మిత్రులారా రమ అనే ఆవిడ ల్యుకేమియాతో బాధపడుతున్న విషయం ఇంతకుముందు పోస్టులో తెలిపాము. ఆమె సెయింట్జాన్స్ ఆస్పత్రి, బెంగుళూరులో చికిత్స పొందుతున్నారు. ఆమెకు రక్తం యూనిట్లు అవసరం అని చెప్పగానే బ్లాగర్ల తరఫు నుంచి 10 మంది స్పందించి రక్తదానం చేశారు. ఆమె ప్రస్తుతం బాగా కోలుకున్నారు పరిస్థితి ఇంకొంచెం మెరుగు పడితే ఓ 10 రోజులకు డిస్చార్జ్ కావచ్చని డాక్టర్లు తెలిపారు. కేన్సర్ కణాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిందని వాళ్ళు చెప్పారు. కానీ రక్తం యూనిట్లు మాత్రం ఇంకా అవసరం అవుతున్నాయి, కాబట్టి మిత్రులు ఎవరైనా వుంటే మొబిలైజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. రక్తదాతలు 9590840764 ( మహేష్ )ను కాంటాక్ట్ చేయవలసిందిగా మనవి.

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. రమగారు కోలుకుంటున్నందుకు చాలా సంతోషం.నేను గత శుక్రవారం తిరుమలలో రమగారి ఆరోగ్యం కుదుటపడాలని ఆమెకు అవసరమైన రక్తం సమకూరాలని ఆ భక్తవత్సలున్ని ప్రార్థిస్తూ అక్కడ అశ్విని వైద్యశాలలో రక్తదానం చేసాను.రక్తదానం చేసిన తర్వాత దర్శనంలో కూడా ఆమె ఆరోగ్యం గురించే భగవంతున్ని కోరిక కోరడం జరిగింది.సాధారణంగా నాకు స్వామివారి ముందు కోరికలు గుర్తురావు.కానీ ఈ దర్శనాన్ని మాత్రం ఆమె ఆరోగ్యం కోసమే వినియోగించుకున్నాను.రక్తదానం బెంగుళూరుకు వచ్చి చేసి ఉంటే ఇంకా బాగుండేది. నాకు వీలుపడలేదు.
    మీరు చేస్తున్న కృషి అభినందనీయం.

     
  2. jeevani Says:
  3. విజయ్ మోహన్ గారూ మీ మంచి మనసుకు ధన్యవాదాలు. ముందుసారి కూడా మీరు చక్కగా స్పందించి దిలీప్ ద్వారా రక్తదానం చేయించారు. మరోసారి కృతఙ్ఞతలు. కృషి అనడం కంటే మా బాధ్యత నెరవేరుస్తున్నాము.

     

Blog Archive

Followers