లావణ్య, ఇంద్రజ ఇద్దరూ అక్కాచెల్లెల్లు. 1,4 తరగతులు. వీళ్ళ తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోయారు. అనంతపురం సమీపం లోని కురుగుంట గ్రామం వీరిది. అవ్వాతాతలు పండుటాకులు. వ్యవసాయ ఆధారిత కుటుంబం. అనంతపురంలో వ్యవసాయం అంటేనే జూదం లాంటింది. ఈ పిల్లలు మరి కనీస ప్రమాణాలతో జీవిస్తారన్న ఆశ కూడా లేదు. వీళ్ళే కాదు మనం తీసుకోబోయే అందరు పిల్లల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంటుంది. వీరిద్దరిని నిన్నటి రోజు సన్ షైన్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చడం జరిగింది. ఈ పాఠశాల అనంతపురం నగరంలో ఎస్.బి.ఐ కాలనీలో ఉంది. ఫీజు ఒక్కొక్కరికి 12000/- అడ్వాన్సు కింద 10000/- చెల్లించాము. ఇంక మన వద్ద మిగిలిన మొత్తం 15300/-


అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED

on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. kani 1,4 class ki antha karchu avasarama nenu maa pillalaki kuda antha karchu pettanu

   
 2. Anonymous Says:
 3. క్షమించండి ఒకటి నాలుగు తరగతుల కు ౩౦ వేల రూపాయిలు వెచ్చిస్తున్నారా ,ఆగండి ఆగండి మీరు జ్యోతి గారి పోస్ట్ చదివి ఇది రాసి వుండాల్సింది
  http://jyothivalaboju.blogspot.com/
  మీరు చేస్తున్నది మంచి పని అభినందనీయం ఒక ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తే ఐ ఐ టి సీట్ వస్తుంది అని చెప్పలేము కదా

   
 4. మీరు చేస్తున్నది మంచి పని అయినప్పటికీ పైన ఇద్దరు చెప్పినట్లుగా 1,4 తరగతుల పిల్లల కోసం అంత ఖర్చు పెట్టడం అనవసరం.

  ఎంత పెద్ద పాఠశాల అయినా 1 వ తరగతి పిల్లాడికి నేర్పేది అ, ఆ లు మాత్రమే. ఇంకా ఒకటి, రెండు అని పది అంకెలు నేర్పుతారేమో బహుశా. ప్రైవేటు పాఠశాల కాబట్టి నాలుగు A,B,C,D లు నేర్పుతారేమో. అంతే కదా. దాని కోసం 12000/- వేల రూపాయలంటే వినడానికే హాస్యాస్పదంగా ఉంది నాకు.

  మీరు ఉండేది అనంతపురంలో కాబట్టి, నాకు తెలిసి అనంతపురంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన బాగానే ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజు 100/- రూపాయలు ఉంటుంది. అంటే మీరు ప్రైవేటు పాఠశాలలో వెచ్చిస్తున్న ఫీజుతో, ప్రభుత్వ పాఠశాలలో 120 మందిని చేర్చగలరు.

  కేవలం 1వ తరగతికే ఇంత ఖర్చుపెడితే, మరి భవిష్యత్తులో కాలేజీలో చేర్పించడానికి ఎంత ఖర్చు పెట్టాలో ఆలోచించండి.

  నా అభిప్రాయం ప్రకారం ఆ పిల్లలిద్దరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం ఉత్తమం.

  మీరు ఉండేది అనంతపురంలో కాబట్టి, సప్తగిరి సర్కిల్ దగ్గరలో గ్రంథాలయం ఉంటుంది. అలాగే పిల్లలిద్దరినీ "లలిత కళా పరిషత్" లో జరిగే "కళాపరిచయం" ద్వారా వారికి నాలుగు కళలలో నిష్ణాతులను చేయవచ్చు.

  ఇంకా అవసరమైతే, SBI కాలనీలోనె (సప్తగిరి సర్కిల్ నుంచి చర్చి వైపు వెళ్ళే దారిలో ఎడమ వైపుకు, SBI bank వెనకాల) SSY కేంద్రం ఉంటుంది. వారిని కలిస్తే పిల్లలకు చదువు ఎలా నేర్పించాలో చెబుతారు.

  కనీస ప్రమాణాలతో జీవించడం అంటే, ఖరీదైన స్కూల్లో చదువు చెప్పించడం కాదు. వారికి సరైన పోషకాహారం తో పాటు, నివాసానికి చక్కని ఇల్లు ఉండటం.

  కాబట్టి, ప్రైవేటు పాఠశాలలో పెట్టే అనవసరమైన ఖర్చు బదులు, పిల్లలిద్దరికీ ఆ డబ్బుతో చక్కని పౌష్టికాహారం అందించండి.

  ఒకవేళ మీకు అనంతపురంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవనిపిస్తే, మాకు తెలపండి. వీలునుబట్టి, ఆ పాఠశాలను సందర్శించి అక్కడి సౌకర్యాలు మెరుగుపర్చేటట్లు చూస్తాము.


  చివరిగా ఒకమాట: నా అభిప్రాయం తెలపాలనుకున్నాను. ఒకవేళ నా వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బందిపెడితే, క్షంతవ్యుణ్ణి.

   

Blog Archive

Followers