మిత్రులారా ప్రస్తుతం పిల్లలు ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. జీవని విద్యాలయం మరియు హాస్టల్ 2012 జూన్ లో ప్రారంభం అవుతుందని ముందుగా అంచనా వెసుకున్నాము. అయితే సమయం, వనరులు కలిసిరాకపోవడం వల్ల జూన్లో కేవలం హాస్టల్ మాత్రమే మొదలవుతుంది. హాస్టల్ పూర్తవగానే చుట్టూ ప్రహరీ గోడ, తర్వాత స్కూల్ బిల్డింగ్ అనుకుంటున్నాము.
జూన్లో పిల్లలు జీవని హాస్టల్కు షిఫ్ట్ అవుతారు. అక్కడి నుంచి స్కూల్కు వెళ్ళివస్తారు.
హాస్టల్ నిర్వహణలో భాగంగా డైట్ ప్లాన్ రూపొందించాల్సి ఉంది. మేము ప్రాథమికంగా అనుకుంటున్నది కింద ఇస్తున్నాము. మీ అమూల్యమైన సలహాలతో ఇంకా మెరుగుపర్చాలని మీ ముందు పెడుతున్నాము.
ఒక సూచన: మరీ ఖర్చు కాకుండా మధ్యే మార్గంలో కడుపునిండా తినగలిగి, పోషక పదార్థాలు ఉన్నవి సూచించమని మనవి.

ఉదయం: 
పాలు

బ్రేక్ ఫాస్ట్: 
ఇడ్లీ,చట్నీ,సాంబారు
పొంగలి,చట్నీ
రాగి ముద్ద,పప్పు,
చపాతీ,కుర్మా
దోశ, చట్నీ
ఉప్మా,చట్నీ, కారం పొడి/ ఊరగాయ  
ఉగ్గాని ( మరమరాలతో చేసేది), బజ్జీ 

లంచ్: 
వాంగీబాత్ ,పెరుగన్నం +తాళింపు / చట్నీ( గోంగూర, వేరుశనగ... ) కామన్
టమోటా రైస్
బిసిబెళెబాత్
పప్పన్నం
కరివేపాకు రైస్
వెజిటబుల్ రైస్
వీటితో పాటు 4 రోజులు అరటిపండు 

ఇక్కడ అన్నీ కలర్ రైస్ వేయడానికి కారణం, పిల్లలకు మధ్యాహ్నం బాక్సులు కట్టించాలి. రసం సాంబార్ లాంటివి అయితే ప్రయాణంలో పడిపోతాయి. అందుకే మెనూ కాస్త చిక్కినట్లు ఉంది.

సాయంత్రం: 
శనగలు + కారెట్ , దోస.... సలాడ్ + పాలు కామన్
బఠాణీలు
అలసందలు
పెసలు ఇవన్ని  ఉడకబెట్టి పోపు వేయించినవి
కారం బొరుగులు ( మరమరాలు )
బిస్కెట్లు
బ్రెడ్, జాం

డిన్నర్:
అన్నం, పప్పు,సాంబారు/రసం/మసాలా కర్రీ, మజ్జిగ
2 రోజులు ఎగ్

వారంలో ఒక రోజు స్వీటు, ఒక రోజు ఫ్రూట్ సలాడ్ / కస్టర్డ్ 

ఆదివారం: మధ్యాహ్నం : మసాలా అన్నం/అన్నం/పప్పు/రసం/చికెన్
రాత్రి: అన్నం,పప్పు,సాంబార్,చట్నీ 


on
categories: | edit post

10 వ్యాఖ్యలు

 1. మీరు చెప్పినవన్నీ బాగున్నాయండీ. వీటితో పాటు నెలకో రెండు నెలలకోసారి స్పెషల్ డిన్నర్ అని పెట్టి ఎక్కువ ఐటెంస్ పెట్టి చేస్తే సరదాగా చిన్న పండగా బావుంటుంది. పిల్లలు సరదాపడతారు. మా హాస్టల్ లో ఉండేది అలాగ. మాకు ఆరోజు పండగలాగే ఉండేది.

   
 2. jeevani Says:
 3. సౌమ్య గారూ మీరు చెప్పింది బావుంది.
  దీనికి అనుకున్న ప్లాన్ ఏమంటే మా సర్కిల్లోని మిత్రుల బర్త్ డే/ మారేజి డే ఇలా ఏవున్నా ఇక నుంచి జీవనిలోనే జరపాలని అందరికీ చెప్పాము.

   
 4. Anonymous Says:
 5. ఇప్పట్లో స్కూలుకి డబ్బాలు కట్టటం వాళ్ళు అక్కడ సరిగ్గ తినకపోవటం మామూలు అయిపోయింది. కనుక వాళ్ళకు పుష్ఠిగా పగలు తిండి పడటల్లేదు. నేను అందుకే మాపిల్లలకు పొద్దున తప్పనిసరిగా అన్నం పెడతాను. మాకోసం అన్నం, పప్పు, కూర పొద్దునే వండుతాము. ఒక సాదకం తో అన్నం, పెరుగన్నం పొద్దున పెడితే మరో సాదకం, పెరుగన్నం బాక్స్ లో పెడతాము.
  ఏ టిఫెన్ అన్నంతో సమానం కాదు. పిల్లలకు పొద్దున అన్నం చాలా ముఖ్యం. ఆలోచించండి. ఇంకా సాయంత్రం కేవలం డ్రైస్నాక్స్ కాకుండా ఆటైంలో అలాంటి టిఫెన్లు పెడితే మంచిది. పిల్లలకు సాయంత్రం ఆకలి ఎక్కువగా ఉంటుంది.
  అన్నం, ఆకు కూర ఖర్చుతక్కువ బలం ఎక్కువ.

   
 6. Anonymous Says:
 7. mee menu lo aku kuralu vadilesaru. Alage varam lo oka roju chapati compulsoryga pettandi. Kavalante puri teeseyandi. Madhyanam lunchki oka roju veg fried rice cheyandi. Ratriputa curd rice compulsory cheyandi. Fruit custard edaina sweet baduluga pedite tasty bhee healthy bhee.
  Kalyani

   
 8. jeevani Says:
 9. మీరు చెప్పింది నిజమే, నా చిన్నపుడు మా ఇంట్లో అలాగే ఉండేది. పొద్దున అన్నం, మద్యాహ్నం టిఫిన్. అయితే ఈ మెనూ సెలవుల్లో ఉండేది. 11 గంటలకు అన్నం తినేవాళ్ళం, 3 గంటలకు టిఫిన్ ఉండేది.
  ఇప్పుడు పిల్లలు స్కూల్కు పోవాలంటే 8.30 కల్లా పిల్లలు బయలుదేరిపోవాలి. అంతపొద్దున అన్నం తినడం ఇబ్బందిగా అనిపిస్తుందేమో.
  మధ్యతరగతి వారి పిల్లలు ఉంటున్న హాస్టళ్ళలో, ప్రభుత్వ వసతి గృహాల్లో పొద్దున రైస్ ఐటం ఉంటుంది. ఖర్చు తగ్గించడం కోసం అలా చేస్తుంటారు. వీటిలో మొక్కుబడిగా చేస్తారు కాబట్టి పిల్లలు విరక్తి చెందడం నేను గమనించాను.
  మీ స్పందనకు ధన్యవాదాలు.

   
 10. jeevani Says:
 11. రెండో అఙ్ఞాత గారూ,
  పప్పులో ఆకుకూర కలుస్తుంది కదా? ఆయిల్ తో కూడిన పూరీ కంటే చపాతీ బానే ఉంటుంది. వెజిటబుల్ రైస్ మెనులో ఉంది గమనించండి. ఒక పూట పెరుగు రెండో పూట మజ్జిగ ఉంది. fruit custard ok.
  మీ సూచనలకు ధన్యవాదాలు

   
 12. Anonymous Says:
 13. Mi diet plan chala bagundandi.

  alage everyday oka seasonal fruit unte baguntundi (roju arati pandu kakunda).

   
 14. ఉష Says:
 15. మీ మెనూ బావుంది. పిల్లల్ని గూర్చి చాలా ఆలోచిస్తున్నారు. మీ ఇతర ప్లాన్ బావుంది. నాకు తెలిసిన ఒక వృద్దాశ్రమమంలో అలా వెలుపలి కుటుంబాల విశేష/ప్రత్యేక విందులు జరుగుతాయి. కాస్త స్పెషల్స్, వంటకాల మార్పు బావుంటుంది.

  .. నాకిక్కడ వంటకాల్లో నిమ్మ వాడకమున్నవి కనపళ్ళా...ఒక్కటైనా సిట్రస్ పండు ఉండేలా చూస్తే మంచిది.
  .. వారానికోసారి జొన్న, సజ్జ వంటకం ఒకటి చిన్న వయసు నుంచీ అలవాటు చేస్తే ఆరోగ్యారీత్యా మంచిది, పోషకాలు అందుతాయి.
  .. అలాగే (నేను తినకపోయినా తెలిసినడాన్ని బట్టి) చేప ఇవ్వటం మంచిదని.
  .. పాయసం, పరమాన్నం స్వీట్ సెక్షన్ లో ఉంటే తేలికగా జీర్ణమౌతాయి. చిలకడ దుంప పాయసం వంటివీను. పంచదార కన్నా బెల్లం వాడకం చూడండి.

   
 16. jeevani Says:
 17. ఉష గారూ మీ సలహాకు ధన్యవాదాలు. చేప ఇతర మాంసాహారాల కంటే మంచిది. తప్పకుండా మెనూలో ఉంచుతాము.
  అలాగే స్పెషల్ వంటకాలు వారానికి ఒకసారి ఉంటాయని అనుకుంటున్నాము.

   
 18. hello meru chestunna seva bagundi

   

Blog Archive

Followers