మిత్రులారా రక్తదానం కోసం ఒక ట్రయల్ అన్నట్లు బ్లాగులో పెట్టడం జరిగింది. అయితే ఇంత స్పందనను ఊహించలేదు. మొత్తం 8 మంది పేషెంటు తరఫు వ్యక్తిని కలిశారు. కానీ వివిధ కారణాల వల్ల అంటే అంతకు ముందే మాత్రలు వేసుకోవడం, ఆరోగ్య సమస్యలు ఉండటం తదితరాల వల్ల నలుగురి రక్తాన్ని ఆస్పత్రి వాళ్ళు వద్దన్నారట. ఆమె లుకేమియ పేషెంటు కాబట్టి ఎంటువంటి ఇంఫెక్షన్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డాక్టరు చెప్పారట. రక్తదానం చేసిన వారి వివరాలు.


1) ఎల్.లక్ష్మీనాథ్, సఫ్ట్ వేర్ ఇంజనీర్, విప్రో ( చిలమకూరు విజయమోహన్ @ లీలా మోహనం బ్లాగు గారు పంపారు )

2) కార్తీక్ @ నా స్వగతం బ్లాగు

3) ప్రహ్లాద్

4) సందీప్అనారోగ్యం వల్ల రక్తం ఇవ్వలేకపోయినవారు.

1) దిలీప్ ( విజయ మోహన్ గారి తమ్ముడు)

మరో ముగ్గురు ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యారట వారి పేర్లను పేషెంటు తరఫు వ్యక్తి రమేష్ అడగలేదు. ఆస్పత్రిలోనూ మరోవైపు రక్తదానం కోసం వచ్చినవారిని కోఆర్డినేట్ చేయడంలో ఎవరినైనా సరిగా పలకరించకపోయినా, వారు ఇబ్బంది పడివున్నా బ్లాగ్ముఖంగా క్షమాపణలు చెప్పమని రమేష్ కోరాడు.

మిత్రులారా మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు.

ఇంకా జీవని సభ్యులకు వ్యక్తిగతంగా మెయిల్స్, సెల్ మెసేజీ ఇవ్వలేదు. ఒకేసారి అందరూ వెళ్ళినా ఆస్పత్రిలో తిరస్కరిస్తారట.

ఇక నుంచి ఒక పని చేద్దాం . ఇలాంటి సహాయ సహకారాలు ఎవరికి అవసరమైనా దయచేసి జీవనికి తెల్పండి. మన పరిధిలో ప్రయత్నం చేద్దాం. ఈ స్పందన చూశాక మాకైతే పూర్తి నమ్మకం వచ్చింది.మీ,

జీవని.

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. Nice.

     
  2. sunnygadu Says:
  3. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుపగలరు

     

Blog Archive

Followers