మిత్రులారా వచ్చే జనవరికి జీవని ఆవిర్భవించి మూడు సంవత్సరాలు అవుతుంది. ఈ మూడేళ్ళలో సంస్థ సంతృప్తికరమైన ప్రగతినే సాధించింది. ఇప్పుడు జీవని నీడన 24 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. రాబోవు విద్యా సంవత్సరానికి 100 మందిని చేయాలన్న ఉద్దేశ్యంతో జీవని విద్యాలయం నిర్మాణం జరుగుతోంది. 


జీవని విద్యాలయం నిర్మాణం, నిర్వహణ రెండూ తలకు మించిన భారమే! ఏ మూలనో గుబులు లేకపోలేదు.   కానీ ధైర్యంతో ముందడుగు వేస్తున్నాము. విరాళాల సేకరణ ప్రారంభిస్తున్నాము. విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. 


జీవని విద్యాలయం శంకుస్థాపన రోజున మాంచో ఫెర్రర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వంతో సమానంగా / ఇంకా ఎక్కువగా సేవలు అందిస్తున్న RDT సంస్థ కి ఆయన చీఫ్. ఆయన ఒకమాట అన్నారు. కొన్ని సంవత్సరాల కిందటి జరిగిన విషయం ఇది. అనంతపురం  దగ్గర్లో బత్తలపల్లి అని ఒక ఊరుంది. అక్కడ వీళ్ళు ఒక ఆస్పత్రి నిర్మాణం చేయాల్సి ఉంది. అప్పటికి సరిపడా నిధులు లేవు. ఇదే విషయాన్ని తన తండ్రి గారైన ఫాదర్ ఫెర్రర్ (  RDT వ్యవస్థాపకులు )తో చెప్పారు మాంచొ. 
ఫాదర్ అన్నారట " మంచి పని కోసం ఎప్పుడూ ఆగకండి. డబ్బులు అవే వస్తాయి. ముందు పని మొదలు పెట్టండి " అని. ఇప్పుడు బత్తలపల్లి ఆస్పత్రి జిల్లాలోనే ప్రముఖమైంది. మందులు కూడా 70% వరకూ సబ్సిడీలో ఇస్తారు.  ఇది కూడా మాకు స్ఫూర్తిని ఇచ్చింది.


ఇప్పటి వరకూ అందిన మొత్తం విరాళాల్లో దాదాపు సగం బ్లాగర్ల నుంచి వచ్చినవే. బ్లాగర్ల మంచి మనసుకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు జీవని కార్యక్రమం గురించి మీ మిత్రులకు కూడా తెలియజేయమని ప్రార్థిస్తున్నాము.


జీవని విద్యాలయం అంచనా వ్యయంతో కూడిన ఒక మెయిల్ పంపుతున్నాము. దయచేసి దాన్ని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఎక్కడో మారుమూల లింక్ ద్వారా, ఫ్రెండ్ మెయిల్ ద్వారా తెలిసింది అని విరాళం పంపిన వారూ ఉన్నారు. మీకు జీవని కార్యకలాపాలు, పారదర్శకత పట్ల నమ్మకం ఉంటే అదే విషయాన్ని ఒక వాక్యంలో చెప్పి ఫార్వర్డ్ చేస్తే చాలా సంతోషం. 


మా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ,
జీవని. 
DAILY BALANCE SHEET - DECEMBER

BALANCE AS ON 30-11-2011 3,680/-

01-12-11 - expenditure office asst. salary 1000/- 2,680/- 
02-12-11 - UMA DEVI 100/- SUGUNA 100/- KRISHNA MURTHY 100/- 2,980/-
03-12-11 - VARA PRASAD 100/- KIRAN 200/- 3,280/-
04-12-11 - expenditure stationery+cosmetics 1700/- 1580/-
05-12-11 - 
06-12-11 - 
07-12-11 - 
08-12-11 - 
09-12-11 - 
10-12-11 - 
11-12-11 - 
12-12-11 - 
13-12-11 - 
14-12-11 - 
15-12-11 - 
16-12-11 -  
17-12-11 - 
18-12-11 - 
19-12-11 - 
20-12-11 - 
21-12-11 - 
21-12-11 - 
23-12-11 - 
24-12-11 - 
25-12-11 - 
26-12-11 - 
27-12-11 - 
28-12-11 - 
29-12-11 - 
30-12-11 - SCHOOL FEES DETAILS 
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ----- 40,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-

OCTOBER- 50,000/-

NOVEMBER 30,000/-
EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------  -------- 7,35,000
site cleaning------------------------- 54,100
ec----------------------------------   ------600
registration-------------------- -------- 8800
land survey --------------------------- 1200
demand draft for bore--------------- 2200
Bore drilling ---------------------- -----30,000
Sub mersible bore+accessories--- 36,500
Labor charges--------------------------35,100 ( mason- 26,400 + rod benders- 8,700 ) 
==============================
TOTAL-------------------------------9,03,500
==============================jeevani vidyalayam latest pic - hostel బిల్డింగ్
on
categories: | edit post

4 వ్యాఖ్యలు

 1. Anonymous Says:
 2. is the school and hostel are in the same location/campus?

   
 3. jeevani Says:
 4. అవునండీ ఒకే లొకేషన్.

   
 5. తప్పకుండానండీ...మీరింతగా చెప్పాలా!
  జీవని విద్యాలయం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. మాకా నమ్మకం ఉంది!

   
 6. jeevani Says:
 7. @ sowmya garu
  ధన్యవాదాలు

   

Blog Archive

Followers