ఒక వ్యక్తి దారిలో వెళ్తుంటే ఒక చిన్న పిల్లవాడు చలికి గజగజ వణుకుతూ, ఆకలికి నకనకలాడుతూ కనిపించాడు. ఆ వ్యక్తి వెంటనే దేవుడిని ప్రార్థించాడు " భగవాన్ ఏమిటీ అన్యాయం ముక్కుపచ్చలారని ఆ పసికందు ఏమి పాపం చేశాడు? వాడికి ఎందుకు అంత శిక్ష విధించావ్? వాణ్ణి కాపాడు " అని గట్టిగా ప్రార్థించాడు. చాలాసేపు చూశాడు ఎవరూ రాలేదు.దేవుడికి ఎంత నిర్దయ అనుకుంటూ ఆ వ్యక్తి ముందుకు కదలిపోయాడు. రాత్రికి అతనికి కల వచ్చింది. కలలో దేవుడు ఇలా అన్నాడు " నేను పిల్లవాడికి సహాయం చేయకపోవటం ఏంటి? నేను నిన్ను అక్కడికి అందుకే కదా పంపాను "


జీవని విద్యాలయం బ్రోచర్ కోసం మిత్రుడు నరేష్ చెప్పిన కథ ఇది. నాకు బాగా నచ్చింది. ఇది ఒరిజినల్ గా ఎవరిది, ఎక్కడిది అని తెలీదు. మూల కథ రాసినవారికి కృతఙ్ఞతలతో....

జీవని.

on
categories: | edit post

5 వ్యాఖ్యలు

  1. మనుషుల మనసులను తట్టిలేపే ఓ పెద్ద కథ. థాంక్స్.

     
  2. భగవంతుడు ఎవరో కాదు, నువ్వే భగవంతుడు, నీలోనే ఉన్నాడు భగవంతుడు అనిచెప్పడానికి ఉదాహరణగా ఈ కథను చెప్పుకోవచ్చు మనం. మనలోని దయా గుణము, ప్రేమ మొదలైన గుణాలే భగవత్ స్వరూపాలు. వాటిని పెంపొందించిన నాడు మనలోనే భగవంతుడిని దర్శించగలం.

    మంచి కథ. :)

     
  3. పరోపకారం గురించి చెప్పే కధ. దేముడు మనతోనే ఉంటాడు. మనలోనే ఉంటాడు. బాగుంది.

     
  4. cartheek Says:
  5. ప్రతిమనిషి గుర్తించాల్సిన నిజం....

     
  6. jeevani Says:
  7. కెక్యూబ్, శర్మ, శిశిర, కార్తీక్ గార్లకు ధన్యవాదాలు

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo