జీవనికి తెలుగు బ్లాగర్లతో ఉన్న అనుబంధం గురించి మీ అందరికీ తెలుసు. రేపటికి హృదయ స్పందన కార్యక్రమం జరిగి నెల అవుతుంది. టికెట్ అమ్మకం డబ్బులు పూర్తిగా చేతికి అందలేదు అందుకే జమాఖర్చులు కాస్త లేటుగా తెలియజేస్తున్నాము.ఇక హృదయ స్పందన కార్యక్రమం క్రెడిట్ ఒంగోలు శీను గారిదే. కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి రాజ్, కార్తీక్, సురేష్, కుమార్ గార్లు అందరం తరచుగా చర్చించుకుంటూ ప్లాన్ చేసాము.శీనుగారికి సేవా రంగంలో పండిపోయిన తల ఇక్కడ జీవనికి బాగా ఉపకరిస్తోంది....

జీవని గురించి ఈనాడు ఆదివారంలో కథనం వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసి ఉంటుంది. అందులో నా నెంబర్ ఇవ్వడంతో ఆదివారం నుంచి ఇప్పటివరకూ కాల్స్ వస్తూనే ఉన్నాయి.మేము మంచి పని చేస్తున్నాం అని అభినందించారు కొందరు సంబరపడ్డారు మరి కొందరు విరాళం అందించారు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లలు లేరు దత్తత ఇస్తారా అని, ఉద్యోగం ఇస్తారా అని చాలామంది అడిగారు.ఒకాయన తాను త్వరలో అనాధాశ్రమం, వృధాశ్రమం, గోశాల పెడతాను అన్నారు. తర్వాత మీ ప్రాంతం వాళ్ళు కన్నింగ్...

మహేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటూ, శివరాత్రి శుభాకాంక్షలతో...జీవని కుటుంబం ...
జీవని అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన, పోషిస్తున్న ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జీవని సేవా కార్యక్రమాలను ఆయన ఎక్కడా ఎప్పుడూ తన వ్యక్తిగత అవసరం కోసం వాడుకోలేదు. జీవని ద్వారా ఏ ఒక్క వ్యక్తీ పేరు ప్రఖ్యాతులు పొందరాదు అన్న ఆశయాన్ని ఆయన నిలబెట్టారు. జీవని సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరి వేదిక. ఇది అందరిదీ, ఈ భావనకు తోడ్పడుతున్న జీవని ప్రధాన బాధ్యులు అందరికీ వేనవేల నమస్కారాలు.
...