" sunnygadu said... ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుపగలరు November 24, 2009 11:16 AM " మిత్రులారా ల్యుకేమియాతో బాధపడుతున్న రమ గారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ట్రీట్మెంట్ దీర్ఘకాలానికి సంబంధించినది అంటే మూడు నెలల పాటు సాగుతుంది కాబట్టి ఫలితం కూడా ఆలస్యంగానే ఉంటుందని డాక్టరు చెప్పారు. సందీప్ మీ CONCERN కు ధన్యవాదాలు. ...
మిత్రులారా రక్తదానం కోసం ఒక ట్రయల్ అన్నట్లు బ్లాగులో పెట్టడం జరిగింది. అయితే ఇంత స్పందనను ఊహించలేదు. మొత్తం 8 మంది పేషెంటు తరఫు వ్యక్తిని కలిశారు. కానీ వివిధ కారణాల వల్ల అంటే అంతకు ముందే మాత్రలు వేసుకోవడం, ఆరోగ్య సమస్యలు ఉండటం తదితరాల వల్ల నలుగురి రక్తాన్ని ఆస్పత్రి వాళ్ళు వద్దన్నారట. ఆమె లుకేమియ పేషెంటు కాబట్టి ఎంటువంటి ఇంఫెక్షన్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డాక్టరు చెప్పారట. రక్తదానం చేసిన వారి వివరాలు. 1) ఎల్.లక్ష్మీనాథ్, సఫ్ట్ వేర్ ఇంజనీర్, విప్రో ( చిలమకూరు విజయమోహన్ @ లీలా మోహనం బ్లాగు గారు పంపారు ) 2) కార్తీక్...
మిత్రులారా రమ అనే పేషెంటు ప్రస్తుతం బెంగుళూరు సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నారు. చికిత్సకు 60 యూనిట్ల రక్తం అవసరం అవుతుంది. రక్తపు గ్రూపుతో సంబంధం లేదు ఏ గ్రూపు అయినా సరే. ఎవరైనా దాతలు ఉంటే 08099661612 ( ఇది ఆంధ్రా రిలయన్స్ నెంబరు, ల్యాండ్ లైన్ అనుకుని నెంబరు తప్పు అని అనుకోకండి ) , 9440601316 కు మిస్సెడ్ కాల్ ఇవ్వండి చాలు. మీ మిత్రులు ఎవరైనా బెంగుళూరులో ఉన్నా ఒక మెసేజి పంపి దాన్ని ఫార్వర్డ్ చేయించండి. మేము ఇప్పటికే చేసిన ప్రయత్నం సఫలం అయింది. కొందరు సంప్రదించారు. విషాదం ఏమంటే...

వషీదా అంటే ఏ బాలీవుడ్ హీరోయిన్నో అనుకునేరు. కాదండీ! వషీదా ఒక బొమ్మ. ఆ బొమ్మను రెండేళ్ల కిందట ఇదే రోజున కొన్నారట! ఆ కొన్న అమ్మాయి పేరు సల్మా , 5 వతరగతి. నా క్లాసులోని పిల్లలు. తమకు ఉన్నంతలో 3 రూపాయలు పెట్టి కోవా బిళ్ళలు కొని మా ముగ్గురు టీచర్లకు ఇచ్చారు. వషీదాకు ఒక లడ్డు, 2 చాక్లెట్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్ బహుమానంగా వచ్చాయి. అది పిల్లలు అందరూ సమానంగా పంచుకున్నారు. నేను సల్మాకు పెన్ను బహుమానంగా ఇచ్చాను....
బ్లాగేతర జీవని సభ్యులకు భరద్వాజ గారిని పరిచయం చేస్తున్నాము. మిత్రులారా కిందటి నెల మనం నిర్వహించిన వరద బాధితుల సహాయ కార్యక్రమం ద్వారా జీవని సంస్థ అనేది ఒకటి ఉందని ప్రజలకు తెలిసింది. ( ప్రచారానికి మనం ముందు నుంచి దూరంగా ఉన్నాం ) మనకు సేవ చేసే భాగ్యం, తృప్తి కలిగింది. ఇందుకు ఎందరో ఉదారంగా విరాళాలు పంపి మానవత్వాన్ని చాటుకున్నారు. అందరికీ మరోసారి ధన్యవాదాలు. అయితే విదేశాల్లో ఉంటున్న తెలుగు బ్లాగర్లను సంప్రదించి వారి నుంచి విరాళాలు సేకరించి కో ఆర్డినేట్ చేసే బాధ్యత తీసుకున్న వ్యక్తి భరద్వాజ గారు. భరద్వాజ గారికి జీవని పిల్లల...
మిత్రులారా SBI లో కూడా మన సంస్థ అకౌంటు ప్రారంభించాము. ICICI వారి వడ్డనలు భరించలేక, కమ్యూనికేషన్ పరంగా ఉన్న సమస్యలు మొదలైన అన్నింటి నుంచి విముక్తి లభిస్తుందని ఆశిస్తున్నాము. నెలవారీ విరాళం పంపుతున్న దాతలకు విఙ్ఞప్తి ఏమంటే మీకు ఇబ్బంది లేకపోతే ఇకనుంచి మీ విరాళాన్ని SBI A/C కి పంపండి. మీరు ఇబ్బంది అనుకుంటే ICICI తోనే కొనసాగించవచ్చు. అకౌంటు నెంబరు: 30957763358 TREASURY BRANCH, ANANTAPUR, 12831, CURRENT ACCOUNT Join hands with...JEEVANI......FOR UNCARED contact : jeevani.sv@gmail.com 94405471...
మిత్రులారా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు జరుగుతుంటాయి. వరద సహాయం కోసం డబ్బు పంపి మాకు కమ్యూనికేట్ చేయని వాళ్ళ జాబితా ఇపుడు మీ ముందు ఉంచుతున్నాము. నిన్న బ్యాంకు స్టేట్ మెంటు వచ్చినపుడు చూశాము. మేము ఇక్కడ ఒక ఇబ్బంది ఎదుర్కుంటున్నాము. ICICI బ్యాంకు వాళ్ళు మీది స్వచ్చంద సంస్థ కాబట్టి మేము పూర్తి సర్వీస్ ఇవ్వం అంటున్నారు. పాస్ బుక్ ఎలానూ ఉండదు, నెట్ బ్యాంకింగ్ లేదు, స్టేట్ మెంట్ అడిగితే దానికి వడ్డింపులు, కాబట్టి నేను వ్యక్తిగతంగా ప్రతి సారీ బ్యాంకుకు వెళ్ళి బ్యాలెన్సు వివరాలు కనుక్కోవలసి వస్తోంది. ఫోన్ చేసినా ఫోన్ బ్యాంకింగ్...
మిత్రులారా కర్నూలు వరద బాధితులకు సహాయం అందించడంలో జీవని స్వచ్చంద సంస్థ పూర్తి స్థాయిలో విజయం సాధించింది. ఐదు రోజుల పాటు బాధితుల చెంతకే వెళ్ళి మన చేతుల మీదుగా వివిధ వస్తువులు పంపిణీ చేశాము. ఇందుకు ఆర్థికంగా సహకరించిన అందరికీ జీవని తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. అమెరికా, జెర్మనీ మరియు తెలుగు మహిళా బ్లాగర్లు ఇంత స్థాయిలో సహాయం అందించకపోతే ఇంత భారీగా మన కార్యక్రమం జరిగేది కాదు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా మా ధన్యవాదాలు. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. కింది సంస్థలు, వ్యక్తులు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించారు...
BALANCE AS ON 30.09.2009 -17848DONATIONS COLLECTED IN OCTOBER - 6166-------------------------------------------TOTAL AMOUNT 24014EXPENDITURE 00000---------------------------------------------BALANCE AS ON 31.10.2009 24014--------------------------------------------- regards,JEEVANI,ANANTAPU...