శ్రీక్రృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పాత విద్యార్థులకు పరిచయం ఆక్కర్లేని వ్యక్తి స్వర్గీయ కామయ్య గారు. గ్రంథాలయ విభాగంలో ప్రొఫసర్‌గా పనిచేసిన కామయ్య గారు సేవాభావంలో ఎందరికో స్ఫూర్తిదాయకం. వారి వర్ధంతి నేడు, ఈ సందర్భంగా వారి కుమారులు శ్రీ రెడ్డిగిరి గారు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు.ఈరోజే స్వర్గీయ చింతా చైతన్య కిషోర్ వర్ధంతి. ఎదిగొచ్చిన కొడుకును కోల్పోయారు శ్రీ చింతా చిదానందమూర్తి గారు. కుమారుడి స్మృతిలో గతంలో ఆయన మినరల్ వాటర్ ప్లాంట్‌కు కొంతభాగం స్పాన్సర్ చేసారు. నేడు కిషోర్ వర్ధంతి సందర్భంగా 5000/- విరాళం అందించారు.
కిషోర్, కామయ్య గార్ల ఆత్మశాంతికై భగవంతుని ప్రార్థిస్తున్నాము. శ్రీ.నరసింహరాజు మరియు శ్రీమతి నీలావతి గార్ల కుమార్తె చి.అక్షర సుమ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వారు నిన్న స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. అక్షరకు పుట్టినరోజు శుభాకాంక్షలు. 


on
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers