మిత్రులారా మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జీవనిలో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఆసక్తి కలిగించేలా విద్యా బోధన, యోగా, ధ్యానం, ఆటలు, పాటలు, చిత్రలేఖనం తదితర అంశాలు చేర్చాము. ఇంకా నైతిక విలువలు, మంచి అలవాట్లు రోజుకొకటి చొప్పున పిల్లలకు నేర్పాలని అనుకుంటున్నాము. ఉదాహరణకు పెద్దలను గౌరవించడం, తమ పని తామే చేసుకోవడం, పర్యావరణ స్పృహ, పరిశుభ్రత తదితర అంశాలు. అలాగే నిజాలు చెప్పడం, దొంగతనం మానిపించడం ( అలవాటు ఉంటే ), ఆత్మవిశ్వాసం కలిగిఉండటం ఇలాంటివన్నమాట మీకు ఏవైనా తెలిసివుంటే మాకు సలహాలు ఇవ్వండి. అలాగే సమ్మర్ క్యాంప్లో...
మిత్రులారా జూన్ నెల ఎప్పుడొస్తుందా అని పిల్లలతోపాటు మేమంతా కూడా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇద్దరు గోమాతలు తమ పిల్లలతో జీవనిలోకి జూన్ లో అడుగుపెట్టనున్నారు. సాహిత్యం గురించి అవగాహన ఉన్నవారికి శైలబాల గారిని తిరిగి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు తమ మిత్రబృందంతో ఏర్పాటు చేసిందే బృందావనం. వారు మొదటి ప్రాజెక్టుగా జీవనినే ఎంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. బృందావనం సభ్యులందరికీ జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పూర్తీ వివరాల కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి http://kallurisailabala.blogspot.in/2013/04/blog-post_21.html
http://www.jeevanianantapur.com
DONATIONS...
మా ప్రాంతంలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. ఇన్నాళ్ళూ SRIT నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాము. అయితే మే నుంచి సమ్మర్ క్యాంప్, జీవని విద్యాలయం అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్లాంట్ వేయిస్తున్నాము. ఈ వారంలో బిగిస్తున్నాము. దీనికి సంబంధించిన దాతల వివరాలు కూడా అదే టపాలో తెలియజేస్తాము.
ముఖ్యమైన విషయం ఏమంటే జీవనికి 100 మీటర్ల దూరంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా ఈ నీటిని అందించనున్నాము. వాళ్ళు సుమారు 400 మంది...
http://www.jeevanianantapur.com
DONATIONS FOR JEEVANI VIDYALAYAM
TOTAL ESTIMATION : 5,00,000/-
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY - 10,000/-
SHILPA TOWNSHIP - 20,000/-
VENKATARAMI REDDY - 1,00,000/-
MONTHLY DONATIONS
G.Ganapathi...
జీవని స్థాపించినపుడు చాలా క్రియాశీలకంగా ఉండి మమ్మల్ని ఎంతగానో ప్రొత్సహించిన సోదరుడు విశ్వనాథ్ ఆ తర్వాత వృత్తిరీత్యా బిజీ అయిపోయారు. రెండురోజుల కిందట ఫోన్ చేసి, అన్నా ఇబ్బందులు తొలగిపోయాయి ఇక నేను రెడీ అని చెప్పాడు. ముందుగా తన విరాళంతో మొదలుపెట్టాడు. 5000/- విరాళంగా ఇచ్చాడు. నిజానికి మొదట్లో 20 మందిని మోటివేట్ చేసి నెల నెలా విరాళం పంపాడు విసు. ఆయన ఇచ్చే ప్రోత్సాహం ఎంతో శక్తిని ఇస్తుంది. దేన్నైనా ఎదుర్కోగలం అనే భరోసా ఇవ్వడంలో విశ్వనాథ్ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయనకు ధన్యవాదాలు తెల్పుతున్నాము.
http://www.jeevanianantapur.com
DONATIONS...
మిత్రులారా గతంలో ఉన్న జీవని వెబ్ సైట్ కొన్ని కారణాల వల్ల మూసివేయడం జరిగింది. జీవని కొత్త వెబ్ సైట్ ఇదే.
http://www.jeevanianantapur.com/
దయచేసి ఒక్కసారి చూడండి. ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే సూచించండి ధన్యవాదాలతో జీవని...