మిత్రులారా జీవని కార్యవర్గ సభ్యులు శ్రీ డేవిడ్ గారికి హైదరాబాద్ లో మంగళవారం అంటే 23వ తేదీన బైపాస్ సర్జరీ ఆపరేషన్ జరగనుంది. ఆయన రక్తం గ్రూపు A+. రక్తం ఇవ్వదల్చుకున్నవారు దయచేసి సాల్మన్ రాజు, 9951123522కు సంప్రదించగలరు. ధన్యవాదాలు. మీ జీవని...
Read More
మా మిత్రుడు ఆకెళ్ల రాఘవేంద్ర ద్వారా మొన్న తనికెళ్ళ భరణి గారిని కలిశాము. నేను, మరో అరుగురు మిత్రులు వెళ్లాము. ఆయన సింప్లిసిటీకి అందరం ఫ్లాట్ అయ్యాము. ఆయనలో కించిత్తు ఈగో కూడా కనబడలేదు. చాలా సరదాగా కలివిడిగా మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత అందరూ మొదట అన్న మాట ఇదే. దాదాపు రెండున్నర గంటల సేపు ఆయనతో గడిపాము.తన కవిత్వం చదివి వినిపించారు, అలాగే కొన్ని పాటలు పాడారు. ఆయనది మంచి గొంతు. నేటి విద్యా వ్యవస్థను భరణి గారు తీవ్రంగా విమర్శించారు. కాసింత కవిత్వం, సంగీతం ఇతర కళలు లేకుండా ఈ చదువులు ఏమిటి? కళలు మనిషిలో సృజనాత్మకతను పెంచడమేకాకుండా...
Read More
జీవని సలహా మండలి చైర్మన్ శ్రీ జగదీశ్వర రెడ్డి గారు జీవనికి 10000/- విరాళం ఇచ్చారు. దాన్ని బ్యాంకు ఖాతాలో వేయడం జరిగింది. మీ,జీవని....
Read More
మిత్రులారా మీ పరిధిలో తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే దయచేసి తెలియచేయండి. జూన్ 2010 లో 25 మంది పిల్లల్ని కొత్తగా జీవని చేర్చుకుంటోంది. పిల్లల మత ప్రాంత తదితర పట్టింపులు లేవు. దూర ప్రాంతం వారైనా ఇబ్బంది లేదు. ఈ ఒక్క సంవత్సరం మాత్రమే వాళ్ళు ప్రైవేటు బడిలో చదువుకుంటారు. 2011 జూన్ లో జీవని విద్యాలయం ప్రారంభం అవుతుంది. అప్పుడు అందరూ అక్కడికి వెళ్తారు. ముందుగా చెప్పినట్లు పిల్లలు పెద్ద అయ్యేంత వరకు వారు స్థిరపడే వరకు జీవని బాధ్యత వహిస్తుంది. అయితే కొన్ని నియమాలు.1) తల్లీ తండ్రి ఇద్దరూ లేని వారికి మొదటి ప్రాధాన్యం2) సింగిల్ పేరెంట్...
Read More
మిత్రులారా కిందటి వారంలో నా స్నేహితుడు ఆకెళ్ళ రాఘవేంద్ర అనంతపురం వచ్చారు. అతను నాకు ఈ టీవీలో మిత్రుడు. ప్రస్తుతం హైదరాబాద్ అశోక్ నగర్లో IAS స్టడీ సర్కిల్ నడుపుతున్నాడు. అది అతని ప్రధాన వృత్తి కాగా వివిధ ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో వ్యక్తిత్వ వికాసంపై సెమినార్లు ఇస్తుంటాడు. అయితే వీటి ద్వారా వచ్చిన ఆదాయంతో సేవ చేస్తున్నాడు. అంధులకు, వికలాంగులకు వ్యక్తిత్వ వికాసం, స్వయం ఉపాధిపై సీడీలు తయారుచేసి వారికి ఉచితంగా అందజేస్తున్నాడు. అలాగే...
Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo