Give blood. Give Life.
దురద్రుష్టకరమైన విషయం ఏమంటే చాలా మంది విద్యాధికులకు కూడా రక్తదానంపై అపోహలు ఉండటం, ఇవ్వడానికి భయపడటం జరుగుతోంది. రక్తదానం వల్ల బలహీనపడతామని, మగసిరి, వీర్య ఉత్పత్తి తగ్గుతుందని భావించిన వారిని కూడా నేను చూశాను. మన శరీరంలోని మొత్తం రక్తంలో పావు లీటరు మాత్రమే రక్తం ఇస్తామని చెప్పాను. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎర్రరక్తకణాలు నిత్యం చావడం పుట్టడం జరుగుతూనే ఉంటాయని వివరించాను. సూది గుచ్చినప్పుడు ఒక పెద్ద గండు చీమ కుట్టినంత నొప్పి మాత్రమే ఉంటుందని తెలుసుకోవాలి.
ముందుగా మనం రక్తదానం చేశామా? ఆ తర్వాత మనం ఎంత మందిని చైతన్యపరిచాం అని ప్రశ్నించుకోవాలి.
పుట్టిన రోజులు లేదా మనకి సంబంధించిన రోజులలో ఒక పైసా ఖర్చు లేకుండా చేయగలిగే అతి గొప్ప దానం రక్తదానం.
నేను ఇచ్చిన రక్తంతోనే ఒక ప్రాణం నిలబడిందన్న అలోచన నిజానికి దేనికీ సరితూగదు. కావాలంటే మీరూ ఆ అనుభవాన్ని ఆస్వాదించండి ( ఇంతవరకు రక్త దానం చేయని వారికి మాత్రమే!)
అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...
Join hands with...
JEEVANI
JEEVANI
......FOR UNCARED
మంచిపని చేసారు. నేను కూడా వీలు దొరికినప్పుడల్లా ఇస్తుంటాను.నా గ్రూపు o positive అమర్ నాథ రెడ్డి గారి చిరునామా తెలుపగలరు. మాది తాడిపత్రే కాబట్టి
అవసరమొచ్చినప్పుడు ఇవ్వగలను