జీవితంలో ఎంతోమంది వ్యక్తుల్ని మనం కలుస్తూ ఉంటాము. కొంతమంది మాత్రమే మన మనసులో ఉండిపోతారు. ఏదో ఒక సందర్భంలో తరచుగా గుర్తుకు వస్తూంటారు. అలాంటివారిలో శంకర్‌గారు ఒకరు. బ్లాగులో బజ్‌లో ప్లస్‌లో ఆయన చేసిన సందడి అందరికీ గుర్తుంటుంది. ఆయన దూరం అయినప్పటికీ శంకర్‌గారితో అనుబంధం ఉన్న బ్లాగర్లు ఇప్పటికీ ఆయన ప్రస్తావన తెస్తూనే ఉంటారు. ఇది శంకర్‌గారి గురించి క్లుప్తంగా...
వారి శ్రీమతి స్వాతిగారు మొన్న ఫోన్ చేసారు. శంకర్‌గారికి చదువు, పుస్తకాలు చాలా ఇష్టమండీ. వారి స్మృతిలో ఒకమ్మాయిని చదివిస్తాను అన్నారు. 10,000/- విరాళం పంపారు. వారి కోరిక మేరకు 4వ తరగతి చదువుతున్న సునీతను స్పాన్సర్ చేయిస్తున్నాము. స్వాతిగారికి ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలగాలని ప్రార్థిస్తున్నాము. ఫోటొలో మొదటి వ్యక్తి శంకర్‌గారు, మధ్యన ఉన్నది ఒంగోలు శీనుగారు.
 photo courtesy: srinivas garu

on
categories: | edit post

1 Responses to బ్లాగర్ శంకర్ గారి స్మృతిలో ఒకరికి స్పాన్సర్‌షిప్

  1. Raja Chandra Says:
  2. manchi nirnayam tiskunnaru.. shankar gari atmaku shantikalagalani korukuntunnanu

     

Blog Archive

Followers