ఆగస్టులో జీవని హోం ప్రారంభం అయ్యాక ఎంతోమంది పిల్లల్ని పలకరించడానికి వచ్చారు. దాదాపు ప్రతి ఆదివారం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కానీ పిల్లలు ఎంతో చనువుగా స్నేహితుల్లాగా కలిసిపోయేది మాత్రం బ్లాగర్లతోనే . బహుశా బ్లాగర్లు ఇక్కడికి రాగానే పిల్లలు అయిపోతారేమో.  మరి ఏ జన్మలో బంధమో ఇది. రాజ్, కార్తీక్,భాస్కర్ గార్లు బెంగళూరునుంచి వచ్చారు. ముందురోజే శారద గారు కూడా ఫోన్ చేసారు. ఆవిడ బ్లాగు సానుభూతిపరురాలు. బ్లాగులు చూస్తున్నారు, రాయాలనే ఉత్సాహంలో ఉన్నారు. జీవనిలో ఆమెకు పూర్తి బ్రెయిన్ వాష్ చేసి బ్లాగులు రాయకపోతే జీవితం వ్యర్థం అనిపించేలా చేసారు మనవాళ్ళు అది తర్వాత చెప్పుకుందాం. సరే శారదగారు కాబోయే  పతీ సమేతంగా వస్తామన్నారు. జీవనిలో హోళీ చేసారా అని అడిగారు. లేదండీ ఆ రోజు పిల్లలకు స్కూల్ ఉంది ( సైన్స్ ఫెయిర్ ప్రిపరేషన్స్ ) అందుకే చేయలేకపోయాం అని చెప్పాను. ఆవిడ సంబరంగా అయితే నేను రంగులు తెస్తాను అన్నారు.

బెంగళూరు బ్యాచ్ మధ్యాహ్నానికి జీవనికి చేరుకుంది. సాయంత్రానికి హైదరాబాద్ నుంచి బంతి, రెహమాన్, లక్ష్మీ నరేష్, సురేష్ పెద్దరాజు గార్లు కూడా చేరుకున్నారు. పిల్లలతో ఆటలు పాటలు గేయాలు తెలుగు పద్యాలతో రచ్చ లేపారు.  జీవనికి జీ 24 గంటల చానెల్ వాళ్ళు ఇచ్చిన మెమెంటోతో ( దాన్ని ప్రస్తుతం SRIT లో ఉంచాము ) రాజ్ కుమార్, అలాగే గ్లోబును కిరీటంలా  మోస్తున్న దృశ్యం :)


తర్వాతి టపాలు...
 

జీవనిలో రంగుల ప్రపంచం సృష్టించిన బ్లాగర్లు
 

భారత క్రికెట్ టీం నుంచి బ్లాగర్లకు ప్రాణహాని

on
categories: | edit post

3 వ్యాఖ్యలు

 1. జీవనిలో జీవం వుంది..అందుకే బ్లాగర్లకు ఆ మాయ సాధ్యమయ్యింది!

   
 2. రెండ్రోజులు ఉత్తినే గడిచిపోయాయండీ.. జీవని నుండి తిరిగొచ్చిన ప్రతిసారీ , కడుపు నిండుగా సీమవంటలు,
  మనసు నిండా ఆనందం నింపుకొని రావటం అలవాటయిపోయింది.

  గత రెండ్రోజులనీ నెమరువేసుకుంటూ... తర్వాతి పోస్టుల కోసం ఎదురు చూస్తూ

   
 3. jeevani Says:
 4. మీ స్పందనకు ధన్యవాదాలు

   

Blog Archive

Followers