మిత్రులారా నమస్తే,
జీవని హాస్టల్ ఆగస్ట్ 1 వ తేది నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది.
అయితే 29 వ తేదిన అనుకున్న ప్రారంభోత్సవ కార్యక్రమం మాత్రం వాయిదా పడింది.
ఆ రోజున ఎక్కువ పెళ్ళిళ్ళు ఉండటం వల్ల, ముఖ్య అతిథులు కూడా తాము అందుబాటులో ఉండలేము అని చెప్పడం వల్ల వాయిదా వేయవలసి వచ్చింది.
వచ్చే రెండు నెలల్లో కాంపౌండ్ వాల్ పూర్తీ అవుతుంది, ప్లాంటేషన్ అవుతుంది. అప్పుడు ఒక రోజు ఫంక్షన్ పెడితే బావుంటుంది అని నిర్ణయించడం జరిగింది.
కొందరు మిత్రులు రావడానికి ప్లాన్ చేసుకున్నారు. వారికి మరోసారి క్షమాపణలు.
అసౌకర్యం...
విజయ ఆదిత్య రాయవరపు & విజయ సాయి రాయవరపు సోదరులు 5000/- విరాళం అందించారు. కెనెడాలో విద్యాభ్యాసం చేస్తున్న వీరికి బ్లాగు ద్వారా జీవని పరిచయం. జీవనిని ఎంతగానో అభిమానించే విజయ్ సోదరులకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరు ఉన్నత స్థాయికి చేరుకుని ఇతరులకు సహాయపడే అవకాశం కల్పించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము.
హరీష్ గారు ( చిత్తూరు ) 5000/- విరాళం అందించారు. వీరికి పిల్లల తరఫున కృతఙ్ఞతలు తెల్పుతున్నాము.
ఈ నెల 29 న అంటే వచ్చే ఆదివారం జీవని హాస్టల్ ప్రారంభోత్సవం. అందరికి ఇదే ఆహ్వానం.
DAILY...
మిత్రులారా జీవనిని ఆదరిస్తున్న మీ అందరికీ ముందుగా కృతఙ్ఞతలు. అందరి సహాయసహకారాలతో జీవని హాస్టల్ నిర్మాణం పూర్తి అయింది. ఈ నెల 29న ప్రారంభోత్సవం జరగనుంది. పిల్లల తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. హాస్టల్ నిర్మాణం బాధ్యతను భరించడమేకాక ఆర్థికంగా అన్నీ తానే అయిన జీవని ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెల్పుతున్నాము. ముందునుంచీ చెబుతున్నట్టు జీవనికి మరో ప్రాణం బ్లాగర్లు. మీ సహాయం మాకు ఆర్థికంగా నైతికంగా ఎనలేని బలాన్ని ఇచ్చింది. మీ అందరూ...
చి.అగ్తు వెంకట్ మొదటి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు శ్రీ & శ్రీమతి అగ్తు రామక్రిష్ణ గార్లు జీవనికి 11000/- విరాళం అందించారు. జీవని గురించి బ్లాగు ద్వారా ఆయనకు తెలిసింది. రామక్రిష్ణ గారు న్యూజెర్సీలో ఉంటున్నారు. వారి మిత్రులు కపిల్ కనోజియా మరో 1000/- విరాళంగా కలిపి పంపారు.రామక్రిష్ణ గారి కుటుంబ సభ్యులకు, కపిల్ గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
DAILY BALANCE SHEET - JULYBALANCE AS ON 30-6-2012...

బ్లాగుల్లో సుతిమెత్తని హాస్యానికి కితకితలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాజ్ కుమార్ కు పిల్లల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజ్ ఇప్పటికి పలుసార్లు జీవని పిల్లలని కలిసారు. ఇంత పెద్ద కెమెరా వేసుకుని ఫోటోలు తీస్తుంటే పిల్లలంతా ఆయన వెంటే ఉంటారు. తన జన్మదినం సందర్భంగా రాజ్ జీవనికి 10,000/- విరాళం అందించారు. ఆయనకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నము .
DAILY...