేస్తాము. మీకు చెక్ క్యాన్సిల్ చేసి స్కాన్ కాపీ పంపుతాము.మీ విరాళానికి...
మిత్రులారా బృందావనం సహకారంతో జీవనిలో ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే వారు ప్రకృతి వ్యవసాయం కేంద్రబిందువుగా దీన్ని ప్రారంభించారు. కానీ ఇప్పుడు మేము విపరీతమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాము, వ్యవసాయానికి స్థలం కూడా తగ్గుతోంది. శాశ్వత బిల్డింగులు కట్టేందుకు తగినన్ని నిధులు సమకూరలేదు. ఇది రెండు అంతస్థులతో నిర్మించాలి అనుకున్నాము. ప్రస్తుతం తాత్కాలిక షెడ్లు వేస్తున్నాము. ఇది స్థలాభానికి కారణమైంది. ప్రధాన ఆశయాలు నెరవేరే అవకాశాలు కనిపించకపోవడంతో ప్రస్తుతానికి నిలిపివేసాము. ఇంతవరకు బృందావనం జీవని కోసం పెట్టిన ఖర్చు...