శ్రీ అమరనాథ్ రెడ్డి ( శక్తి స్వరూప్ చిట్స్ ) మరియు శ్రీమతి లలిత గార్ల కుమార్తె సంజన మొదటి పుట్టినరోజు నేడు. ఈసందర్భంగా వారు 20,000/- విరాళం అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.  



Read More









Read More


మీ జీవని పిల్లలు






Read More

friends pl give suggestions, these are printed on flexis and hanged to the walls. every day children will read. if you want to add any point or if you feel to delete kindly suggest. it is raw format, will be improved after suggestions
tq.
morning prayer
నా లక్ష్యం చేరుకోవడానికి మరో ఉదయం నా ముందుకు వచ్చింది
ప్రశాంతంగా మంచి మనసుతో పాజిటివ్‌గా ఈ రోజును నేను ప్రారంభిస్తున్నాను
నిన్నటి తప్పులను పొరపాట్లను ఈ రోజు అధిగమిస్తాను
చదువే నా గమ్యం చదువే నా ఊపిరి చదువే నా జీవితం
నా జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దేది చదువే
నా తలరాతను మార్చేది చదువే 
అందుకే నేను ఈరోజు పాఠాలు చక్కగా వింటాను బాగా చదువుతాను 
అందరితో స్నేహంగా ఉంటాను
check list
నేను ఈరోజు బాగా పాఠాలు విన్నానా?
అబద్ధాలు చెప్పానా?
చాడీలు చెప్పానా?
ఇతరులను బాధపెట్టానా?
పోట్లాడానా?
నా లక్ష్యాన్ని మరిచానా?
ఎంతసేపు నవ్వాను?
ఎంత ఆనందంగా ఉన్నాను?
night prayer
నేటి దినచర్యను నేను ఆత్మ విమర్శ చేసుకుంటున్నాను 
నేను తప్పు చేసి ఉంటే ఇప్పుడే సరిదిద్దుకుంటున్నాను 
కొన్ని వందలమంది నేను గొప్ప స్థానానికి పోవాలని కోరుకుంటున్నారు 
నాకు సహాయం చేస్తున్నారు 
వారిలో పిల్లలు పెద్దలు పేదలు కూడా ఉన్నారు
వారి నమ్మకాన్ని నేను వమ్ము చేయను
పెద్దయ్యాక ఈ సమాజానికి నేను తప్పకుండా సహాయపడతాను 
మాకు చేయీతనిస్తున్న వారికి సుఖ సంతోషాలను ఇమ్మని దేవుని ప్రార్థిస్తూ ఈరోజుకు సెలవు తీసుకుంటున్నాను
pic: model of a hanged flexi


Read More


దత్తతకు సంబంధించి మాకు తరచుగా కాల్స్ వస్తుంటాయి. కొద్దిరోజుల కిందట దినపత్రికలో వచ్చిన వార్త చూసి మరోసారి టపా పెడుతున్నాము.

దత్తత ఎందుకు?

1) పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్లు నిర్ధారించాక వీలైనంత త్వరగా దత్తత ప్రక్రియ మొదలుపెట్టండి.
2) టెస్ట్ ట్యూబ్ బేబీస్ కోసం ఎక్కువసార్లు ప్రయత్నిచడం వల్ల మహిళల్లో హార్మోన్ల పరంగా సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతారు
3) పిల్లలు లేరు అన్న భావన భార్యాభర్తలను కుంగదీస్తుంది
4) స్త్రీలు బంధువుల నుంచి, ఇంటాబయట రకరకాలుగా హింసను ఎదుర్కోవలసి వస్తుంది.
5) ఒక అనాధ బిడ్డను దత్తత చేసుకుంటే ఆ పాపకు / బాబుకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు
6) మీకు పాపపుణ్యాల పట్ల నమ్మకం ఉంటే ఏ మనిషీ జీవితంలో ఇంతకంటే పెద్ద పుణ్యం చేయలేరు. ఎంతమంది దేవుళ్ళను కొలిచినా అంత పుణ్యం వస్తుందని అనుకోలేము
7) మనం కొన్ని వేల సంవత్సరాలు బతకడం లేదు, ఏక్షణంలోనైనా ఈ ప్రపంచాన్ని వీడి పోవచ్చు. క్షణభంగురమైన జీవితానికి పిల్లలు లేరు అని ప్రతి క్షణం హింసపడే బదులు చక్కగా దత్తత తీసుకోవచ్చు. జీవితాన్ని సతృప్తికరంగా మలచుకోవచ్చు.

కొన్ని సలహాలు...

1) డాక్టర్లు నిర్ధారించాక మరికొన్ని సంవత్సరాలు గుళ్ళూగోపురాలు తిరిగాక తీరా చివరి అవకాశంగా దత్తతకు వెళ్తారు, అప్పటికి భార్యాభర్తలకు వయసు ఎక్కువ అయిపోయి ఉంటుంది. అలాగే మనం అప్లికేషన్ పెట్టిన వెంటనే దత్తత ఇవ్వరు. ఇందుకు కనీసం 1-2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోండి. మీ పేరు సీనియారిటీ లిస్టులో ఉంటుంది. ఈలోపు పిల్లలు కలిగారనుకోండి శుభం, మీరు దత్తత ప్రక్రియ నుంచి తప్పుకోవచ్చు.

2) జీవని లాంటి ఆశ్రమాల్లో రాష్ట్రవ్యాప్తంగా వేల మంది పిల్లలు ఉంటారు. కానీ చాలామంది పిల్లలకు వారి అవ్వాతాతలు, పెదనాన్న చిన్నాన్న లాంటి వారు ఉంటారు. కాబట్టి ఆశ్రమాలు దత్తత ఇవ్వడం జరగదు. అలా ఇవ్వడం తీసుకోవడం చట్టవిరుద్ధం కూడా. డబ్బులు ఇచ్చి మోసపోవద్దు.

3) దత్తత ప్రక్రియ శిశుసంక్షేమ శాఖ, ఫ్యామిలీ కోర్టు ద్వారా అధికారులు, న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది.

దత్తత తీసుకునే భార్యాభర్తలకు సహాయపడటానికి మేము ఎళ్ళవేళలా సిద్ధం. సమాచారం కావాలంటే jeevani.sv@gmail కి మెయిల్ చేయవచ్చు. 

మిగతా వివరాలు కింద చూడండి 



Read More

నిన్నటి నుంచి దసరా సెలవులు కావడంతో పిల్లలు తమ అవ్వాతాతలు, తల్లిదండ్రుల రక్తసంబంధికుల ఇళ్ళకు వెళ్ళారు. ఓ ఐదుగురు పిల్లలు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. తిరిగి పిల్లలు 5వ తేదీన జీవనికి వస్తున్నారు. ఇంటర్నెట్ సమస్య వల్ల గత కొద్దిరోజులుగా బ్లాగ్ అప్డేషన్ కుదరలేదు. పిల్లలతోపాటు మేమంతా కూడా వారం పాటు సెలవు తీసుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలతో సెలవు.


 pic taken at JEEVANI
courtesy: Rajkumar Neelam  http://rajkumarneelam2.blogspot.in/




Read More




మిత్రులారా మొన్న బాలికల డార్మిటరీ ప్రారంభోత్సవం రోజున 65 హుండీలను ఇక్కడికి వచ్చిన పిల్లలకు ఇచ్చాము. పిల్లలకు వారి తల్లిదండ్రులకు విన్నవించింది ఏమంటే పుట్టినరోజు లేదా ఇతరత్రా సందర్భాల్లో వీటిని ఓపెన్ చేయండి. ఆ మొత్తాన్ని జీవనికే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినచోట అవసరం ఉన్నవారికి ఇవ్వండి అని. పిల్లల్లకు ఆదా చేయడాన్ని ఆపైన సేవకు వాటిని వినియోగించడాన్ని నేర్పండి. జీవని నినాదం జీవితంలో జీతంలో 1% సమయాన్ని డబ్బును సేవకు కేటాయించండి ఎక్కడైనా ఎవరికైనా... అది జీవని కావాల్సిన అవసరం లేదు. పిల్లల్లో సేవాభావాన్ని పెంపొదిస్తే సమాజం పట్ల ఒక సానుకూల ధోరణి, దయాగుణం, స్నేహశీలత లాంటివి అలవడతాయి అని చెప్పాము. ఇకనుంచి కూడా జీవనికి వచ్చే ప్రతి కుటుంబానికి రెండు హుండీలు ఇవ్వాలని అనుకున్నాము. ఒకటి వచ్చినవారికి రెండోది వచ్చిన పిల్లల బెస్ట్ ఫ్రెండ్‌కి. 



హుండీలకు అడ్రస్‌లు అతికిస్తున్న బ్లాగర్లు

Read More

 
 నెట్ ఇబ్బందులు ఇతర పనులవల్ల మొన్నటి కార్యక్రమ విశేషాలను మీముందు ఆలశ్యంగా ఉంచడం జరుగుతోంది. మూడు సంవత్సరాల కిందట శంకుస్థాపన రోజున మేము ఉన్నాము, జీవని మరో మైలురాయి సాధించిన రోజున కూడా మేము ఉంటాము అని బ్లాగర్ రాజ్‌కుమార్ గారు ముందే చెప్పారు. అనుకున్నట్టుగానే రాజ్ దంపతులు, కార్తీక్, రహమాన్ గార్లు బెంగళూరు నుంచి వచ్చారు.

ఆతర్వాత జరిగింది రాజ్ మాటల్లోనే చదవండి...


ఎన్ని సార్లు వెళ్ళినా జీవని కి వెళ్ళొచ్చిన ప్రతి సారీ సరికొత్త అనుభవాలు ఙ్ఞాపకాలై ఉండిపోతాయి నాకు. పోయిన ఏడాది అనుకున్న ప్రయాణం అలా వాయిదాల మీద వాయిదాలు పడి మొన్నటికి కుదిరింది.

ఈ సారి ఎప్పుడూ వచ్చే మన వాళ్ళలో చాలా మందికి కుదరక పోయినా, అనుకోని ట్విస్టులతో సరదాగానే సాగింది. బెంగుళూరు నుండి నేనూ మా ఓనర్ గారూ, కార్తీకూ, రెహమానూ శనివారం పొద్దున్నే బయలెళ్ళాం.

మా ఆచారం ప్రకారం, ఈ సారి కూడా దారి మరిచిపోయి వీలైనంత ఎక్కువ దూరం ప్రయాణించి జీవని కి చేరుకున్నాం. రెండేళ్ళ క్రితం పునాది రాయి వేసినప్పుడు చూసిన ప్రదేశమేనా ఇదీ? అనిపించేలా చుట్టూ ప్రహారీ గోడ, దాన్ని ఆనుకొని మొక్కలు, ఓ పక్క స్కూల్, ఆ పక్క బోయ్స్ హాస్టల్, దాని పక్కనే ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్దం గా ఉన్న గర్ల్స్ హాస్టల్. "ఆహా..." అనుకున్నాం. ప్రతి సారీ మేం వెళ్ళగానే చుట్టుముట్టి అల్లరి చేసే పిల్లలు, ఈ సారి మాత్రం అలా పలకరించి తిరిగి వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. కొందరు అమ్మాయిలు గుడ్డముక్కలతో గులాబీలు చేస్తుంటే, మరికొందరు వాకిలి అలుకుతూ, ఇంకొందరు పూలమాలలు కడుతూ, పరిసరాలు శుభం చేస్తూ బిజీ బిజీగా  కనిపించారు. కొందరు అబ్బాయిలు , అమ్మాయిల కోసం గోరింటాకు తెచ్చి పేద్ద బండరాయితో నూరుతూ ఉంటే, చిన్నప్పుడు  మా అమ్మ , పిన్ని ల కోసం గోరింటాకు తెచ్చి నూరి న రోజులు గుర్తొచ్చాయి.
ఇవన్నీ మరునాడు జరగబోయే ఫంక్షన్  కి ఏర్పాట్లన్న సంగతి అర్ధమయ్యి   భోజనాలు చేసి  ఎవరో మత్తు మందు ఇచ్చినట్టుగా బజ్జున్నాం. సాయంత్రం అలా ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళి హరేకృష్ణ.. అనుకొని తిరిగొచ్చేసరికి, పక్కనే ఉన్న ఇంజినీరింగ్ కాలేజ్ పిల్లల
సహాయంతో  ఒక పేద్ద రంగుల ముగ్గేసే బృహత్ కార్యక్రమం నడుస్తుంది అక్కడ. ఆ ముగ్గు చుట్టూరా తిరుగుతూ నాలుగు ఫోటోలు తీసి కబుర్లు చెప్పుకున్నాం.
 

  అప్పటి వరకూ ఏర్పాట్లూ, గ్యాప్ లేకుండా వచ్చే ఫోన్ లతో  తీరిక లేకుండా ఉన్న ప్రసాద్ గారూ -సునంద అక్కలు కూడా  మాతో కలిశారు.


రాత్రి  10 గంటల సమయం లో  శివ కుమార్ అనే చలాకీ బుడ్డోడు,బయట ఆడుకొని నిద్రపోయిన ఇంకో చిన్న పిల్లాడిని  ఎత్తుకొని  మేడ మీది గది లో పడుకోబెట్టడానికి మెట్లెక్కుతుంటే మేమంతా అలా చూస్తూ ఉండిపోయాం."పిల్లలు తొందరగా
ఎదిగిపోతున్నారు " అని చూడగానే అనుకున్నాం గానీ "బాధ్యత గల కుటుంబ సభ్యులు" గా ఎదుగుతున్నారని  అప్పుడే తెలుసుకున్నాం. ఆ ఏజ్  లో  నాకంత మెచూరిటీ ఉన్నట్టు నాకయితే గుర్తు లేదు, తమ్ముడి పుట్టిన్రోజు నాడు  నాకు కొత్త బట్టల్లేవని ఏడ్చి కొనిపించుకున్న  అల్లరితనం, రోజంతా  కొట్టుకుని  చివరాఖర్న తన్నులు తిన్న తింగరితనం తప్ప.పిల్లని ఈ  రీతి లో  పెంచుతున్నందుకు మనసు లో ఓ సారి దండం పెట్టుకున్నాను.

మరుసటి రోజు  పిల్లలు ఇచ్చే పెర్ఫార్మెంస్ లని ఓ సారి రివ్యూ చేసి, కామెడీ స్కిట్ లో  కొంచెం కరివేపాకు వేసి, రిహార్సల్స్ అన్నీ అయ్యాక   రాత్రి  ఒంటిగంటకెపుడో   మేం నిద్రపోయాం. స్టాఫ్ మా త్రం తెల్లవార్లూ డెకరేషన్ స్  చేస్తూనే ఉన్నారు.

పొద్దున్నే   తెలివొచ్చినాగానీ  బద్దకం గా ఇంకా మంచం మీదున్న  నాకు"సార్... ఈ మంచం తియ్యండి, లెగండి ఇంక పడుకున్నది చాలు" అన్న మాటలు  కొంచెం కరకు గా వినిపించడం తో  కార్తీక్ నీ, రెహ్మాన్ నీ లేపి, ఏదో‌డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూశా, మిర్చి లో ప్రభాస్ లాగా మొహానికి తువ్వాలు కట్టుకుని అరుస్తున్నది "శీనన్న" అని కనిపెట్టి షాకయ్యాం అందరం.(శీనన్న   వస్తున్నట్టు మాకు తెలవది) ఆ పక్కనే‌ సురేష్ గారు. ఓ సారి కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్  మని అరిచి కిందకి
ఉరికాం. శీనన్న వచ్చాక ఎలా ఉంటాదో మన జనాలకి బాగా తెలుసు కదా. రచ్చ రచ్చ అన్నమాట.
 
డార్మిటరీ ఓపెనింగ్ సెర్మనీ  విశాల ఫెర్రర్ గారి చేతుల మీదుగా  అయింది.
 
 
 
 
 



ఊరికి దూరం అయినా  మూడొందల మంది కి పైగా జనాలు వచ్చారు.
పిల్లలు చేసిన గ్రూప్ డ్యాంస్ లు (వాళ్ళే కంపోజ్ చేసుకున్నారు) ఆకట్టు కోగా, కామెడీ స్కిట్  జనాల్లో నవ్వుల సునామీ ని  సృష్టించింది.
 
 
 
 

  ప్రసాద్ గారి అధ్యక్షతన  జీవని కుటుంబ సభ్యులంతా మాట్లాడారు. బ్లాగర్ల ప్రతినిధి గా  స్టేజెక్కి కూర్చున్న శీనన్న, మైక్ పట్టుకొని  నించొని ఇచ్చిన  స్పీచ్ కి   సభ మొత్తం షేక్ అయ్యింది. తెలుసుగా... ఆ వాయిస్ కి బేస్ ఎక్కువ,మాటలకి పదునెక్కువ.
 


విజయ్ మోహన్ గారు ఈ సారి  కూడా వచ్చి కలిశారు. ఇంటికి రమ్మని  ఎప్పటిలానే  పిలిచారు. సమయం లేక వెళ్లలేకపోయాం. సభానంతరం  క్లాస్ రూం  బెంచ్ ల మీద కూర్చొని భోజనం చెయ్యడం ఒకరకం ఆనందాన్నిస్తే, అక్కడ జరిగిన మరో
చిన్న సంఘటన  ఇంకో  రకమైన  ఙ్ఞాపకాన్నిచ్చింది. మా ముందు బెంచ్ లో కూర్చుని భోజనం‌చేస్తున్న  ఓ పిల్లాడి దగ్గరకి , రైస్ ప్లేట్ తో వచ్చిన  ఓ‌ అమ్మాయి (మూడో, నాలుగో చదువుతుంది అనుకుంటా) "ఏరా... పప్పు వేస్కొని తింటున్నావా
అయి..పోయావ్. అంతే ఇక" అని  ఓ సీరియస్ లుక్కిచ్చి  పక్క  బెంచ్ మీద కూర్చుంది. ఇంకో అబ్బాయి వచ్చి.."నువ్ పప్పు తినకూడదని చెప్పారు కదరా...బుద్ది లేదా? తినేస్తున్నావ్" అని తిట్టాడు. వాడు  కలిపిన పప్పు ముద్దని ఏడుపు మొహంతో  పక్కన పెట్టేశాడు. విషయం‌ఏంటని  అడిగితే చెప్పాడు.."వాడినీ కుక్క కరిచింది సార్.. గాయం మానే వరకూ పప్పు తినకూడదు అన్నారు. వీడు  తినేస్తున్నాడు"అని అసలు సంగతి చెప్పాడు. వాళ్ళ అభిమానం, స్నేహం చూసి ఎంత ముచ్చటేసిందో.!!!

సాయంత్రం ఐదింటికి శీనన్న, విజయ్ మోహన్ గారు, సురేష్ గార్లకీ, జీవని కుటుంబం మొత్తానికీ వీడ్కోలు చెప్పి , మళ్ళీ వచ్చేవరకూ  సరిపయే అనుభవాలని  నింపుకొని తిరుగు ప్రయాణమయ్యాం.

***********************************************************************************************************************
జీవని ప్రారంభం నుంచి బ్లాగర్లు ఇస్తున్న ఆర్థిక నైతిక మద్దతు మరువలేనిది. జీవనిని నిలబెట్టడంలో మీ అందరి పాత్ర ఎంతో ఉంది. మీకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Read More





MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-
JULY - 2014 - 2,25,787/- 9,17,397/-
AUGUST - 2014 - 1,22,002/- 10,39,399/-
SEPTEMBER - 2014
6050 - 01.09.14 - iron 
760 - 02.09.14 - plumbing material 
1800 - 03.09.14 - labor for pits 8610/-
4030 - 06.09.14 - mason labor
1300 - 06.09.14 - paints labor 13,940/-
30000 - 09.09.14 - windows
5700 - 10.09.14 - JCB rent
2000 - 10.09.14 - labor for iron
2623- 10.09.14 - electric material 
4300 - 10.09.14 - clothes for mason and others
5500 - 10.09.14 - tiles
2000 - 10.09.14 - plumbing labour
3550 - 10.09.14 - plumbing 69,613/-
Total - 11,09,012/-

Read More

మిత్రులారా ఈనెల 14న జీవని బాలికల వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. జీవనికి బ్లాగర్లతో ఉన్న అనుబంధం మీకు తెలిసిందే. ప్రారంభం నుంచి మాకు ఆర్థిక నైతిక మద్దతు ఇస్తున్నారు. బ్లాగర్ల సహాయసహకారాలకు పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. రాదల్చుకున్నవారు దయచేసి jeevani.sv@gmail.com కి మెయిల్ చేయగలరు.

2011లో జీవని శంకుస్థాపన దృశ్యాలు
 పునాదిరాయి వేస్తున్న RDT ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ మాంచొ ఫెర్రర్ గారు 





బ్లాగర్ల తరఫున మాట్లాడిన ఒంగోలు శ్రీను గారు 




                                                  జీవని శంకుస్థాపన రోజున వచ్చిన బ్లాగర్లు 
చంద్రశేఖర్, బంతి, వ్యక్తిత్వవికాస నిపుణులు ఆకెళ్ళ రాఘవేంద్ర, రాజ్ కుమార్, ఒంగోలు శీను, చిలమకూరు విజయమోహన్ గార్లు 

Read More


అనంతపురం, జూనియర్ కళాశాల సమీపంలోని సుదీర్ టింబర్ డిపో వారు15,000/- విలువ చేసే తలుపులు వాటి సామగ్రి విరాళంగా అందించారు. జీవని సంయుక్త కార్యదర్శి చంద్రకాంత్ నాయుడు మిత్రులు సుబ్రమణ్యం గారు. రేటు కాస్త తగ్గించమని చంద్రకాంతు ఆయనకు ఫోన్ చేసారు. తగ్గించడం కాదు మొత్తం డోర్లు అన్నీ విరాళంగా ఇచ్చారు.
ఈ విరాళాన్ని ఆయన తమ తల్లిదండ్రులు శ్రీ.పెద్ద సుబ్బరాయుడు మరియు శ్రీమతి.నాగలక్ష్మమ్మ గార్లు, భార్య శ్రీమతి గీతావాణి కుమారుడు హేమంత్ కార్తీక్‌ల పేరు మీద ఇచ్చారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.




MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-
JULY - 2014 - 2,25,787/- 9,17,397/-
AUGUST - 2014 - 1,22,002/- 10,39,399/-

SEPTEMBER - 2014
6050 - 01.09.14 - iron 
760 - 02.09.14 - plumbing material 
1800 - 03.09.14 - labor for pits 8610/-
4030 - 06.09.14 - mason labor
1300 - 06.09.14 - paints labor 13,940/-
Total - 10,53,339/-

Read More






Read More


స్వర్గీయ లక్ష్మిదేవిగారి స్మృతిలో వారి కుమార్తె హేమలత( ప్రొబేషనరీ ఆఫీసర్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ )వారి అల్లుడు శ్రీ సత్యనారాయణ ( ఇ.ఎస్.ఎం, రైల్వేశాఖ, కర్నూలు ) స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. లక్ష్మిదేవి గారి ఆత్మశాంతికై పిల్లల తరఫున ప్రార్థిస్తున్నాము. హేమలత మరియు సత్యనారాయణ దంపతులు రెండునెలల కిందట 5000/- విరాళం ఇచ్చారు.

అనంతపురంలోని చిరంజీవిరెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థినులు ప్రసన్న, తనూజ, భార్గవి, రూపసాయి, చంద్రకళ గార్లు నిన్న జీవనిని సందర్శించారు. వారు పిల్లలతో చాలాసేపు ఆటపాటలతో గడిపారు. చాపలు, నోటుపుస్తకాలు, పెన్నులు తదితర సామగ్రి విరాళంగా ఇచ్చారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.



 



expenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-
JULY - 2014 - 2,25,787/- 9,17,397/-

AUGUST - 2014

11000 - 2.8.14 - mason labor 
900 - 4.8.14 - electrician labor
7350 - 6.8.14 - paints
10300 - 9.8.14 - mason labor
300 - 10.8.14 - rod bender labor 
1120 - 11.8.14 - labor
7400 - 14.8.14 - electrical material 
3700 - 16.8.14 - bricks
8500 - 16.8.14 - mason labor
2400 - 16.8.14 - painter labor 52,970/-
1300 - 17.8.14 - bricks
1000 - 18.8.14 - white wash 57,570/-
1200 - 22.8.14 - electrical material
1500 - 22.8.14 - electrical labor 60,270/-
2600 - 23.8.14 - mason labor
1500 - 23.8.14 - painter labor
3200 - 25.8.14 - cement 67,570/-
23,600 - 26.8.14 - cement 91,170/-
700 - 27.8.14 - iron labor
25,952 - 30.8.14 - plumbing material 
2300 - 30.8.14 - painting labor
4180 - 30.8.14 - mason labor 1,22,002/-


TOTAL - 10,32,399/-

Read More


జాంబియాలో బిజినెస్ రంగంలో ఉన్న శ్రీ.టి.నారాయణ రెడ్డిగారు, వారి తల్లిదండ్రులు శ్రీ.నరసింహారెడ్డి మరియు శ్రీమతి నారాయణమ్మ గార్ల పేరు మీద విరాళం ఇచ్చారు. ఇందుకు జీవని సంయుక్త కార్యదర్శి శ్రీ.చంద్రకాంత్ నాయుడు మరియు శ్రీ విజయ్ కిరణ్ గారు సహాయపడ్డారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ఈ విరాళాన్ని సోలార్ వాటర్ హీటర్ కోసం వాడనున్నాము.  



expenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-
JULY - 2014 - 2,25,787/- 9,17,397/-

AUGUST - 2014

11000 - 2.8.14 - mason labor 
900 - 4.8.14 - electrician labor
7350 - 6.8.14 - paints
10300 - 9.8.14 - mason labor
300 - 10.8.14 - rod bender labor 
1120 - 11.8.14 - labor
7400 - 14.8.14 - electrical material 
3700 - 16.8.14 - bricks
8500 - 16.8.14 - mason labor
2400 - 16.8.14 - painter labor 55,270/-
1300 - 17.8.14 - bricks
1000 - 18.8.14 - white wash 57,570/-

1200 - 22.8.14 - electrical material
1500 - 22.8.14 - electrical labor 60,270/-
 

TOTAL - 9,75,367/-

Read More

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo