శ్రీనివాసుల రెడ్డి ( సబ్ రిజిస్ట్రార్, అనంతపురం రూరల్ ), నాగలక్ష్మి దంపతులు తమ కుమారుడు చి. చైతన్య పుట్టినరోజు సందర్భంగా జీవని పిల్లలకు దుస్తులు స్పాన్సర్ చేశారు. వారికి జీవని తరఫున కృతఙ్ఞతలు....
మిత్రులారా బ్లడ్ కేన్సర్ తో బాధపడుతూ బెంగుళూర్ సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ గారు డిస్చార్జ్ అయ్యారు. ఆమెకు రక్తం యూనిట్లు అవసరం అనగానే మన బ్లాగర్లు చక్కగా స్పందించారు. పది యూనిట్లు బ్లాగర్ల తరఫున వచ్చాయి. వారి సహృదయతకు మరో మారు ధన్యవాదాలు. రమ గారు కోలుకున్నారు. తిరిగి పరీక్షలు వగైరాలు మామూలే. ఆమె ఇల్లు చేరుకున్నారు.ప్ర.పీ.స.స. బ్లాగులో 10 రోజులపాటు రక్తం యూనిట్ అవసరంపై టపా పెట్టిన కార్తీక్ కు, తాడిపత్రిలో ఉన్నా వెంటనే స్పందించి రక్తదాతను పంపిన విజయమోహన్ ఇంకా సందీప్, దిలీప్ రెడ్డి తదితర మిత్రులకు రమ గారి తరఫున...
శ్రీ శివప్రసాద్, శ్రీమతి అరుణకుమారి దంపతులు తమ కుమారుడు చి. యఙ్ఞ అక్షయ్ పుట్టినరోజు సందర్భంగా జీవని పిల్లలు అందరికీ కొత్త దుస్తులు పంపిణి చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము....
ఒక వ్యక్తి దారిలో వెళ్తుంటే ఒక చిన్న పిల్లవాడు చలికి గజగజ వణుకుతూ, ఆకలికి నకనకలాడుతూ కనిపించాడు. ఆ వ్యక్తి వెంటనే దేవుడిని ప్రార్థించాడు " భగవాన్ ఏమిటీ అన్యాయం ముక్కుపచ్చలారని ఆ పసికందు ఏమి పాపం చేశాడు? వాడికి ఎందుకు అంత శిక్ష విధించావ్? వాణ్ణి కాపాడు " అని గట్టిగా ప్రార్థించాడు. చాలాసేపు చూశాడు ఎవరూ రాలేదు.దేవుడికి ఎంత నిర్దయ అనుకుంటూ ఆ వ్యక్తి ముందుకు కదలిపోయాడు. రాత్రికి అతనికి కల వచ్చింది. కలలో దేవుడు ఇలా అన్నాడు " నేను పిల్లవాడికి సహాయం చేయకపోవటం ఏంటి? నేను నిన్ను అక్కడికి అందుకే కదా పంపాను " జీవని విద్యాలయం బ్రోచర్ కోసం...
మిత్రులారా రమ అనే ఆవిడ ల్యుకేమియాతో బాధపడుతున్న విషయం ఇంతకుముందు పోస్టులో తెలిపాము. ఆమె సెయింట్జాన్స్ ఆస్పత్రి, బెంగుళూరులో చికిత్స పొందుతున్నారు. ఆమెకు రక్తం యూనిట్లు అవసరం అని చెప్పగానే బ్లాగర్ల తరఫు నుంచి 10 మంది స్పందించి రక్తదానం చేశారు. ఆమె ప్రస్తుతం బాగా కోలుకున్నారు పరిస్థితి ఇంకొంచెం మెరుగు పడితే ఓ 10 రోజులకు డిస్చార్జ్ కావచ్చని డాక్టర్లు తెలిపారు. కేన్సర్ కణాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిందని వాళ్ళు చెప్పారు. కానీ రక్తం యూనిట్లు మాత్రం ఇంకా అవసరం అవుతున్నాయి, కాబట్టి మిత్రులు ఎవరైనా వుంటే మొబిలైజ్ చేయవలసిందిగా కోరుతున్నాము....
24014 - opening balance16600 - donations received in this month--------------------------40614 - total20635 - expenditure--------------------------19979 - balance--------------------------EXPENDITURE============10000 - school fees10000 - minimum balance in SBI00225 - oil, soaps etc...00410 - medical bill ( skin problems for BHASKAR & ASHOK )అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి... Join hands with...JEEVANI......FOR UNCARED contact : jeevani.sv@gmail.com 94405471...