మిత్రులారా జీవని శంకుస్థాపన విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథి మాంచో ఫెర్రర్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సేవ చేయాలని అనుకున్నపుడు ముందూవెనుక ఆలోచించకుండా పని మొదలు పెట్టాలన్నారు. దానికి తగ్గ నిధులు అవే వస్తాయి అన్నారు. అందుకు ఉదాహరణగా అనంతపురం సమీపంలో ఆర్.డి.టి. సంస్థ ఒక ఆస్పత్రి కట్టాలని అనుకుంది. కానీ అందుకు నిధులు లేవు. వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ తేలిగ్గా తీసుకుని ముందు పని ప్రారంభించండి అని చెప్పారట. ఇప్పుడు ఆ ఆస్పత్రి ఎందరో పేదల ప్రాణాలు నిలుపుతోంది.

మాంచో గారు పక్కా అనంతపురం యాసలో తెలుగు బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ మీడియం మాయ నుంచి బయటపడాలని, తెలుగు మీడియంలో పిల్లలు బాగా ఙ్ఞానాన్ని సముపార్జిస్తారని చెప్పారు. విదేశీయుడితో శంకుస్థాపన అనగానే నెగెటివ్ భావనలో ఉన్న మన బ్లాగర్ బంతి గారు ఆ తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యారు.

విరాళాలు ఇతర హామీల గురించి ఇంకో టపాలో పెడతాము.

ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఓపిగ్గా, ఇష్టంగా వచ్చిన మన బ్లాగర్లు

ఒంగోలు శీను, కార్తీక్, రాజ్ కుమార్, బంతి, చంద్రశేఖర్ మరియు మా జిల్లా బ్లాగర్, మంచి చిత్రకారులు లీలా మోహనం విజయ మోహన్ గారు. వీరందరికీ జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

రాజ్ కుమార్, విజయ మోహన్ గార్లు ఇదే అంశంపై రాసిన పోస్టులు ఇక్కడ...

మొదటి లింకులో వీడియోలు కూడా ఉన్నాయి, గమనించగలరు.


http://rajkumarneelam2.blogspot.com/2011/06/blog-post_22.htmlon
categories: | edit post

0 వ్యాఖ్యలు

Blog Archive

Followers