స్పందించిన ముగ్గురికి ధన్యవాదాలు. ఫీజు హాస్టల్ తో కలిపి 12000/- ఇది ఇంకా మొదటి సంవత్సరమే కాబట్టి ఆశ్రమం దాకా మనం వెళ్ళలేదు. తర్వాతి దశల్లో ఆశ్రమం స్థాపిస్తే ఖర్చు తగ్గుతుంది. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని అయి ఉండి, ప్రైవేటు పాఠశాలలో చేర్చడానికి ముఖ్య కారణం వసతి. ప్రభుత్వ హాస్టల్లో చేర్చవచ్చు. కానీ వారిని తిరిగి దగ్గరలోని పాఠశాలకు పంపడం, వాళ్ళు తప్పిపోతే వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలో పూర్తి బాధ్యత వారి మీద ఉంటుంది. పిల్లలు పరిధిని దాటి పోయే అవకాశం ఉండదు. అంతే కానీ ప్రైవేటు బడుల వల్ల ఐ.ఐ.టి.లు, మెడిసిన్లు వస్తాయన్న ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. కానీ ఒక విషయం గమనించండి. పిల్లల ప్రస్తుత సమ్రక్షకులు మేము ఇంగ్లీష్ మీడియం చేర్పిస్తాం అంటేనే త్రుప్తి చెందారు. మా బడిలోని పిల్లలు కూడా 50 రూపాయలు ప్రైవేటు బడుల ఫీజు కట్టలేక వస్తున్నారు అంతే కానీ అందరికీ అంగ్ల మాధ్యమం పిచ్చి ముదిరింది. సాంకేతికంగా దీని గురించి మళ్ళీ చర్చిద్దాం. మీరు ఇంకా ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వండి. జీవని సంస్థకు ఆర్థికంగా కంటే మేధొపరంగా , పిల్లలకు మరింత న్యాయం చేకూరేలా చేయాలని బ్లాగు మిత్రులను సవినయంగా కోరుతున్నాను. నిజానికి ఇలాంటి సమస్యల మీద దాదాపు నెల రోజులు చర్చించడం జరిగింది. ఐతే ఇంకా ప్రాక్టికల్ గానూ, అందరి మెదళ్ళలో నలగడం వల్లను సంస్థను బాగా తీర్చిదిద్దవచ్చు.

అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI
......FOR UNCARED

on
categories: | edit post

3 వ్యాఖ్యలు

  1. Anonymous Says:
  2. next yr who will pay such a huge amount u want to spend lakhs of rupees for schooling people who are without food are lying everywhere wt abt them?

     
  3. idi ok na suggesstion entante
    ippudu supose meeru annata puram lo cherpinchaaru anukundam...max aa school nudo leka aa school pettina valla relatives evaro okaru max manalo vunda vachhu so vaallu req cheste manam fee taggincha vachhu kada......ala 2 chadive daanlo 3 chadava vachhu

    memu ok group ga form ayyi idi chesam konni rojulu......later naku kudaraledu......na own town guntur kaabatti nenu akkada evarikina ila help kavalante chestaanu alane evari own toen lo vaallu cheyandi.....ila oka group ga form ayyi cheste baaguntundi



    indulo just maata saayam tappa money kooda avsaram ledu...mee maata saayam money ni chalaa saraina paddatilo use cheyataaniki paniki vastundi....andaru aalochinchandi

     
  4. మీరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులా? అయితే మీరు పని చేస్తున్న పాఠశాల వివరాలు తెలియజేయగలరా? ఎందుకంటే, ప్రభుత్వ పాఠశాలల ప్రోత్సాహంలో భాగంగా మేము కూడా ఈ సంవత్సరమే తొలి అడుగు వేశాం. మొదటగా తిరుపతికి దగ్గరలో ఉన్న పల్లెటూరు నుంచి మొదలుపెడుతున్నాం. ఇంకా మరికొన్ని పాఠశాలలకు మా కార్యక్రమాలను విస్తరింపజేయాలనుకుంటున్నాం.

    వివరాలకు ఈ టపా చదవండి: http://nagaprasadv.blogspot.com/2009/05/blog-post_26.html

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo